తెలుగు రాష్ట్రాల ఫేమస్.. చేపల తలకూర ఇలా చేస్తే.. టేస్ట్ నెక్స్ట్ లెవెల్

Prasanna Yadla

20 February 2026

Pic credit - Pixabay

తెలుగు రాష్ట్రాల్లో చేపల కూర ఎంత ఫేమస్ అనేది ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటికీ దీనిని  ప్రతి వారం ఎంతో మంది తింటారు.

చేపల కూర

అయితే, చేపలతో అనేక వంటకాలు చేసుకుని తినొచ్చు. అన్నింటి కంటే చేప తల కూర రుచికరంగా ఉంటుంది.

చేప తలకూర

చేప తలకూరకు కావాల్సిన పదార్థలు, తయారీ విధానం గురించి ఇక్కడ తెలుసుకుందాం..

చేప తలకూర

చేపల తలలు, చింతపండు రసం, ఒక పెద్ద ఉల్లిపాయలు, 4 పచ్చిమిర్చి, ఒక టేబుల్ స్పూన్ అల్లం-వెల్లుల్లి పేస్ట్, 2 టేబుల్ స్పూన్స్  కారం, రుచికి సరిపడినంత ఉప్పు, ధనియాల పొడి తీసుకోవాలి.

కావాల్సిన పదార్ధాలు

ముందుగా చేప తలలను తీసుకుని ఉప్పుతో బాగా శుభ్రం చేసి  చింతపండు రసంలో బాగా ఉడికించాలి. ఇలా చేస్తే రుచికరంగా ఉంటుంది.

స్టెప్ -1

స్టవ్ వెలిగించి పాన్ పెట్టి కొద్దిగా నూనె వేసి అది వేడయ్యాక ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు బాగా వేయించాలి.

స్టెప్ -2

అల్లం-వెల్లుల్లి పేస్ట్, పసుపు, కారం, ధనియాల పొడి వేసి పచ్చివాసన పోయే వరకు వేయించాలి. శుభ్రం చేసిన చేపల తలలను, చింతపండు రసాన్ని, తగినంత ఉప్పు వేసి, రెండు గ్లాస్ లు నీళ్ళు పోసి మూత పెట్టి బాగా ఉడికించండి.  

స్టెప్ -3

20 నిముషాల పాటు స్టవ్ మీద ఉంచి సన్నని మంట మీద చేప తలలు పైకి  తేలే వరకు అలాగే పొయ్యి మీదే ఉంచాలి. దించే ముందు కొత్తిమీర చల్లుకుని దించేయండి. అంతే, వేడి వేడి చేప తలకూర రెడీ.  

చేప తలకూర రెడీ