AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kishmish Health Benefits: ఎండుద్రాక్షతో ప్రయోజనాలు ఎన్నో.. వాటికి మాత్రం మంచి ఔషధంగా పని ఉపయోగపడతాయి

Kishmish Health Benefits: కొన్ని కొన్ని చిట్కాలను పాటిస్తుంటే మన ఆరోగ్యాన్ని మన చేతుల్లోనే పెట్టుకోవచ్చు. ఆరోగ్యం వచ్చినప్పుడు వైద్యుల వద్దకు వెళ్లేదానికంటే కొన్నింటిని ..

Kishmish Health Benefits: ఎండుద్రాక్షతో ప్రయోజనాలు ఎన్నో.. వాటికి మాత్రం మంచి ఔషధంగా పని ఉపయోగపడతాయి
Subhash Goud
|

Updated on: Mar 04, 2021 | 2:06 AM

Share

Kishmish Health Benefits: కొన్ని కొన్ని చిట్కాలను పాటిస్తుంటే మన ఆరోగ్యాన్ని మన చేతుల్లోనే పెట్టుకోవచ్చు. ఆరోగ్యం వచ్చినప్పుడు వైద్యుల వద్దకు వెళ్లేదానికంటే కొన్నింటిని పాటిస్తుంటే ఆరోగ్యంగా ఉండవచ్చు. ఇక ఎండుద్రాక్ష వల్ల ఎన్నో ప్రయోజనాలున్నాయని వైద్య నిపుణులు చెబుతున్న మాట. వీటిలో యాంటీయాక్సిడెంట్లు, పీచు పదార్థం ఉండటం వల్ల రక్తహీనతను దూరం చేస్తుంది. అలాగే జీర్ణక్రియను మెరుగుపర్చే శక్తి ద్రాక్షలో ఉంది. క్రమం తప్పకుండా రోజు ఐదారు తిసుకుంటే చిన్న పేగుల్లో ఉండే వ్యర్థ పదార్థాలను బయటకు పంపించేస్తుంది. ఎండు ద్రాక్షలో ఉండే పీచు ఉండటం వల్ల కడుపులోని నీటిని పీల్చేస్తుంది. తద్వారా విరేచనాలు, ఉదర సంబంధిత సమస్యలను దూరం చేస్తుంది.

ముఖ్యంగా స్త్రీలకు ఇవి ఎంతో ఉపయోగపడతాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. ద్రాక్ష పండ్లను ఎండబెట్టినప్పుడు ఎండు ద్రాక్ష తయారవుతుంది. ప్రపంచ వ్యాప్తంగా ఉత్పత్తి అయ్యే ద్రాక్షలో 70 నుంచి 80 శాతం వరకూ వైన్‌ తయారీలో ఉపయోగిస్తుంటారు. ఇందులో మంచి పోషక విలువలు కలిగి ఉంటాయి. కొన్ని రకాల వ్యాధులను దూరం చేస్తుంది ఎండుద్రాక్ష. వీటి వల్ల వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. క్రీడలు ఆడేవారు ఎండుద్రాక్ష తీసుకోవడం ఎంతో మేలు.

హైబీపీ, క్యాన్సర్‌ దరిచేరకుండా ఎంతో ఉపయోగపడతాయి. వీటిలోని యాంటీయాక్సిడెంట్లు క్యాన్సర్‌ కణాలను దూరం చేస్తాయి. హైబీపీని కంట్రోల్లో పెడుతుంది. రక్తకణాల ఉత్పత్తికి ఎంతగానో ఉపకరిస్తాయి. ఎండుద్రాక్షల్లో పొటాషియం రక్తనాళ్లాల్లో ఒత్తిడిని తగ్గించి ఆరోగ్యంగా ఉంచుతుంది. ఇంకా వీటిలో విటమిన్‌ బి కాంప్లెక్స్‌, ఐరన్‌ ఉండటం ద్వారా రక్తకణాల ఉత్పత్తికి ఎంతగానో ఉపకరిస్తాయి.

పిల్లలు రాతప్రూట పక్క తడుపుతుంటే..

కాగా, పిల్లలు రాతప్రూట పక్క తడుపుతుంటే వారికి వారం పాటు ప్రతిరోజూ రాత్రి రెండు ఎండు ద్రాక్షలను ఇవ్వండి. ఈ వారంలో వారికి చలవచేసే వస్తువులు, పెరుగు, మజ్జిగలాంటి పదార్థాలను ఇవ్వకండి. దీంతో పక్క తడిపే అలవాటు పూర్తిగా మానిపోతుంది. అలాగే గొంతు వ్యాధితో బాధపడేవారు గొంతు వ్యాధితో బాధపడేవారు ఎండు ద్రాక్షను తీసుకుంటే ఉపశమనం కలుగుతుంది . ఎందుకంటే ఈ ఎండు ద్రాక్ష శరీరంలోని శ్వాసనాళికలో పేరుకుపోయిన కఫాన్ని తొలగిస్తుంది. అలాంటి వారికి ఎంతో ఉపయోగపడుతుందని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

ఇవి చదవండి :

పిల్లలు ఎందుకు ఏడుస్తారో తెలుసా…? వారి ఏడుపుల్లో ఎన్నో అర్థాలు ఉన్నాయంటున్నారు చైల్డ్‌ సైకాలజీ నిపుణులు

సిగరెట్ కాల్చడం మానలేకపోతున్నారా..! అయితే ఒక్కసారి ఇలా చేసి చూడండి.. తర్వాత మీకే తెలుస్తుంది..

బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..