Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మొక్కజొన్న ప్రయోజనాలు తెలిస్తే.. అస్సలు వదిలిపెట్టరు

మొక్కజొన్న.. దాదాపు తెలియని తినని వారుండరు. మొక్కజొన్నలో విటమిన్లు పుష్కలంగా లభ్యమవుతాయి. మొక్కజొన్నతో చేసిన ఆహార పదార్థాలు తిన్నా మంచిదేనని నిపుణులు సూచిస్తున్నారు. అందులోనూ ప్రస్తుతం ఉన్న వర్షాకాలంలో వేడివేడిగా..

మొక్కజొన్న ప్రయోజనాలు తెలిస్తే.. అస్సలు వదిలిపెట్టరు
health secrets of corn
Follow us
Chinni Enni

|

Updated on: Jul 25, 2023 | 8:58 PM

మొక్కజొన్న.. దాదాపు తెలియని తినని వారుండరు. మొక్కజొన్నలో విటమిన్లు పుష్కలంగా లభ్యమవుతాయి. మొక్కజొన్నతో చేసిన ఆహార పదార్థాలు తిన్నా మంచిదేనని నిపుణులు సూచిస్తున్నారు. అందులోనూ ప్రస్తుతం ఉన్న వర్షాకాలంలో వేడివేడిగా కాల్చిన మొక్కజొన్న తింటుంటే ఆ రుచే వేరు. మొక్కజొన్న గింజలు మంచి బలమైన ఆహార పదార్థం.

వీటిల్లో లినోలిక్ ఆసిడ్, విటమిన్ ఇ, బి 1, బీ 6, నియాసిన్, ఫోలిక్ ఆసిడ్ లు ఎక్కువగా ఉంటాయి. మొక్కజొన్నలో ఉండే పీచు పదార్థం.. జీర్ణక్రియకు బాగా పనిచేస్తుంది. వర్షాకాలంలో కాల్చిన మొక్కజొన్న తింటే వివిధ రకాల వైరస్‌ లు, బ్యాక్టీరియా నుండి రక్షిస్తుంది. వర్షపు నీటిలో తడిస్తే చర్మం దెబ్బతినే అవకాశం ఉంది. కాబట్టి ఈ నష్టాన్ని నివారించడానికి కాల్చిన మొక్కజొన్న తింటే మేలు.

రకరకాల వ్యాధులకు ఇది ఒక రకంగా యముడు లాంటిదని చెప్పవచ్చు. వర్షాకాలంలో జుట్టు తరచుగా రాలిపోతుంది. గరుకుగా కూడా మారుతుంది. అటువంటి పరిస్థితిలో మీరు మొక్కజొన్న తినడం ద్వారా ప్రయోజనాలను పొందవచ్చు. మొక్కజొన్న తినడం వల్ల జుట్టు తేమగా ఉంటుంది. ఇది జుట్టు పెరుగుదలకు కూడా సహాయపడుతుంది.

ఇవి కూడా చదవండి

మొక్కజొన్న గురించి ఎంత చెప్పినా తక్కువే అని చెప్పవచ్చు. దీనిలో కావాలసినన్ని మినరల్స్ ఉంటాయి. మెగ్నీషియం, ఐరన్, కాపర్, ఫాస్పరస్ వంటివి ఉంటాయి కాబట్టి.. వీటిని తింటే ఎముకలు గట్టిపడతాయి. ఇందులో ఉండే లినోలె యాసిడ్‌ చర్మమంటలను ర్యాష్‌లను తగ్గిస్తుంది.

మొక్కజొన్న మధుమేహంతో బాధపడే వారికి చాలా మంచి చేస్తుంది. అందువల్ల మొక్కొజొన్న ను రెగ్యులర్ గా ఏదో ఒక రూపంలో తీసుకోవడం శరీరానికి మంచిది. మెుక్కజొన్నలో అధికంగా ఉండే యాంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని కాంతిమంతంగా ఉంచడమేకాదు.. శరీరంపై ముడతలు రాకుండా చేస్తాయట.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం..