AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health Tips: పులిపిర్లతో ఇబ్బంది పడుతున్నారా ? ఇంట్లో లభించే వాటితో నేచురల్ గా తొలగించుకోండి

ఆ ప్రాంతంలో ఏర్పడే వైరస్ కొన్ని కంటికి కనపడని కణాల పెరుగుదలకు కారణమై.. ఆ కణాలన్నీ చర్మం వెలుపలికి పెరిగి గట్టిపడుతాయి. వాటినే మనం వాడుక భాషలో పులిపిర్లుగా..

Health Tips: పులిపిర్లతో ఇబ్బంది పడుతున్నారా ? ఇంట్లో లభించే వాటితో నేచురల్ గా తొలగించుకోండి
Skin Warts
Chinni Enni
|

Updated on: Jul 26, 2023 | 7:50 PM

Share

చర్మంపై దెబ్బలు తగిలినపుడు లేదా మొటిమలు ఏర్పడినపుడు అవి తగ్గిపోయాక చర్మం లోపలికి వెళిపోతుంది. ఆ ప్రాంతంలో ఏర్పడే వైరస్ కొన్ని కంటికి కనపడని కణాల పెరుగుదలకు కారణమై.. ఆ కణాలన్నీ చర్మం వెలుపలికి పెరిగి గట్టిపడుతాయి. వాటినే మనం వాడుక భాషలో పులిపిర్లుగా పిలుస్తాం. ఒకటో రెండో అయితే పెద్దగా పట్టించుకోం. కానీ.. ముఖం, మెడ భాగాలపై ఎక్కువగా పులిపిర్లు ఏర్పడితే.. అందవిహీనంగా కనిపిస్తుంటాయి. వీటిని తొలగించుకునేందుకు చాలా కష్టపడుతుంటారు.

ముఖ్యంగా ఆడవారికి అందంపై మమకారం ఎక్కువ. ముఖంపై చిన్న మొటిమ వస్తేనే.. కంగారుపడుతుంటారు. ఇలాంటి పులిపిర్లను తొలగించుకోవాలంటే.. ఎలా అని తర్జనభర్జన పడుతుంటారు. అందుకు పెద్దగా కష్టపడనక్కర్లేదు. మన వంటింట్లోనే లభించే కొన్ని వస్తువులతో వాటిని నొప్పిలేకుండా.. నేచురల్ గా ఇట్టే తొలగించవచ్చు. ఖర్చు కూడా తక్కువే ఉంటుంది.

ఉల్లిపాయ: ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదన్న నానుడి ఎప్పటి నుండో ఉంది. పులిపిర్లను తొలగించడంలో.. ఇది ప్రధాన పాత్ర పోషిస్తుంది. చిన్న ఉల్లిపాయ తొక్కను తొలగించి.. గ్రైండ్ చేసి దాని నుంచి వచ్చిన రసాన్ని పులిపిర్లపై రాస్తే చాలు. అవి రాలిపోతాయి. ఇది కొంచెం చిరాకు కలిగించినా ఫలితం మాత్రం అద్భుతంగా ఉంటుంది.

ఇవి కూడా చదవండి

అల్లం: ప్రతి వంటింట్లోనూ ఉంటుంది. అల్లాన్ని తురిమి లేదా గ్రైండ్ చేసి.. దాని నుంచి వచ్చే రసాన్ని పులిపిర్లపై రాయాలి. ఇలా రోజూ చేస్తే.. అవి రాలిపోతాయి. నొప్పి కూడా ఉండదు.

ఆపిల్ సైడర్ వెనిగర్: ఇది శరీరంలోని కొవ్వును కరిగించడంలోనే కాదు.. మొటిమలను తొలగించడంలోనూ ఉపయోగపడుతుంది. ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం కొన్నిచుక్కల యాపిల్ సైడర్ వెనిగర్ ను పులిపిర్లపై రాస్తే క్రమంగా అవి రాలిపోతాయి.

టీ ట్రీ ఆయిల్: పులిపిర్లు ఉన్న ప్రాంతంలో ఈ ఆయిల్ ను క్రమం తప్పకుండా రాస్తే చాలు. వాటంతట అవే పులిపిర్లు రాలిపోతాయి. మంట కూడా ఉండదు. నూనె పదార్థం కాబట్టి శరీరానికి చల్లగా తగులుతుంది. మొటిమల వల్ల ఏర్పడిన మచ్చలు కూడా తొలగిపోతాయి.

నిమ్మరసం: పులిపిర్లను నిమ్మరసంతో కూడా తొలగించవచ్చని చాలా మందికి తెలియదు. పులిపిర్లు ఏర్పడిన ప్రాంతంలో రోజూ నిమ్మరసం రాస్తే.. అవి రాలిపోతాయి.

అలోవెరా జెల్: అదేనండి కలబంద గుజ్జు. చర్మ సౌందర్యానికి ఇదొక కూలింగ్ ఏజెంట్ లా పనిచేస్తుంది. మార్కెట్లలో లభించే అలోవెరా జెల్ కంటే.. నేచురల్ గా అప్పటికప్పుడు కలబంద మొక్క నుంచి తీసిన జెల్ ను పులిపిర్లు ఉన్న చర్మంపై రోజుకు రెండుసార్లు రాస్తే అవి రాలిపోతాయి.

వెల్లుల్లి రసం: ఉల్లి మాదిరిగానే వెల్లుల్లి రెబ్బల నుంచి రసాన్ని తీసి పులిపిర్లు ఉన్న చోట రాయాలి. మొదట కాస్త చికాకు అనిపించినా.. క్రమంగా వాటిని పూర్తిగా రాలిపోయేలా చేస్తుంది.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి