Green Coriander: కొత్తిమీర ఆకులు తినడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?.. ఆ సమస్యలకు అద్భుతమైన ఔషధం

|

Oct 18, 2022 | 9:52 AM

వంటింట్లో దొరికే వస్తువులతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు. వంటగదిలో ఉండే అన్ని కూరగాయాలతో పాటు కొత్తమీరతో ఎన్నో ఉపయోగాలున్నాయి. అందుకే కొత్తిమీరను ఎప్పుడూ తక్కువగా అంచనా వేయవద్దు..

Green Coriander: కొత్తిమీర ఆకులు తినడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?.. ఆ సమస్యలకు అద్భుతమైన ఔషధం
Green Coriander Leaves
Follow us on

వంటింట్లో దొరికే వస్తువులతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు. వంటగదిలో ఉండే అన్ని కూరగాయాలతో పాటు కొత్తమీరతో ఎన్నో ఉపయోగాలున్నాయి. అందుకే కొత్తిమీరను ఎప్పుడూ తక్కువగా అంచనా వేయవద్దు. పచ్చి కొత్తిమీర వల్ల కలిగే ప్రయోజనాలు ఎన్నో ఉన్నాయి. కొత్తమీర ఆకులు థైరాయిడ్ ఉన్న వారికి మంచి ఫలితాలను ఇస్తుంది. థైరాయిడ్ సమస్య పురుషుల్లో కూడా వచ్చినప్పటికీ, ఈ సమస్య పురుషుల కంటే మహిళలనే ఎక్కువగా బాధితులుగా ఉన్నారు. థైరాయిడ్‌ను నియంత్రించడానికి మహిళలు కొత్తిమీరను ఎలా ఉపయోగించవచ్చో చూడండి.

కొత్తిమీర ఆకులు తినడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

☛ షుగర్ వ్యాధిలో ఉపశమనం కలిగిస్తుంది

☛ డిప్రెషన్ సమస్యలో మేలు చేస్తుంది

ఇవి కూడా చదవండి

☛ అంతర్గత మంటను తగ్గిస్తుంది

☛ అధిక రక్తపోటును నియంత్రిస్తాయి

☛ మూత్ర సమస్య ఉన్నవారికి

☛ చర్మ సమస్యలను నివారిస్తుంది

☛ మూర్ఛ సమస్యలో ప్రయోజనాన్ని ఇస్తుంది

☛ మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది

పచ్చి కొత్తిమీరలో ఉండే లక్షణాలు ఏమిటి?

పచ్చి కొత్తిమీరను తినడం వల్ల సమృద్ధిగా ఉండే డైటరీ ఫైబర్ లభిస్తుంది. ఇది ఒక రకమైన కార్బోహైడ్రేట్‌. ఆకుపచ్చ కొత్తిమీర లిపిడ్లకు అద్భుతమైన మూలం. త్రిశోధక ఆయుర్వేదంలో ఔషధాల విభాగంలో ఉంచబడింది. అంటే శరీరానికి మూడు విధాలుగా మేలు చేసే ఔషధాలు. ఉదాహరణకు జీర్ణక్రియను మెరుగుపరచడం, ఆకలిని పెంచడం లాంటివి చేస్తుంది. పచ్చి కొత్తిమీరను ఎక్కడ ఉంచినా దాని సువాసన అందరినీ ఆకర్షిస్తుంది. ఇందులో ఉండే ముఖ్యమైన నూనెలే దీనికి కారణం. ఎసెన్షియల్ ఆయిల్ అంటే మూలికలు లేదా ఔషధాల నుండి తయారుచేసిన స్వచ్ఛమైన నూనె ఇందులో ఇమిడి ఉంటుంది.

థైరాయిడ్ నిరోధించే మార్గాలు

థైరాయిడ్ సమస్య ఉన్నట్లయితే పచ్చి కొత్తిమీరను క్రమం తప్పకుండా తినాలి. ఇది సమస్య కాకపోయినా, మీ రోజువారీ ఆహారంలో పచ్చి కొత్తిమీరను చేర్చుకోవడానికి ప్రయత్నించాలి. థైరాయిడ్ సమస్యలతో పాటు మహిళల ఆరోగ్యానికి చాలా ముఖ్యమైనది. పచ్చి కొత్తిమీరలో ఉండే ఔషధ గుణాలు, విటమిన్లు, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్లు థైరాయిడ్‌ను నియంత్రించడంలో చాలా ఎఫెక్టివ్‌గా పనిచేస్తాయి. ఎవరికైనా థైరాయిడ్ సమస్య ఉంటే, రోజువారీ ఆహారంలో పచ్చి కొత్తిమీరను చేర్చుకుంటే మంచి ఫలితాలు ఉంటాయంటున్నారు ఆయుర్వేద నిపుణులు.

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణుల సలహాలు, సూచనల మేరకు అందించడం జరుగుతుంది. ఏవైనా సందేహాలు ఉంటే నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి