AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bitter gourd: మధుమేహ బాధితులకు వరంలాంటివి ఈ గింజలు.. ఇట్టే సన్నబడతారు కూడా..!

అలాగే బరువు తగ్గాలనుకునే వారు ఈ గింజలని క్రమం తప్పకుండా తీసుకోవాలి. వీటిని తినడం వల్ల బరువు అదుపులో ఉంటుంది. దీంతో పాటు రోగనిరోధక శక్తిని పెంచడంలో ఇది ప్రధాన పాత్ర పోషిస్తుంది.

Bitter gourd: మధుమేహ బాధితులకు వరంలాంటివి ఈ గింజలు.. ఇట్టే సన్నబడతారు కూడా..!
Bitter Gourd
Jyothi Gadda
|

Updated on: Aug 06, 2022 | 12:14 PM

Share

Health Benefits of bitter gourd : కాకరకాయ అంటేనే చాలా మంది అంతదూరం వెళ్తారు. కాకరకాయ తినడం చాలా మందికి ఇష్టం ఉండదు. ఎందుకంటే అది చేదుగా ఉంటుంది కాబట్టి. కానీ కాకరకాయ తింటే కలిగే ప్రయోజనాలు తెలుసుకుంటే మాత్రం మీ అయిష్టాన్ని పక్కకు పెడతారు. కాకరకాయను ఫ్రై చేసినా, ఉడికించినా.. జ్యూస్ రూపంలో తీసుకున్నా.. అందులోని పోషకాలు శరీరానికి చాలా మేలు చేస్తాయి. ముఖ్యంగా వర్షాకాలంలో కాకరకాయను తరచుగా తీసుకోవడం మంచిది. ఇది రోగనిరోధక వ్యవస్థను పెంపొందిస్తుంది. బరువు తగ్గడానికి సహకరిస్తుంది.అయితే, ఇక్కడ కాకరకాయలు మాత్రమే కాదు..కాకర గింజలు కూడా ఆరోగ్యానికి అద్భుతంగా మేలు చేస్తాయంటున్నారు నిపుణులు. కాకరకాయ గింజలను తినడం ద్వారా అనేక రకాల వ్యాధుల నుంచి దూరంగా ఉండొచ్చంటున్నారు. కాకర గింజలు తినడం ద్వారా రక్తంలో చక్కెర, గుండెపోటు, అధిక కొలెస్ట్రాల్ సమస్యలని తగ్గిస్తాయి. ఇంకా కాకరగింజల వల్ల కలిగే మరిన్ని ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

కొంత మందికి కడుపులో చిన్న తెల్లటి పురుగులు ఉంటాయి. అలాంటి వారు 2 లేదా 3 గ్రాముల కాకరకాయ గింజలు తినాలి. అవి అందుబాటులో లేకపోతే… కాకరకాయ జ్యూస్ తాగిన మంచిదే.. అది కడుపులో పురుగుల్ని చంపుతుంది. ఇకపోతే, కాకరకాయ గింజలు తినడం వల్ల డయాబెటిక్ పేషెంట్లలో మలబద్ధకం సమస్య తొలగిపోతుంది. అంతే కాదు రక్తంలో చక్కెర స్థాయి అదుపులో ఉంటుంది. అంటే కాకర గింజలు మధుమేహ రోగులకు ఒక వరంలా పనిచేస్తాయని చెప్పొచ్చు. కాకరకాయ గింజలు డయాబెటిక్ పేషెంట్లకు మాత్రమే కాదు.. గుండె సంబంధిత అనారోగ్యాలకు కూడా చాలా మేలు చేస్తాయి. ఈ గింజలు ఎల్‌డిఎల్ అంటే చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి మంచి కొలెస్ట్రాల్‌ను పెంచుతాయి. అంటే మీ కొలెస్ట్రాల్ స్థాయి నియంత్రణలో ఉంటే మీకు గుండెపోటు ప్రమాదం కూడా తగ్గుతుంది.

అలాగే బరువు తగ్గాలనుకునే వారు కాకరకాయ గింజలని క్రమం తప్పకుండా తీసుకోవాలి. వీటిని తినడం వల్ల బరువు అదుపులో ఉంటుంది. దీంతో పాటు రోగనిరోధక శక్తిని పెంచడంలో ఇది ప్రధాన పాత్ర పోషిస్తుంది. కరోనా కాలంలో దీన్ని ఖచ్చితంగా తినండి. దీని వల్ల మీరు చాలా ప్రయోజనాలను పొందుతారు. కాకరకాయను అలాగే తినలేం కనుక జ్యూస్ రూపంలో తీసుకోవచ్చు. దీనిలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. అవి రోగ నిరోధక శక్తిని పెంపొందిస్తాయి. వయస్సు మీదపడటం వల్ల చర్మంలో వచ్చే మార్పులను తగ్గిస్తుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని హెల్త్ టిప్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

(Note: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)