Hibiscus Flower Tea Benefits: అధిక బరువుని తగ్గించే మందార పువ్వుల టీ.. తయారు చేసుకోండిలా

| Edited By: Ravi Kiran

Aug 12, 2023 | 6:39 AM

మందార పూలతో టీ ఏంటి? అని అంత తేలిగ్గా తీసిపారేయకండి. దానివల్ల చాలా లాభాలున్నాయి. మందాల పువ్వుల్లో ఉండే సమ్మేళనాలు లివర్లో కొవ్వును పేరుకుపోకుండా చేస్తాయి. అలాగే చిన్నపేగులు మనం తినే ఆహారాలలో ఉండే కొవ్వులను శోషించుకోకుండా చేస్తుందీ మందాలపూల టీ. షుగర్ ఉన్నవారు ఈ టీ తాగితే కంట్రోల్ అవుతుంది. ఇన్సులిన్ నిరోధకత తగ్గి.. రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. ఆకలి కూడా నియంత్రణలో..

Hibiscus Flower Tea Benefits: అధిక బరువుని తగ్గించే మందార పువ్వుల టీ.. తయారు చేసుకోండిలా
Hibiscus Tea
Follow us on

పల్లెటూళ్లలో గమనిస్తే.. ప్రతి ఇంటికొక మందార చెట్టు ఖచ్చితంగా ఉంటుంది. పట్టణాల్లోనూ అక్కడక్కడా మందారచెట్లు దర్శనమిస్తాయి. కానీ సిటీల్లో మాత్రం పచ్చదనం రోజురోజుకూ కరువు అవుతుంది. ఇంటికొక చెట్టు కాదు కదా.. కనీసం మొక్కకూడా ఉండట్లేదు. ఏవో క్రోటన్ మొక్కలు, అందాన్నిచ్చే మొక్కల్ని పెంచుతున్నారు. పల్లెటూళ్లలో ఉన్న అలవాటుమీద పిల్లల వద్ద ఉండే కొందరు తల్లిదండ్రులు మాత్రం టెర్రస్ గార్డెనింగ్ చేస్తూ.. అంతో ఇంతో ఆరోగ్యాన్నిచ్చే కూరగాయల్ని సాగుచేస్తున్నారు. సరే.. ఇదంతా పక్కనపెడితే.. మీ ఇంటిపెరట్లో ఎర్రమందారం మొక్క ఉంటే.. మీరు బరువు తగ్గడం చాలా ఈజీ. మందారపూల టీతో అది సాధ్యం.

మందార పూల టీతో సూపర్ లాభాలు:

మందార పూలతో టీ ఏంటి? అని అంత తేలిగ్గా తీసిపారేయకండి. దానివల్ల చాలా లాభాలున్నాయి. మందాల పువ్వుల్లో ఉండే సమ్మేళనాలు లివర్లో కొవ్వును పేరుకుపోకుండా చేస్తాయి. అలాగే చిన్నపేగులు మనం తినే ఆహారాలలో ఉండే కొవ్వులను శోషించుకోకుండా చేస్తుందీ మందాలపూల టీ. షుగర్ ఉన్నవారు ఈ టీ తాగితే కంట్రోల్ అవుతుంది. ఇన్సులిన్ నిరోధకత తగ్గి.. రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. ఆకలి కూడా నియంత్రణలో ఉంటుంది. గుండె జబ్బులు, వృద్ధాప్య ఛాయలు త్వరగా రాకుండా ఉంటాయి.

ఇవి కూడా చదవండి

మందార పూల టీ తయారీ విధానం:

*ముందుగా 400 మిల్లీలీటర్ల నీటిని గిన్నెలో పోసి మరిగించాలి. నీరు కొద్దిగా మరిగాక స్టవ్ ఆపి అందులో ముందే ఎండబెట్టి ఉంచుకున్న మందాల పువ్వులు ఒక టేబుల్ స్పూన్ మోతాదులో వేసి.. మూత పెట్టి 5 నిమిషాలు ఉంచాలి.

ఎండిన మందారపువ్వుల్లోని సారం మరిగిన నీటిలోకి చేరుతుంది. 5 నిమిషాల తర్వాత మూత తీసేసి.. ఆ నీటిని వడగట్టుకోవాలి. అంతే మందారపువ్వుల టీ రెడీ.

ఇలా తయారు చేసుకున్న ఈ టీ ని రోజుకు మూడుసార్లు తాగాలి. తాగేముందు వేడిచేసుకోవాలి. చక్కెర మాత్రం కలపకూడదు. కావాలంటే తేనె లేదా స్వచ్ఛమైన బెల్లం కొద్దిగా కలుపుకోవచ్చు. భోజనానికి అరగంట ముందు మందారపువ్వుల టీ ని తాగితే అధిక బరువు ఉన్నవారు చాలా ఈజీగా బరువు తగ్గుతారు. కనీసం రెండువారాలపాటైనా ఈ చిట్కాను పాటిస్తే.. నెమ్మదిగా ఫలితాలు పొందవచ్చు.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి