AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Headache: ఈ ఆయిల్స్‌ రాస్తే తలనొప్పి పరార్‌.. సైడ్‌ ఎఫెక్ట్స్‌ కూడా నిల్‌..

Health Tips: విపరీతమైన పని ఒత్తిడికి తోడు బిజీ లైఫ్‌ కారణంగా మనలో చాలామంది తలనొప్పితో బాధపడుతుంటారు. ప్రస్తుత రోజుల్లో ఇది ఒక సాధారణ సమస్యగా మారిపోయింది. తీవ్ర అలసట, ఫోన్ లేదా ల్యాప్‌టాప్ స్క్రీన్‌ని ఎక్కువసేపు చూడటం వంటి

Headache: ఈ ఆయిల్స్‌ రాస్తే తలనొప్పి పరార్‌.. సైడ్‌ ఎఫెక్ట్స్‌ కూడా నిల్‌..
Headache Home Remedies
Basha Shek
|

Updated on: Aug 17, 2022 | 8:35 PM

Share

Health Tips: విపరీతమైన పని ఒత్తిడికి తోడు బిజీ లైఫ్‌ కారణంగా మనలో చాలామంది తలనొప్పితో బాధపడుతుంటారు. ప్రస్తుత రోజుల్లో ఇది ఒక సాధారణ సమస్యగా మారిపోయింది. తీవ్ర అలసట, ఫోన్ లేదా ల్యాప్‌టాప్ స్క్రీన్‌ని ఎక్కువసేపు చూడటం వంటి కారణాల వల్ల తలనొప్పి రావడం సహజం. దీని నుంచి ఉపశమనం పొందడానికి మార్కెట్లో లభించే అనేక రకాల మందులను వాడుతుంటారు. అయితే దీర్ఘకాలంలో వీటి వల్ల పలు సైడ్‌ ఎఫెక్ట్స్‌ తలెత్తుతాయి. ఇలాంటి పరిస్థితుల్లో కొన్ని హోం రెమెడీస్‌ ప్రయత్నించవచ్చు. ముఖ్యంగా కొన్ని ఆయుర్వేద చిట్కాలను ఉపయోగించవచ్చు. అవేంటో తెలుసుకుందాం రండి.

పెప్పర్‌మెంట్‌ ఆయిల్‌..

పుదీనాలో పలు ఆరోగ్య గుణాలు ఉంటాయి. ఇవి తలనొప్పి నుంచి తక్షణ ఉపశమనం కలిగిస్తాయి. తలనొప్పి సమయంలో కాస్త పెప్పర్ మింట్ ఆయిల్ తీసుకుని నుదుటిపై మసాజ్ చేయాలి. ఆ తర్వాత కాసేపు నిద్రపోండి. కాసేపట్లో మీకు తేడా కనిపిస్త్ఉంది. ఇది కాకుండా మౌత్ వాష్‌గా కూడా పుదీనాను ఉపయోగించవచ్చు. అదే సమయంలో పుదీనా నూనె కండరాల నొప్పిని కూడా తగ్గిస్తుంది.

ఇవి కూడా చదవండి

చమోమిలే నూనె

సహజ ప్రయోజనాలతో కూడిన ఈ నూనె తలనొప్పి, దురద, చర్మశుద్ధి, చర్మంపై వాపును తగ్గించడంలో ప్రభావవంతంగా పనిచేస్తుంది. మార్కెట్లో ఈ రకమైన ఆయిల్స్‌ సులభంగా దొరుకుతున్నాయి. తలనొప్పి వచ్చినప్పుడు ఈనూనెతో నుదుటిపై రాసుకుని మర్దన చేయాలి. రాత్రి పడుకునే ముందు మసాజ్ చేసుకుంటే మరింత ప్రయోజనకరంగా ఉంటుంది. ఇలా చేయడం వల్ల మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. ఉదయాన్నే ఫ్రెష్ గా ఉండగలుగుతారు.

లావెండర్ నూనె

ఇది చర్మం, జుట్టు సంరక్షణ కాకుండా శరీర సంరక్షణలో ఉత్తమమైనది. పనిభారంతో కలిగే తీవ్ర అలసట, తలనొప్పి సమస్యలను తగ్గించడంలో ఇది సమర్థంగా పనిచేస్తుంది. ఈ ఆయిల్‌తో నుదుటిని మసాజ్‌ చేస్తే మనసుకు రిలాక్స్‌గా అనిపిస్తుంది. ఇది ఎసెన్షియల్ ఆయిల్ అయినప్పటికీ, దీన్ని నేరుగా చర్మానికి అప్లై చేయకూడదు. కొబ్బరి లేదా ఇతర నూనెతో కలిపి మాత్రమే వాడాలి.

గమనిక: ఈ కథనంలోని అందించిన చిట్కాలు, సలహాలు సాధారణ సమాచారం కోసం మాత్రమే. వైద్య సలహాగా భావించకూడదు. ఏదైనా చిట్కాలను, పద్ధతులను ప్రారంభించే ముందు లేదా మీ ఆహారంలో ఏవైనా మార్పులు చేసే ముందు వైద్యుడిని సంప్రదించండి.

ఇది కూడా చదవండి.. టెక్నాలజీలో సరికొత్త విప్లవానికి సిద్ధమైన ఎయిర్‌టెల్‌.. మారనున్న పలు రంగాల రూపు రేఖలు..

మోదీ పాలనలో అంబేద్కర్ ఆలోచనల ప్రతిధ్వని
మోదీ పాలనలో అంబేద్కర్ ఆలోచనల ప్రతిధ్వని
సైకిల్‌ కంటే నెమ్మదిగా ప్రయాణించే రైలు..! అయినా ఫుల్లు డిమాండ్..
సైకిల్‌ కంటే నెమ్మదిగా ప్రయాణించే రైలు..! అయినా ఫుల్లు డిమాండ్..
పంటి ఎనామిల్‌ను నాశనం చేస్తున్న అలవాటు.. మానకుంటే కష్టమే!
పంటి ఎనామిల్‌ను నాశనం చేస్తున్న అలవాటు.. మానకుంటే కష్టమే!
వైభవ్‎ సూర్యవంశీకి పట్టపగలు చుక్కలు చూపెట్టిన హైదరాబాద్ ప్లేయర్
వైభవ్‎ సూర్యవంశీకి పట్టపగలు చుక్కలు చూపెట్టిన హైదరాబాద్ ప్లేయర్
ఒంట్లో వేడి పుట్టించే సూపర్ డ్రింక్స్.. చలికాలంలో రోజూ తాగితే
ఒంట్లో వేడి పుట్టించే సూపర్ డ్రింక్స్.. చలికాలంలో రోజూ తాగితే
కేవలం వడ్డీతోనే రూ.2లక్షల ఆదాయం.. పోస్టాఫీస్‌లో అదిరే స్కీమ్..
కేవలం వడ్డీతోనే రూ.2లక్షల ఆదాయం.. పోస్టాఫీస్‌లో అదిరే స్కీమ్..
2026లో మరో 30 శాతం పెరగనున్న బంగారం! నివేదికలో ఆశ్చర్యకరమైన విషయం
2026లో మరో 30 శాతం పెరగనున్న బంగారం! నివేదికలో ఆశ్చర్యకరమైన విషయం
20 సార్లు ఓడిన తర్వాత రాహుల్ చిట్కా పనిచేసిందంటున్న ఫ్యాన్స్
20 సార్లు ఓడిన తర్వాత రాహుల్ చిట్కా పనిచేసిందంటున్న ఫ్యాన్స్
టెస్టులకు కూడా దొరకని వ్యాధి.. వదిలేస్తే యమ డేంజర్!
టెస్టులకు కూడా దొరకని వ్యాధి.. వదిలేస్తే యమ డేంజర్!
రూ.100 కంటే తక్కువ ప్లాన్స్‌ గురించి తెలుసా? 30 రోజుల వ్యాలిడిటీ
రూ.100 కంటే తక్కువ ప్లాన్స్‌ గురించి తెలుసా? 30 రోజుల వ్యాలిడిటీ