Rice: అల్పాహారంగా అన్నం తినవచ్చా.. తింటే ఏమవుతుంది?
దక్షిణ భారతదేశంలో ఎక్కువగా వరి అన్నాన్ని తీసుకుంటూ ఉంటారు. సాధారణంగా రాత్రి మిగిలిపోయిన అన్నాన్ని ఉదయాన్నే పెరుగు లేదా మజ్జిగ వేసుకొని తినే అలవాటు చాలా మందిలో ఉంటుంది. అయితే ఒక్కసారి వండినా అన్నాన్ని రెండోసారి వేడి చేయడం మాత్రం సరైన పద్ధతి కాదని డైటీషియన్లు చెబుతున్నారు.

అల్పాహారంగా అన్నం తినవచ్చా? అది తింటే ఏమవుతుంది? అనే సందేహం చాలా మందికి ఉంది. టిఫిన్ తినే అలవాటు ఇప్పుడు వచ్చింది. కానీ పూర్వం పొద్దున్నే అన్నం తినేవారు. ఇప్పుడు కూడా పల్లెటూర్లలో చాలా మంది పెద్దలు ఉదయాన్నే అన్నం తినడం గమనించవచ్చు. గంజి అన్నం, మజ్జిగ అన్నం వగైరా అల్పాహారంగా తింటారు. ఉదయాన్నే అల్పాహారంగా అన్నం తింటే చాలా మంచిది. ఎందుకంటే ఇదో శక్తివంతమైన ఫుడ్. అలాగే శరీరాన్ని చురుగ్గా ఉంచుతుంది. ఇందులో కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉంటాయి. బీన్స్, క్యారెట్, బచ్చలికూర వంటి వాటితో ఉదయం అన్నం తినడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి.
మధుమేహం వచ్చే ప్రమాదం: కానీ పొద్దున్నే అన్నం తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి. దీంతో షుగర్ ముప్పు ఉంటుంది. ఇది మీరు ఎంచుకున్న బియ్యంపై ఆధారపడి ఉంటుంది. అలాగే వెనిగర్ లేదా కొబ్బరి నూనెతో చేసిన అన్నం తినడం వల్ల జీర్ణక్రియ మందగించే అవకాశం ఉంది. కాబట్టి ఉదయాన్నే అన్నం తినాలనుకుంటే లిమిట్ పెట్టుకుంటే మంచింది.
బరువు పెరగడం: అలాగే బరువు తగ్గాలనుకునే వారు అల్పాహారంగా అన్నం తీసుకోకూడదు. మితంగా తింటే ఓకే. అతిగా తింటే మాత్రం బరువు పెరుగుతారు. ఎందుకంటే బియ్యంలో కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉంటాయి.
జీర్ణక్రియకు మంచిది: టిఫిన్ కింద అన్నం తినడం జీర్ణవ్యవస్థ ఆరోగ్యానికి మంచిది. అంతేకాకుండా, ఇది ఈజీగా జీర్ణమవుతుంది. ఉదయాన్నే అన్నం తింటే డయేరియా సమస్య నుంచి ఊరట లభిస్తుంది. ఇది ప్రేగులలో మంచి బ్యాక్టీరియాను పెంచడానికి సహాయపడుతుంది.
మితంగా తీసుకోవడం మంచిది: అన్నాన్ని అల్పాహారంగా ఎటువంటి డౌట్ లేకుండా తీసుకోవచ్చు. అయితే ఎక్కువ మోతాదులో కాదు.. మితంగా తీసుకుంటే చాలా మంచిది. చాలా మంది ఉదయం పూట పనులకు వెళ్తారు కాబట్టి ఎక్కువ ఎనర్జీ అవసరం. ఉదయాన్నే అన్నం తింటే చాలా సమస్యల నుంచి బయటపడవచ్చు. ఉదయం, మధ్యాహ్నం అన్నం తినే వారు రాత్రిపూట మాత్రం స్కిప్ చేయాలి.
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
గమనిక: ఇది నిపుణులు, అధ్యయనాల నుంచి సేకరించిన సమాచారం. అవగాహన కోసం మాత్రమే ఈ కథనం. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడం మేలు.




