AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ginger Benefits: అల్లంతో 11 ఆరోగ్య ప్రయోజనాలు.. అది కూడా ఉందండోయ్..

Ginger Benefits: అల్లం అద్భుత ఆరోగ్య ప్రదాయిని. ఇది మీ జీర్ణక్రియకు సహాయపడటే కాకుండా.. అనేక ఇతర ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి.

Ginger Benefits: అల్లంతో 11 ఆరోగ్య ప్రయోజనాలు.. అది కూడా ఉందండోయ్..
Ginger
Shiva Prajapati
|

Updated on: Aug 12, 2022 | 10:39 PM

Share

Ginger Benefits: అల్లం అద్భుత ఆరోగ్య ప్రదాయిని. ఇది మీ జీర్ణక్రియకు సహాయపడటే కాకుండా.. అనేక ఇతర ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. వంటింట్లో లభించే దివ్యఔషధం అల్లం. పసుపు, ఏలకులు, గలాంగల్‌తో అల్లం కు దగ్గరి సంబంధం ఉంటుంది. అల్లం ను తాజా, ఎండబెట్టి, పొడి లేదా రసంగా కూడా ఉపయోగించవచ్చు. వంటకాల్లో ఇది చాలా సాధారణమైన పదార్థం. అల్లం ను ప్రాసెస్ చేయబడిన ఆహారాల్లో, సౌందర్య సాధనాలలోనూ ఉపయోగిస్తారు.

అల్లం వలన కలిగే 11 ఆరోగ్య ప్రయోజాల నుంచి ఇప్పుడు తెలుసుకుందాం.. 1. సాంప్రదాయ, ప్రత్యామ్నాయ వైద్యంలో వివిధ రూపాల్లో అల్లంను వినియోగిస్తారు. మెరుగైన జీర్ణక్రియకు సహాయపడుతుంది. వికారం తగ్గిస్తుంది. ఫ్లూ, జలుబులతో పోరాడటానికి సహాయపడుతుంది. అల్లంలో జింజెరాల్ ప్రధాన బయోయాక్టివ్ సమ్మేళనం ఉంటుంది. అల్లంలోని చాలా ఔషధ గుణాలకు ఇది కారణం.

2. వికారం ను తగ్గిస్తుంది. కొన్ని రకాల శస్త్రచికిత్సలు చేయించుకుంటున్న వ్యక్తులలో వికారం, వాంతులు సమస్య ఎక్కువగా ఉంటుంది. ఈ సమస్య నుంచి ఉపశమనం పొందడంలో అల్లం సహాయపడుతుంది. కీమోథెరపీ వల్ల కలిగే వికారం నివారణకు అల్లం సహాయపడుతుంది. గర్భధారణ సమయంలో వచ్చే వికారంను కూడా తగ్గిస్తుంది. అయితే, ప్రసవానికి దగ్గరగా ఉన్న మహిళలు అల్లం తినకూడదని వైద్యులు సూచిస్తున్నారు.

3. బరువు తగ్గడంలో సహాయపడుతుంది. వివిధ అధ్యయనాల ప్రకారం.. బరువు తగ్గడంలో అల్లం అద్భుత పాత్ర పోషిస్తుంది. 2016లో 80 మంది స్థూలకాయ మహిళలపై జరిపిన అధ్యయనంలో అల్లం బాడీ మాస్ ఇండెక్స్ (BMI), బ్లడ్ ఇన్సులిన్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుందని కనిపెట్టారు.

4. ఆర్థరైటిస్ ఆర్థరైటిస్ అనేది ఒక సాధారణ ఆరోగ్య సమస్య. కీళ్ల నొప్పులు వస్తాయి. అల్లం ఈ సమస్య నుంచి కాస్త ఉపశమనం కలిగిస్తుంది.

5. రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గిస్తుంది. గుండె జబ్బు ప్రమాద కారకాలను తగ్గిస్తుంది.

6. దీర్ఘకాలిక అజీర్తి సమస్యను నివారించడంలో సహాయపడుతుంది.

7. ఋతుక్రమం సమయంలో వచ్చే నొప్పిని తగ్గిస్తుంది.

8. కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది. అధిక స్థాయి LDL (చెడు) కొలెస్ట్రాల్ గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతుంది. అల్లం, చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది

9. క్యాన్సర్‌ను నివారించడంలో సహాయపడుతుంది. అల్లం అనేక రకాల క్యాన్సర్‌లకు ప్రత్యామ్నాయ నివారణగా అధ్యయనంలో తేలింది.

10. మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది. అల్జీమర్స్ వ్యాధి నుండి కాపాడుతుంది. ఆక్సీకరణ ఒత్తిడి, దీర్ఘకాలిక కడుపు మంట, జీర్ణ ప్రక్రియను వేగవంతం చేస్తుంది.

11. అంటువ్యాధులతో పోరాడటానికి సహాయపడుతుంది. జింజెరాల్ వ్యాధుల సంక్రమణ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. అల్లం.. వివిధ రకాల బ్యాక్టీరియా పెరుగుదలను నిరోధిస్తుంది.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..