Health Tips: నిలబడి నీళ్లు, కూర్చుని పాలు అస్సలు తాగకూడదు.. ఆయుర్వేదం చెబుతున్న కీలక విశేషాలు..
Health Tips: ఏదైనా మంచి, చెడు జరగడానికి కారణం దానిని చేసే విధానం. అది వంటకి సంబంధించినదైనా, చదువుకు సంబంధించినదైనా..
Health Tips: ఏదైనా మంచి, చెడు జరగడానికి కారణం దానిని చేసే విధానం. అది వంటకి సంబంధించినదైనా, చదువుకు సంబంధించినదైనా, మరేదైనా సరే. ఆయుర్వేదం ప్రకారం ఈ విషయం చాలా విషయాలకు వర్తిస్తుంది. ఇవాళ మనం పాలు ఎందుకు నిలబడి తాగాలి? దాని ప్రయోజనాలు ఏంటి? కూర్చుని నీటిని ఎందుకు తాగాలి? దాని వలన ప్రయోజనాలేంటి? అన్నది తెలుసుకుందాం. నిజానికి ఈ రెండు పనులు సరిగా చేయకపోతే అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుందని ఆయుర్వేదం చెబుతోంది. ఇంతకీ పాలు నిలబడి తాగడానికి, నీళ్లు కూర్చుని తాగడానికి కారణాలేంటో ఇప్పుడు చూద్దాం..
నిలబడి పాలు ఎందుకు తాగాలి..? పాలు.. జలుబు, వాత, పిత్త సమస్యలను సమతుల్యం చేస్తాయి. అందువల్ల కూర్చొని పాలు తాగేవారు జీర్ణక్రియ సమస్యను ఎదుర్కోవలసి ఉంటుంది. అందుకే ఆయుర్వేదంలో.. రాత్రి నిద్రపోయే ముందు గానీ, రాత్రి భోజనం చేసిన రెండు గంటల తర్వాత గానీ పాలు నిలబడి తాగాలని సూచించారు. తద్వారా శరీరం దాని పూర్తి ప్రయోజనాలను పొందుతుందని పేర్కొన్నారు.
నిలబడి పాలు తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు.. 1. ఇది కీళ్లను బలోపేతం చేస్తుంది. 2. కండరాలకు మేలు చేస్తుంది. 3. క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. 4. గుండె జబ్బులు, రక్తపోటు ప్రమాదాన్ని తగ్గిస్తుంది. 5. కళ్ళు, చర్మానికి మేలు చేస్తుంది.
కూర్చొని నీరు ఎందుకు త్రాగాలి? నిలబడి నీరు త్రాగడం వలన.. అన్నవాహిక, శ్వాసనాళంలో ఆక్సీజన్ సరఫరాను నిలిపివేస్తుందని ఆయుర్వేదంలో పేర్కొన్నారు. ఇది ఊపిరితిత్తులు, గుండెపై కూడా ప్రభావం చూపుతుంది. నిలబడి నీళ్లు తాగడం వల్ల కూడా కీళ్లనొప్పులు, హెర్నియా వచ్చే అవకాశం ఉంది. అదే సమయంలో ఎసిడిటీ, గ్యాస్, బెల్చింగ్ సమస్య కూడా రావచ్చు.
నీటిని కూర్చోని తాగడం వలన కలిగే ప్రయోజనాలు.. 1. శరీరంలోని అన్ని కణాలకు చేరుకోవడంలో సహాయపడుతుంది. 2. శరీరానికి అవసరమైనంత ఎక్కువ నీటిని గ్రహించడంలో సహాయపడుతుంది. మూత్రం ద్వారా వ్యర్థాలను బయటకు పంపిస్తుంది. 3. రక్తంలోని హానికరమైన పదార్థాలను శుభ్రపరుస్తుంది.
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..