Fever: జ్వరం ఎంతకీ తగ్గడం లేదా.? ఈ ఇంటి చిట్కాలతో చెక్ పెట్టండి..
ఇక మారిన వాతారణం కారణంగా వ్యాధులు కూడా వ్యాపిస్తున్నాయి. దీంతో ఇంట్లో ఎవరో ఒకరూ జ్వరంతో బాధపడుతున్నారు. ఇక జ్వరం వచ్చిన వెంటనే వైద్యుడిని సంప్రదించేకంటే ముందు ఇంట్లో కొన్ని న్యాచురల్ టిప్స్ పాటిస్తే జ్వరానికి చెక్ పెట్టొచ్చు. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా సహజంగా జ్వరాన్ని ఎలా తగ్గించుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం..

ప్రస్తుతం వాతావరణం పూర్తిగా మారిపోయింది. విపరీతమైన చలి కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉదయం 8 గంటలు దాటినా మంచు కురుస్తూనే ఉంది. ఇక మారిన వాతారణం కారణంగా వ్యాధులు కూడా వ్యాపిస్తున్నాయి. దీంతో ఇంట్లో ఎవరో ఒకరూ జ్వరంతో బాధపడుతున్నారు. ఇక జ్వరం వచ్చిన వెంటనే వైద్యుడిని సంప్రదించేకంటే ముందు ఇంట్లో కొన్ని న్యాచురల్ టిప్స్ పాటిస్తే జ్వరానికి చెక్ పెట్టొచ్చు. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా సహజంగా జ్వరాన్ని ఎలా తగ్గించుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం..
* జ్వరాన్ని తగ్గించడంలో తులసి కీలక పాత్ర పోషిస్తుందని నిపుణులు చెబుతున్నారు. బ్యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్ లక్షణాలకు తులసి పెట్టింది పేరు. తులసి ఆకులను తేనెలో కలుపుకొని తీసుకోవడం వల్ల జ్వరం నుంచి బయటపడొచ్చు. అలాగే తులసి ఆకులతో చేసిన కషాయం తాగడం వల్ల కూడా జ్వరం తగ్గుతుంది.
* పుదీనా, అల్లంతో చేసిన కషాయాన్ని తీసుకుంటే జ్వరం నుంచి తక్షణమే ఉపశమనం లభిస్తుంది. జ్వరంతో బాధపడే వారు ఈ కషాయాన్ని రోజుకు రెండు మూడు సార్లు తీసుకుంటే ఇట్టే ఫలితం లభిస్తుంది. అంతేకాకుండా.. పుదీనా, అల్లం పేస్ట్ తయారు చేసుకొని ఒక చెంచా తీసుకుంటే ప్రయోజనం లభిస్తుంది.
* జ్వరాన్ని నయం చేయడంలో పసుపు కూడా ముఖ్యపాత్ర పోషిస్తుంది. రాత్రి పడుకునే ముందు ఒక గ్లాసు గోరువెచ్చని పాలలో చిటికెడు పసుపు, ఎండుమిరియా పొడి కలిపి తీసుకోవాలి. దీంతో జ్వరం నుంచి త్వరగా ఉపశమనం పొందొచ్చు.
* వెల్లుల్లి యాంటీ బ్యాక్టీరియల్‌కు పెట్టింది పేరు. జ్వరాన్ని తగ్గించడంతో వెల్లుల్లి క్రీయాశీలంగా పనిచేస్తుంది. జ్వరంతో బాధపడుతుంటే.. రెండు, మూడు వెల్లుల్లి రెబ్బలను దంచి గోరువెచ్చని నీటితో తీసుకోవాలి. ఇలా చేస్తే వెంటనే జ్వరం నుంచి ఉపశనమం లభిస్తుంది.
* శరీర ఉష్ణోగ్రత ఉన్నపలంగా పెరిగితే చందనం పేస్ట్ ద్వారా వేడిని తగ్గించుకోవచ్చు. చందనంతో చేసిన పేస్ట్‌ను నుదుటిపై అప్లై చేసుకోవడం వల్ల చల్లదనం లభిస్తుంది. శరీరం ఉష్ణోగ్రత వెంటనే తగ్గుతుంది.
నోట్: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.
మరిన్ని హెల్త్ ఆర్టికల్స్ కోసం క్లిక్ చేయండి..