Tonsil Problem: ఉప్పు నీరు టాన్సిల్స్‌ సమస్యను తొలగిస్తుందా..? ఇందులో నిజమెంత..?

Tonsil Problem: గొంతులో బాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు టాన్సిల్ సమస్యలు ఏర్పడతాయి. వాతావరణంలో మార్పుల వల్ల కూడా ఈ సమస్య వస్తుంది. టాన్సిల్స్ కారణంగా..

Tonsil Problem: ఉప్పు నీరు టాన్సిల్స్‌ సమస్యను తొలగిస్తుందా..? ఇందులో నిజమెంత..?
Tonsil Problem
Follow us

| Edited By: Ravi Kiran

Updated on: Aug 31, 2022 | 6:14 PM

Tonsil Problem: గొంతులో బాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు టాన్సిల్ సమస్యలు ఏర్పడతాయి. వాతావరణంలో మార్పుల వల్ల కూడా ఈ సమస్య వస్తుంది. టాన్సిల్స్ కారణంగా గొంతు నొప్పి, గొంతు మంట తలెత్తుతుంది. నోరు తెరిచినప్పుడు నొప్పిగా ఉంటుంది లేదా ఆహారం మింగడానికి ఇబ్బందిగా ఉంటుంది. ఇందుకే సమస్య చాలా పెరుగుతుంది. చాలా మంది టాన్సిల్స్ చికిత్స కోసం అనేక రకాల మందులు తీసుకుంటారు. అయినా సమస్య పరిష్కారం కాదు. మీరు కూడా ఒకసారి ఈ హోం రెమెడీస్ పాటించండి. వీటిలో సర్వసాధారణం ఉప్పునీరు తాగడం. అయితే ఇది నిజంగా ఈ సమస్యను పరిష్కరిస్తుందా? లేదా అనే విషయం తెలుసుకుందాం.

ఇందులో నిజమెంత..?

మీరు ఉప్పునీటితో పుక్కిలిస్తే, మీరు గొంతులో కొంత ఉపశమనం కలుగుతుంది. టాన్సిల్స్ సమస్యను పెంచే బాక్టీరియా గోరువెచ్చని ఉప్పునీటితో కాసేపటికి నశిస్తాయి. అందుకే గొంతు నొప్పిగా ఉందంటే ఉప్పునీరు తాగాలని అంటారు. మీరు రోజుకు రెండు-మూడు సార్లు ఉప్పునీటితో పుక్కిలిస్తే కొన్ని రోజుల్లో టాన్సిల్ నొప్పి, వాపు నుండి ఉపశమనం పొందవచ్చు.

ఇవి కూడా చదవండి

పాలు, తేనె ఉపయోగించండి

టాన్సిల్స్‌ నొప్పి, వాపు నుండి ఉపశమనం పొందడానికి మీరు పాలు, తేనెను కూడా ఉపయోగించవచ్చు. రాత్రి పడుకునే ముందు గోరువెచ్చని పాలలో తేనె కలిపి తాగవచ్చు. ఇది మీకు గొంతు ఇన్ఫెక్షన్ నుండి ఉపశమనం కలిగిస్తుంది.

టాన్సిల్ చికిత్స

టాన్సిల్స్ సమస్య వెనుక ప్రధాన కారణం గొంతులో బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్. టాన్సిల్స్ చికిత్సకు మీకు యాంటీ బాక్టీరియల్ మందులు వాడవచ్చు. మీకు ఎక్కువ టాన్సిల్ సమస్యలు ఉంటే మీరు యాంటీబయాటిక్స్ పూర్తి కోర్సు చేయాలి. చాలామంది ఈ కోర్సును మధ్యలో వదిలేస్తే, అప్పుడు సమస్య పెరుగుతుంది. టాన్సిల్స్ సమస్య మరింత పెరిగితే ఈ పరిస్థితిలో సర్జరీ చేయాల్సి ఉంటుంది.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి