Toothache: పంటినొప్పితో అవస్థలు పడుతున్నారా? ఇలా తక్షణ ఉపశమనం పొందండి..

పళ్లు పుచ్చిపోవడం, బ్యాక్టీరియా వ్యాప్తి చెందడం, దంతాల పగుళ్లు వంటి అనేక కారణాల వల్ల తీవ్రమైన పంటి నొప్పి వస్తుంది. ఈ నొప్పి కారణంగా చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎందుకంటే దంతాల లోపల ఉండే నరాలు, కణజాలం, రక్తనాళాలు చాలా మృదువైనవి. ఇవి శరీరంలోనే అత్యంత సున్నితమైనవి. ఈ నరాలు బ్యాక్టీరియా సోకినప్పుడు

Toothache: పంటినొప్పితో అవస్థలు పడుతున్నారా? ఇలా తక్షణ ఉపశమనం పొందండి..
Toothache
Follow us

|

Updated on: Mar 27, 2023 | 7:30 AM

పళ్లు పుచ్చిపోవడం, బ్యాక్టీరియా వ్యాప్తి చెందడం, దంతాల పగుళ్లు వంటి అనేక కారణాల వల్ల తీవ్రమైన పంటి నొప్పి వస్తుంది. ఈ నొప్పి కారణంగా చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎందుకంటే దంతాల లోపల ఉండే నరాలు, కణజాలం, రక్తనాళాలు చాలా మృదువైనవి. ఇవి శరీరంలోనే అత్యంత సున్నితమైనవి. ఈ నరాలు బ్యాక్టీరియా సోకినప్పుడు తీవ్రమైన నొప్పిని కలిగిస్తాయి. ఈ పరిస్థితిలో దంతవైద్యుడుని సంప్రదించాల్సి వస్తుంది. అయితే, ఎవరికైనా పంటి నొప్పి ఉన్నట్లయితే.. ఇంట్లో వినియోగించే కొన్ని వస్తువులతోనే ఈజీగా, తక్షణ రిలీఫ్ పొందవచ్చు అని నిపుణులు చెబుతున్నారు. మరి ఆ టిప్స్ ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

పంటి నొప్పి నుండి ఇలా ఉపశమనం పొందండి..

1. లవంగం నూనె..

ఇవి కూడా చదవండి

లవంగంలో యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ బాక్టీరియల్ లక్షణాలు ఉన్నాయి. ఒక కాటన్ బాల్‌లో ఒకటి లేదా రెండు చుక్కల లవంగం నూనె వేసి పన్ను నొప్పి ఉన్న చోట కుహరం మీద రాయాలి. దీన్ని అప్లై చేయడం వల్ల నొప్పి నుంచి తక్షణ ఉపశమనం లభిస్తుంది.

2. వెల్లుల్లి..

నోటి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి వెల్లుల్లి ముక్కను రోజూ ఖాళీ కడుపుతో తీసుకోవాలి. వెల్లుల్లిని తీసుకోవడం వల్ల పంటి నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది. ఎందుకంటే ఇది నోటిలోని బ్యాక్టీరియాను నాశనం చేస్తుంది.

3. జామ ఆకులు..

జామ ఆకులు యాంటీమైక్రోబయల్ గుణాలతో నిండి ఉన్నాయి. ఇవి క్యావిటీలను నివారించడంలో మేలు చేస్తాయి. జామ ఆకులను ఉడకబెట్టి మౌత్ వాష్ గా ఉపయోగించవచ్చు.

4. నిమ్మరసం..

నిమ్మకాయలో సిట్రిక్ యాసిడ్ పుష్కలంగా ఉంటుంది. నొప్పిని తగ్గించడంలో సహాయపడుతుంది. ఆహారం తిన్న తర్వాత కొన్ని నిమిషాల పాటు నిమ్మరసాన్ని చప్పరించాలి. ఇది దంత క్షయాన్ని నివారించి, దంతాల ఆరోగ్యాన్ని కాపాడుతుంది.

గమనిక: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ప్రధామిక అవగాహన కోసం మాత్రమే ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించలేదు. ఏవైనా తీవ్ర ఆరోగ్య సమస్యలుంటే వెంటనే వైద్యులను సంప్రదించి, చికిత్స తీసుకోవాలి.

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..