Diabetes: టైప్ 1 డయాబెటిస్ ఉన్న రోగులు ఈ పొరపాటు అస్సలు చేయకూడదు.. ప్రమాదమే..!
Diabetes: ప్రపంచ వ్యాప్తంగా డయాబెటిస్ చాలా మందిని వేధిస్తోంది. చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు వెంటాడుతోంది. ఇంటర్నేషనల్ ద్వారా ఆన్‌లైన్ సర్వే (2018) ప్రకారం..ఇక టైప్-1 డయాబెటిస్..
Diabetes: ప్రపంచ వ్యాప్తంగా డయాబెటిస్ చాలా మందిని వేధిస్తోంది. చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు వెంటాడుతోంది. ఇంటర్నేషనల్ ద్వారా ఆన్‌లైన్ సర్వే (2018) ప్రకారం..ఇక టైప్-1 డయాబెటిస్ బారిన పడిన వారి సంఖ్య పెరిగిపోతోంది. ఇన్సులిన్ స్థాయి తగ్గడం వల్ల మధుమేహం వెంటాడుతుంటుంది. 90 దేశాల్లో మొత్తం 1,478 మందిపై నిర్వహించిన ఓ సర్వేలో కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు వెల్లడయ్యాయి. వీరిలో మొత్తం 253 (18 శాతం) మంది గత ఏడాదిలో కనీసం ఒక్కసారైనా ఇన్సులిన్ రేషన్‌కు అంగీకరించారు.
ఇన్సులిన్ రేషనింగ్ అంటే ఏమిటి?
న్యూ ఢిల్లీలోని ఫోర్టిస్ సి-డాక్ హాస్పిటల్ ఎండోక్రినాలజీ కన్సల్టెంట్ డాక్టర్ అమృత ఘోష్ TV9తో మాట్లాడుతూ, ఇన్సులిన్ రేషన్ అంటే చాలా తక్కువ మోతాదులో ఇన్సులిన్ తీసుకోవడం లేదా పూర్తిగా నిలిపివేయడమని అన్నారు. ఇన్సులిన్ ఇంజెక్షన్లు తీసుకోవాల్సిన వ్యక్తులకు ఈ ఔషధం ఎంత ఖరీదైనదో తెలుసు. ఇన్సులిన్ రేషనింగ్ అంటే ఇన్సులిన్ ఇంజెక్షన్లు తీసుకోకపోవడం లేదా సరిపోని తక్కువ మోతాదు తీసుకోవడం. ఇది ప్రాణాంతకమైన పరిస్థితి. కానీ ఆకాశాన్నంటుతున్న ధరల కారణంగా చాలా మంది ప్రజలు అలా చేయవలసి వస్తుంది.
ఇన్సులిన్ ధర చాలా ఎక్కువగా ఉన్న అమెరికా వంటి దేశాల్లో ఇన్సులిన్ రేషన్ చాలా ఎక్కువగా ఉందని ఆయన అన్నారు. యుఎస్ మార్కెట్‌లో హుమలాగ్ సీసా ధర $275. హుమలాగ్ తీసుకునే రోగులకు సాధారణంగా నెలకు రెండు సీసాలు అవసరం. దీని ధర చాలా ఎక్కువ కాబట్టి, భరించలేని వారు, వారి మోతాదును తగ్గించుకుంటారు. అయితే భారతదేశంలో ఈ కేసులు భిన్నంగా ఉన్నాయి. ఇన్సులిన్ రేషన్ భావన గురించి ప్రజలకు పెద్దగా తెలియదు.
ఎందుకంటే అమెరికాతో పోలిస్తే భారత్‌లో ఇన్సులిన్ ధర చాలా తక్కువ. 10ml Humalog ఇన్సులిన్ ధర దాదాపు రూ.500 ఉంటుంది. అయితే, అనలాగ్ ఇన్సులిన్ ధర ఎక్కువగా ఉంటుంది. టైప్ 1 డయాబెటిస్ ఉన్న వ్యక్తులు వారి ఇన్సులిన్ మోతాదును రేషన్ చేయకూడదని అంటున్నారు వైద్యులు. టైప్ 1 డయాబెటిక్ పేషెంట్ తగిన మోతాదులో ఇన్సులిన్ తీసుకోకపోతే, గ్లూకోజ్ స్థాయి పెరగడం వల్ల డయాబెటిక్ కీటోయాసిడోసిస్ ఏర్పడవచ్చంటున్నారు. ఇది ప్రాణాపాయమని డాక్టర్ ఘోష్ చెప్పారు. ఆరోగ్యకరమైన జీవనశైలిని అవలంబించడం వల్ల ఇన్సులిన్ తీసుకోవడం అనేది ఉంటుంది. టైప్ 1, 2 మధుమేహం ఉన్న రోగులు పిండి పదార్థాలు తక్కువగా ఉన్న కానీ ప్రొటీన్లు ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం. వారు క్రమం తప్పకుండా శారీరక వ్యాయమాలు చేయడం తప్పనిసరి.
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి