AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health Tips: తేనెతో అద్భుతమైన ఉపయోగాలు.. ఇలా తీసుకుంటే కొలెస్ట్రాల్, మధుమేహం అదుపులో..

ఔషధ గుణాలు పుష్కలంగా ఉన్న తేనె ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. తేనె తింటే చాలా రోగాలు నయమవుతాయి. తేనెలో ఉండే పోషకాలు మధుమేహం, కొలెస్ట్రాల్ వంటి తీవ్రమైన..

Health Tips: తేనెతో అద్భుతమైన ఉపయోగాలు.. ఇలా తీసుకుంటే కొలెస్ట్రాల్, మధుమేహం అదుపులో..
Honey Benefits
Subhash Goud
|

Updated on: Nov 30, 2022 | 8:44 PM

Share

ఔషధ గుణాలు పుష్కలంగా ఉన్న తేనె ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. తేనె తింటే చాలా రోగాలు నయమవుతాయి. తేనెలో ఉండే పోషకాలు మధుమేహం, కొలెస్ట్రాల్ వంటి తీవ్రమైన వ్యాధులను అదుపులో ఉంచుతాయి. ఇందులో ప్రోటీన్, యాంటీ బాక్టీరియల్, యాంటీ-కార్సినోజెనిక్, యాంటీఆక్సిడెంట్ లక్షణాలు ఉన్నాయి. ఇవి గుండె, మధుమేహం వంటి వ్యాధుల ప్రమాదాన్ని తొలగిస్తాయి. మరి ఇలాంటి వారు తేనెను ఎలా తీసుకోవాలో తెలుసుకుందాం. టొరంటో యూనివర్శిటీ పరిశోధన వివరాల ప్రకారం.. తేనె కార్డియోమెటబాలిక్ ఆరోగ్యానికి మేలు చేస్తుంది. తేనె ఫాస్టింగ్ బ్లడ్ షుగర్‌ని నియంత్రిస్తుంది. మంచి కొలెస్ట్రాల్‌ను పెంచడంలో సహాయపడుతుంది.

మధుమేహం నియంత్రణ:

తేనె వాడటం వల్ల మధుమేహం అదుపులో ఉంటుంది. షుగర్ వ్యాధికి తేనె తీపిగా ఎలా ఉపయోగపడుతుందనే విషయంపై అందరూ అయోమయం చెందుతారు. నిజానికి తేనెలో ఉండే పోషకాలు గ్లూకోజ్‌ని నియంత్రించడానికి పని చేస్తాయి. ఇది తీపి కోరికలను తీరుస్తుంది. ఈ విధంగా తేనె తీసుకోవడం ద్వారా మధుమేహం నియంత్రణలో ఉంటుంది.

కొలెస్ట్రాల్‌ నియంత్రణ

కొలెస్ట్రాల్‌ను నియంత్రించడంలో తేనె సహాయపడుతుంది. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి. మీకు కొలెస్ట్రాల్ పెరుగుతుందనే భయం ఉంటే, పచ్చి వెల్లుల్లిని ఒక చెంచా తేనెతో కలిపి తింటే చాలా ప్రయోజనం ఉంటుంది. ఈ రెండూ కొలెస్ట్రాల్‌ను నియంత్రించడంలో పని చేస్తాయి. గుండెకు మేలు చేస్తాయి.

ఇవి కూడా చదవండి

ఎలా సేవించాలి?

రోజూ ఒక టీస్పూన్ (35-40) గ్రాముల తేనె తీసుకోవడం ప్రయోజనకరం. టీలో చక్కెరకు బదులు తేనెను వాడితే ఎంతో మేలు జరుగుతుంది. మీరు తేనెను ఆరోగ్యకరమైన డికాక్షన్‌లో కలపడం ద్వారా కూడా తీసుకోవచ్చు.

మరిన్ని ప్రయోజనాలు:

మధుమేహం, కొలెస్ట్రాల్ కాకుండా అనేక ఇతర వ్యాధులను నయం చేయడంలో తేనె ప్రయోజనకరంగా ఉంటుంది. జీర్ణక్రియ, జలుబు, గొంతు సమస్యలు, ఊబకాయం వంటి సమస్యలను తొలగించడానికి తేనె పనిచేస్తుంది. తేనె తినడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఇది జుట్టు, చర్మానికి కూడా ఉపయోగకరంగా ఉంటుంది.

మరిన్ని హెల్త్  వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
'పెద్ది' డైరెక్టర్ తో సినిమా.. చిరు రియాక్షన్ ఏంటో చూశారా? వీడియో
'పెద్ది' డైరెక్టర్ తో సినిమా.. చిరు రియాక్షన్ ఏంటో చూశారా? వీడియో
భారీ గ్రహాల కదలికలు.. వీరికి కుప్పలు తెప్పలుగా డబ్బు..
భారీ గ్రహాల కదలికలు.. వీరికి కుప్పలు తెప్పలుగా డబ్బు..
రోహిత్ రనౌట్ వివాదంపై క్లారిటీ ఇచ్చిన టీమిండియా కెప్టెన్
రోహిత్ రనౌట్ వివాదంపై క్లారిటీ ఇచ్చిన టీమిండియా కెప్టెన్
గాడ నిద్రలో ఉండగా దూసుకొచ్చిన మృత్యువు.. తెల్లారే సరికి..
గాడ నిద్రలో ఉండగా దూసుకొచ్చిన మృత్యువు.. తెల్లారే సరికి..
తినడానికి తిండి లేదు అంటే కారునిండా సరుకులు తెచ్చి ఇచ్చాడు..
తినడానికి తిండి లేదు అంటే కారునిండా సరుకులు తెచ్చి ఇచ్చాడు..
అమ్మాయి పిలిచిందని వెళ్లాడు..తిరిగి శవమై వచ్చిన టెకీ! ఏం జరిగిందో
అమ్మాయి పిలిచిందని వెళ్లాడు..తిరిగి శవమై వచ్చిన టెకీ! ఏం జరిగిందో
పోలీసులు అరెస్ట్ చేస్తే ఆ హీరో ఒక్క ఫోన్ కాల్ చేసి విడిపించారు
పోలీసులు అరెస్ట్ చేస్తే ఆ హీరో ఒక్క ఫోన్ కాల్ చేసి విడిపించారు
వందరోగాలను తరిమికొట్టే మునగాకు పొడి..ఎలా చేయాలో తెలుసా?
వందరోగాలను తరిమికొట్టే మునగాకు పొడి..ఎలా చేయాలో తెలుసా?
ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు రాసినవారికి బిగ్ అప్డేట్.. ఫలితాల తేదీ
ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు రాసినవారికి బిగ్ అప్డేట్.. ఫలితాల తేదీ
హమ్మయ్య.. ఏపీ, తెలంగాణలోని ఈ ప్రాంతాల్లో వర్షాలు..
హమ్మయ్య.. ఏపీ, తెలంగాణలోని ఈ ప్రాంతాల్లో వర్షాలు..