Health Tips: ఊపిరితిత్తుల్లో సమస్యలను ముందుగానే పసిగట్టాలా.. ఈ టిప్స్ మీకోసమే!
శరీరంలో ఉండే ప్రతి అవయం సక్రమంగా పని చేస్తేనే ఆరోగ్యం బావుంటుంది. అలాగే ఎలాంటి అనారోగ్య సమస్యలు కూడా తలెత్తవు. అదే శరీరీంలో ఏమైనా సమస్య తలెత్తితే మాత్రం వివిధ లక్షణాల రూపంలో బయట పడుతుంది. ఆ లక్షణాలను సకాలంలో గుర్తించి చికిత్స అందిస్తే.. డేంజర్ పరిస్థితిలోకి వెళ్లకుండ ఉంటుంది. శరీరంలో గుండెతో పాటు అతి ముఖ్యంగా పరిగణించే భాగాల్లో ఊపిరి తిత్తులు కూడా ఒకటి. ఊపిరి తిత్తులు సరిగ్గా పని చేయకపోతే.. ప్రాణాలు పోయే పరిస్థితి కూడా..

శరీరంలో ఉండే ప్రతి అవయం సక్రమంగా పని చేస్తేనే ఆరోగ్యం బావుంటుంది. అలాగే ఎలాంటి అనారోగ్య సమస్యలు కూడా తలెత్తవు. అదే శరీరీంలో ఏమైనా సమస్య తలెత్తితే మాత్రం వివిధ లక్షణాల రూపంలో బయట పడుతుంది. ఆ లక్షణాలను సకాలంలో గుర్తించి చికిత్స అందిస్తే.. డేంజర్ పరిస్థితిలోకి వెళ్లకుండ ఉంటుంది. శరీరంలో గుండెతో పాటు అతి ముఖ్యంగా పరిగణించే భాగాల్లో ఊపిరి తిత్తులు కూడా ఒకటి. ఊపిరి తిత్తులు సరిగ్గా పని చేయకపోతే.. ప్రాణాలు పోయే పరిస్థితి కూడా ఉంటుంది.
ఊపిరి తిత్తులు సరిగ్గా పని చేయకపోతే కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. వీటిని కనుక ముందే గుర్తిస్తే.. ప్రాణాపాయం నుంచి తప్పుకున్నట్లే. శ్వాస తీసుకోవడంలో మార్పు వచ్చిందంటే.. ఖచ్చితంగా మీ ఊపిరి తిత్తుల్లో సమస్య ఏర్పడిందని అర్థం చేసుకోవచ్చు. శ్వాస తీసుకోవడంలో ఎలాంటి సమస్య వచ్చినా తక్షణమే వైద్యుడిని సంప్రదించడం మేలు.
ఛాతీలో నొప్పి:
ఛాతీలో నొప్పి ఎక్కువగా వస్తుందంటే.. ఊపిరి తిత్తుల్లో సమస్య ఏర్పడిందని అర్థం చేసుకోవచ్చు. ఛాతీలో తరచుగా నొప్పి వస్తున్నట్లయితే మీరు అస్సలు నిర్లక్ష్యం చేయకండి. వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. ఛాతీలో సూదులు గుచ్చినట్టు ఉండటం, నీరసం వంటివి కనిపిస్తాయి. ఈ లక్షణం వారం, నెల కూడా ఉంటుంది. ఈ లక్షణంతో పాటు శ్వాత తీసుకోవడంలో కూడా మార్పులు వస్తాయి.
గురక:
గురక రావడం ఈజీ అనుకుంటారు. కానీ మీరు నిద్రపోయేటప్పుడు గురక వచ్చిదంటే.. మీ శ్వాస కోశాల ఆరోగ్యం సరిగ్గా లేదని గమనించండి. ఊపిరి తిత్తుల్లోని వాయు మార్గాల్లో ఏదైనా అవరోధం ఉన్నా లేక శ్వాస కోశ నాళాలు సంకోచించినా.. గురక వస్తుందని అర్థం చేసుకోండి.
కఫం:
చాలా మంది కఫంతో బాధ పడుతూ ఉంటారు. ఈ కఫం అనేది అంటు వ్యాధులు లేదా ఊపిరితిత్తుల్లో ఏదైనా ఇన్ ఫెక్షన్ ఉంటేనే వస్తుంది. ఈ కఫం సమస్య నెల రోజులు దాటి ఉన్నట్లయితే.. ఊపిరి తిత్తుల వ్యాధికి సంకేతంగా చెప్పొచ్చు.
దగ్గు:
అదే పనిగా దగ్గు వస్తున్నట్లయితే అస్సలు నిర్లక్ష్యం చేయంకడి. ఆస్తమా, బ్రాంకైటిస్, ఊపిరి తిత్తుల కేన్సర్ వంటి సమస్యలు ఉంటే దగ్గు వస్తుంది. ఒక్కోసారి ఈ దగ్గు తీవ్ర తరమై రక్తం కూడా పడొచ్చు. వెంటనే డాక్టర్ని సంప్రదించాలి.
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
గమనిక: ఇది నిపుణులు, అధ్యయనాల నుంచి సేకరించిన సమాచారం. అవగాహన కోసం మాత్రమే ఈ కథనం. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడం మేలు.








