నిరుద్యోగులకు శుభవార్త.. హెచ్‌పీసీఎల్ నుంచి అదిరిపోయే జాబ్ నోటిఫికేషన్.. చివరి సంవత్సరం విద్యార్థులూ అర్హులే..

HPCL recruitment 2021: నిరుద్యోగులకు శుభవార్త. హిందుస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్‌పిసిఎల్) నుంచి 200 ఖాళీలకు నోటిఫికేషన్ వెలువడింది.

నిరుద్యోగులకు శుభవార్త.. హెచ్‌పీసీఎల్ నుంచి అదిరిపోయే జాబ్ నోటిఫికేషన్.. చివరి సంవత్సరం విద్యార్థులూ అర్హులే..
Follow us
uppula Raju

|

Updated on: Mar 03, 2021 | 6:08 PM

HPCL recruitment 2021: నిరుద్యోగులకు శుభవార్త. హిందుస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్‌పిసిఎల్) నుంచి 200 ఖాళీలకు నోటిఫికేషన్ వెలువడింది. మెకానికల్ ఇంజనీర్, సివిల్ ఇంజనీర్, ఎలక్ట్రికల్ ఇంజనీర్, ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీర్ల నియామకానికి ఆన్‌లైన్ దరఖాస్తులను కోరుతుంది. ఆసక్తి గల అభ్యర్థులు హిందూస్తాన్ పెట్రోలియం వెబ్‌సైట్ యొక్క .. అధికారిక వెబ్‌సైట్ – hindustanpetroleum.com ను సందర్శించవచ్చు. ఈ రోజు నుంచి దరఖాస్తు పత్రాలను సమర్పించవచ్చు. చివరితేదీ ఏప్రిల్ 5గా నిర్ణయించారు. అభ్యర్థులు ఈ విషయాన్ని గమనించాలి. ఖాళీల వివరాలు కింది విధంగా ఉన్నాయి.

120 మెకానికల్ ఇంజనీర్, 30 సివిల్ ఇంజనీర్, 25 ఎలక్ట్రికల్ ఇంజనీర్, 25, ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీర్ ఖాళీల భర్తీకి హిందూస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ నియామకాలు చేపడుతోంది. ఇక అర్హతల విషయానికొస్తే.. AICTE నుంచి ఆమోదించిన లేదా UGC గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి నాలుగు సంవత్సరాలు రెగ్యూలర్ ఇంజనీరింగ్ చేసి ఉండాలి. UR / OBC NC / EWS అభ్యర్థులకు కనీసం 60% మార్కులు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 50% మార్కులు వచ్చి ఉండాలి. ఇక్కడ మరో విషయం అభ్యర్థులు గమనించాలి. చివరి సంవత్సరం బీటెక్ చదువుతున్నవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. తర్వాత జాబ్ వచ్చిన తర్వాత పాసైన సర్టిఫికెట్స్ సమర్పిస్తే సరిపోతుంది.

ఫీజు విషయానికొస్తే ఈ విధంగా నిర్ణయించారు. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యుబీడీ వర్గాలకు దరఖాస్తు రుసుము నుంచి మినహాయించారు. UR, OBC NC, మరియు EWS అభ్యర్థులు రూ. 1180 లను ఫీజుగా చెల్లించాలి. ఇందులో అప్లికేషన్ ఫీజు రూ.1000 గా నిర్ణయిస్తే జీఎస్టీ రూ.180 గా తెలిపారు. ఇక ఎంపిక ప్రక్రియ కంప్యూటర్ ఆధారిత పరీక్ష ద్వారా ఉంటుంది. ఇందులో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులకు షార్ట్ లిస్ట్ చేసి ఇంటర్వూ కండక్ట్ చేస్తారు. ఆ తర్వాత తుది ఫలితాలు వెల్లడిస్తామని వివరించారు.

SCCL Recruitment 2021: సింగరేణిలో 372 ఉద్యోగాలు.. రాత పరీక్షల తేదీలు వచ్చేశాయ్.. వివరాలు ఇవిగో

మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
పెళ్లి మండపంలో పంతులికి కోపం వస్తే.. ఇట్టాగే ఉంటది మరీ..!
పెళ్లి మండపంలో పంతులికి కోపం వస్తే.. ఇట్టాగే ఉంటది మరీ..!