AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health Tips: ఆరోగ్యంగా, ఫిట్‌గా ఉండటానికి ఈ సులభమైన చిట్కాలను పాటించండి..!

Health Tips: అనారోగ్యకరమైన జీవనశైలి మన ఆరోగ్యంపై చాలా చెడు ప్రభావం చూపుతుంది. దీంతో అనారోగ్య సమస్యలు ఎదుర్కొవాల్సి వస్తోంది. కొన్నిసార్లు మనం బిజీగా..

Health Tips: ఆరోగ్యంగా, ఫిట్‌గా ఉండటానికి ఈ సులభమైన చిట్కాలను పాటించండి..!
Subhash Goud
|

Updated on: Mar 07, 2022 | 9:40 PM

Share

Health Tips: అనారోగ్యకరమైన జీవనశైలి మన ఆరోగ్యంపై చాలా చెడు ప్రభావం చూపుతుంది. దీంతో అనారోగ్య సమస్యలు ఎదుర్కొవాల్సి వస్తోంది. కొన్నిసార్లు మనం బిజీగా ఉండటం వల్ల ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడంలో నిర్లక్ష్యం చేస్తుంటాము. ఈ అనారోగ్యకరమైన ఆహారాలు (Food) మన ఆరోగ్యానికి చాలా హానికరం. అదే సమయంలో నిద్ర (Sleep)సరిగా పట్టకపోవడం వల్ల చాలా సార్లు ఒత్తిడి, అలసట వంటి సమస్యలను ఎదుర్కొవాల్సి వస్తుంది. ఇంటి నుండి పని చేసే సమయంలో ఎక్కువసేపు ఒకే చోట కూర్చోవడం వల్ల కూడా వెన్నునొప్పి వంటి సమస్యలు వస్తాయి. అటువంటి పరిస్థితిలో ఆరోగ్యకరమైన జీవనశైలిని కలిగి ఉండటం చాలా ముఖ్యం. ఆరోగ్యంగా, ఫిట్‌గా ఉండటానికి మీరు ఏ చిట్కాలను అనుసరించవచ్చో తెలుసుకుందాం .

అల్పాహారం మానుకోవద్దు

మీరు ఫిట్‌గా ఉండాలనుకుంటే లేదా బరువు తగ్గాలనుకుంటే ఖచ్చితంగా ఆరోగ్యకరమైన అల్పాహారం తీసుకోండి. చాలా సార్లు ప్రజలు బరువు తగ్గడం ఆధారంగా అల్పాహారం తీసుకోరు. ఇది మీ ఆరోగ్యానికి హానికరం. అల్పాహారం ఉండేలా చూసుకోండి. ఇది మీ జీవక్రియను వేగవంతం చేస్తుంది. మీ శరీరానికి శక్తిని అందిస్తుంది. అల్పాహారం మీ శరీరానికి ఉదయం వ్యాయామం చేయడానికి శక్తిని ఇస్తుంది. అలాగే మధ్యాహ్నం భోజనం వరకు మిమ్మల్ని నిండుగా ఉంచుతుంది. ప్రొటీన్‌తో కూడిన అల్పాహారం తీసుకోవచ్చు.

నీరు తాగాలి

రోజంతా హైడ్రేటెడ్‌గా ఉండటం చాలా ముఖ్యం. అందువల్ల, మీరు ప్రతిరోజూ కనీసం 3 నుండి 4 లీటర్ల నీరు తాగాలి. తగినంత నీరు త్రాగకపోవడం వల్ల కొన్నిసార్లు మీరు నీరసంగా ఉంటారు. తగినంత నీరు తాగడం ద్వారా, మీ జీర్ణక్రియ సరిగ్గా ఉంటుంది. మీ శరీరం నుండి టాక్సిన్స్ బయటకు వస్తాయి.

ఆరోగ్యకరమైన స్నాక్స్

మీకు ఆకలిగా అనిపించినప్పుడల్లా, ఏదైనా తినాలనుకున్నప్పుడు అనారోగ్యకరమైన ఆహారానికి బదులుగా ఆరోగ్యకరమైన స్నాక్స్ తినండి. మీరు డ్రై ఫ్రూట్స్, గింజలు, పండ్లు మొదలైనవి తీసుకోవచ్చు. అనారోగ్యకరమైన స్నాక్స్ కేలరీలను పెంచుతాయి.

రోజువారీ వ్యాయామం

మీరు ఫిట్‌గా ఉండాలంటే రోజూ వ్యాయామం చేయడం తప్పనిసరి. ఫిట్‌గా ఉండేందుకు జిమ్‌కి వెళ్లాల్సిన అవసరం లేదు. మీరు ఇంట్లో వర్కవుట్ రొటీన్ చేయవచ్చు. ఇది అదనపు కేలరీలను తగ్గించడంలో సహాయపడుతుంది. మిమ్మల్ని శక్తివంతంగా ఉంచుతుంది.

మంచి నిద్ర..

సరిగ్గా నిద్రపోకపోవడం వల్ల మానసిక ఒత్తిడికి గురవుతారు. మీరు ప్రతిరోజూ కనీసం 7-9 గంటల నిద్రను పొందడం అవసరం. నిద్ర మీ శరీరంలోని ప్రతి వ్యవస్థను నియంత్రించడంలో సహాయపడుతుంది. తద్వారా అది సరిగ్గా పని చేస్తుంది. నిద్ర లేకపోవడం వల్ల మీ శరీరం ఒత్తిడికి లోనవుతుంది.

ఇవి కూడా చదవండి:

Summer Tips: సమ్మర్‌లో శక్తినిచ్చే పండ్ల రసాలు.. అద్భుతమైన ప్రయోజనాలు..!

Summer Health Tips: వేసవిలో వచ్చే గ్యాస్‌ సమస్యకు చెక్‌ పెట్టండిలా..!