సిగరెట్ కాల్చడం మానలేకపోతున్నారా..! అయితే ఒక్కసారి ఇలా చేసి చూడండి.. తర్వాత మీకే తెలుస్తుంది..

Stop Smoking cigarettes : పొగ తాగడం శరీరంపై తీవ్రమైన చెడు ప్రభావం చూపుతుంది. పొగ తాగే అలవాటుకు బానిసలైనవారు చాలా మంది ఈ అలవాటును

సిగరెట్ కాల్చడం మానలేకపోతున్నారా..!  అయితే ఒక్కసారి ఇలా చేసి చూడండి..  తర్వాత మీకే తెలుస్తుంది..
Follow us
uppula Raju

|

Updated on: Mar 03, 2021 | 7:29 PM

Stop Smoking cigarettes : పొగ తాగడం శరీరంపై తీవ్రమైన చెడు ప్రభావం చూపుతుంది. పొగ తాగే అలవాటుకు బానిసలైనవారు చాలా మంది ఈ అలవాటును మానేయాలని అనుకుంటారు. కానీ ఆ అలవాటును మానటం సాధ్యం కావడం లేదని చెబుతుంటారు. కొందరు సిగరెట్ కావాలని అలవాటు చేసుకోకపోయినా సరదాగా కాల్చడం వలనో, స్నేహితుల ముందు గొప్పలు పోవడానికో అలవాటు చేసుకుంటారు. సిగరెట్లు ఎక్కువగా తాగే వారికి ఊపిరితిత్తుల క్యాన్సర్, గుండెజబ్బులు వచ్చే అవకాశం ఉంది. కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే సిగరెట్ తాగే అలవాటును దూరం చేసుకోవచ్చు.

1. ఉదయం లేవగానే 2 గ్లాసుల వేడి నీళ్లలో నిమ్మరసం పిండుకుని తాగాలి. నీళ్లలో తేనె కూడా వేసుకుని తాగచ్చు. 2.సిగరెట్ తాగాలని ఎప్పుడు అనిపించినా “మీలో మీరు నేను సిగరెట్ తాగడం మానేయాలి” అనుకోవాలి. సిగరెట్ తాగడం మానేయాలనే సంకల్పం చాలా అవసరం. 3. సంకల్పంతోపాటు, మీరు సిగరెట్ మానేయాలని డెడ్‌లైన్ పెట్టుకున్నాక కూడా మీకు సిగరెట్ తాగాలని అనిపిస్తే. ప్రశాంతంగా కూచుని, దీర్ఘంగా శ్వాస తీసుకోవాలి. నీళ్లు తాగాలి. అలా చేయడం వల్ల మీ ఆలోచనను మళ్లించవచ్చు.

4.అల్లం, కరక్కాయలను బాగా నలగ్గొట్టి దాన్ని ఎండబెట్టాలి. దాన్లో నిమ్మకాయ పిండి, ఉప్పు వేసి ఒక డబ్బాలో వేసి ఎప్పుడూ మీ దగ్గర పెట్టుకోవాలి. ఎప్పుడు సిగరెట్ తాగాలని అనిపించినా, మీరు ఆ పొడి తింటూ ఉండాలి. దానితోపాటు నారింజ, బత్తాయి, ద్రాక్ష పండ్లు తినడం, వాటి జ్యూస్ తాగడం వల్ల కూడా సిగరెట్ తాగాలనే కోరికను చంపేయవచ్చు.

5.ప్రతిరోజూ తాగే సిగరెట్ల సంఖ్యను క్రమంగా తగ్గించుకోవాలి. నికోటిన్ ప్రత్యామ్నాయంగా ఉండే ఉత్పత్తులను తీసుకొని క్రమంగా పొగ తాగడం మానేయవచ్చు. ఏ సమయంలో సిగరెట్ తాగుతున్నారో చెక్ చేసుకొని ఆ సమయంలో వేరే పనిపై మనసు మళ్లించటం మంచిది.

6.సిగరెట్ తాగకూడదు అని తీసుకున్న నిర్ణయాన్ని కుటుంబ సభ్యులకు, స్నేహితులకు చెప్పాలి. అలా చెబితే సిగరెట్ తాగాలనిపించినా వారికి భయపడి సిగరెట్ కు దూరమయ్యే అవకాశం ఉంది.

7. సిగరెట్లు తాగడం వలన కలిగే లాభాలేంటో, నష్టాలేంటో మీ మనసుతో మీరే చర్చించాలి. పొగ తాగాలనే కోరిక పెరిగితే ఎండు ఫలాలు, చిప్స్, పచ్చళ్లు తినాలి. వీటికి పొగ తాగాలనే కోరికను తగ్గించే గుణం ఉంటుంది.

8. సిగరెట్ తాగుతున్నారంటే మిమ్మల్ని మీరే కొద్దికొద్దిగా చంపుకుంటున్నారనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. సిగరెట్ మానేయాలన్న ఆలోచన బలపడితే అడుగులు సిగరెట్ వైపు పడకుండా నిగ్రహించుకుంటే కొన్ని రోజులు కష్టంగా అనిపించినా ఆ తరువాత సిగరెట్ గుర్తుకు రాదు.

సంపన్నుల జాబితాలో హైదరాబాద్ ఫార్మా దిగ్గజాలు.. గ్లోబల్ బిలియనీర్ క్లబ్‌లో 10 మందికి చోటు.. ఎవరెవరంటే..

నిరుద్యోగులకు శుభవార్త.. హెచ్‌పీసీఎల్ నుంచి అదిరిపోయే జాబ్ నోటిఫికేషన్.. చివరి సంవత్సరం విద్యార్థులూ అర్హులే..