Fake Jaggery: మీరు రోజూ ‘బెల్లం’ తింటున్నారా?.. అయితే ఈ విషయం తప్పక తెలుసుకోండి.. లేదంటే పెను ప్రమాదం తప్పదు..

| Edited By: Ravi Kiran

Aug 31, 2021 | 6:53 AM

Fake Jaggery: బెల్లం ఆరోగ్యానికి చాలా మంచిది. నేరుగా తినటం, బెల్లంతో తయారైన ఆహార పదార్ధాలు తీసుకోవటం..

Fake Jaggery: మీరు రోజూ ‘బెల్లం’ తింటున్నారా?.. అయితే ఈ విషయం తప్పక తెలుసుకోండి.. లేదంటే పెను ప్రమాదం తప్పదు..
Jaggery
Follow us on

Fake Jaggery: బెల్లం ఆరోగ్యానికి చాలా మంచిది. నేరుగా తినటం, బెల్లంతో తయారైన ఆహార పదార్ధాలు తీసుకోవటం వల్ల శరీరానికి ఐరన్ తో పాటు పలు పోషకాలు లభిస్తాయి. అయితే పచ్చగా కనిపించిందల్లా బెల్లం కాదు. అది తీయగా ఉంటుందంతే. బెల్లంను చేరుకుతో తయారుచేయటం ఎపుడో మానేశారు. నాసిరకం పంచదారలో కెమికల్స్, రంగులు కలిపి బహిరంగంగానే తయారు చేసి టన్నులకొద్దీ బెల్లాన్ని మార్కెట్లో అమ్మేస్తున్నారు . ప్రజల ఆరోగ్యాలతో చెలగాటం ఆడుతున్నారు . టీవీ 9 నిఘాలో ఈ ఆసక్తి కరమైన నిజాలు వెలుగుచూశాయి..

బెల్లాన్ని చేరుకుతో తయారు చేస్తారనే విషయం అందరికి తెలిసిందే. కానీ ఇప్పుడు పంచదారనే బెల్లంగా మార్చేస్తున్నారు. చెరుకును సాగు చేసి దాని నుంచి జ్యూస్ తీసి, కాచి తయారు చేసే ఒరిజినల్ బెల్లం అసలు మార్కెట్‌లో దొరకటం లేదు. బహిరంగ మార్కెట్‌లో ఇప్పుడు అంతా పంచదారతో తయారైన బెల్లాన్ని ఎక్కువగా విక్రయిస్తున్నారు. షుగర్ ఫ్యాక్టరీ.. నాసిరకం అంటే తర్డ్ గ్రేడ్ పంచదార పాకంలో రంగులు, రసాయనాలు వేసి ఈ కృత్రిమ బెల్లాన్ని తయారు చేస్తున్నారు. పసుపు రంగులో ఉంటె ఒకరేటు , కాఫి రంగులో ఉంటె ఆర్గానిక్ బెల్లం అంటూ రకరకాలుగా సొమ్ముచేసుకుంటున్నారు .

పశ్చిమ గోదావరి జిల్లాలో భీమవరం, పాలకొల్లు, నల్లజర్ల మండలాల్లో ఈ నకిలీ బెల్లం పెద్దఎత్తున తయారవుతుంది. అసలు బెల్లాన్ని కొద్ది మొత్తంలో తీసుకుని.. దానికి ఎక్కువ పాళ్లలో కాల్షియం కార్బొనేట్, సోడియం బైకార్బొనేట్ వంటి రసాయనాలను కలుపుతున్నారు. కల్తీ బెల్లం బరువు ఎక్కువయ్యేందుకు కాల్షియం కార్బొనేట్ ను, దానికి రంగునిచ్చేందుకు సోడియం బైకార్బొనేట్ ను కలుపుతున్నారు. పండుగ సీజన్లు, పెళ్లిళ్లు రావటంతో టన్నులకొద్దీ ఈ నకిలీ బెల్లం మార్కెట్ లోకి చేరిపోతుంది .

అసలు బెల్లం శరీరానికి మంచి చేస్తుంది. అయితే కల్తీబెల్లం హానికలిగిస్తుంది. బెల్లంలో కాల్షియం, ఫాస్ఫరస్, ఇనుము, పొటాషియం, జింక్, విటమిన్ బీ వంటి పోషకాలు మెండుగా ఉంటాయి. అవి మన ఒంట్లోని మలినాలను తీసేసి మనల్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. అయితే రసాయనాలు, కృత్రిమ రంగులతో తయారైన బెల్లం నిత్యం శరీరంలోకి వెలితే క్యాన్సర్ తో పాటు జీర్ణవ్యవస్ధ దెబ్బతింటుంది.

మరోవైపు పుడ్ సేఫ్టీ అధికారులు ఈ నకిలీ బెల్లం తయారీదారులపై కేసులు నమోదు చేస్తున్నామంటున్నారు. వీటి తయారీలో మోతాదుకు మించి రంగులు, రసాయనాలు వాడుతున్నారని అంగీకరిస్తున్నారు. కాగా, తయారుదారులు చెరుకుతో బెల్లాన్ని తయారు చేస్తున్నట్లు బిల్డప్ ఇచ్చేందుకు కొన్ని చెరకుగడలను తయారీ కేంద్రాల వద్ద ఉంచుతున్నారు. దీంతో కొనుగోలు దారులు సైతం బెల్లంతో తయారైనవనే భ్రమతో నకిలీ బెల్లంతో తయారైన వస్తువులనే కొనుగోలు చేస్తున్నారు.

ఇలా నకిలీ బెల్లంతో మార్కెట్లో కోట్ల రూపాయల వ్యాపారం జరుగుతుంది. అయితే రంగుచూసి దీన్ని కొనుగోలు చేయటంకంటే ఒకటికి నాలుగు సార్లు పరిశీలించి నమ్మకమైన వ్యక్తుల వద్ద దీన్ని కొనుగోలు చేయటం అవసరం అని నిపుణులు సూచిస్తున్నారు. బెల్లం గడ్డను నీళ్లలో వేస్తే కరిగిపోతుంది. కింద వ్యర్థం ఎక్కువగా మిగిలితే అది ఖచ్చితంగా నకిలీ దేనని గుర్తించాలి. కావట్టి బెల్లం తీయగానే ఉన్నా అది నకిలీ దైతే విషంతో సమానమని గుర్తించుకోవాలి.

Also read:

AP-TS Weather Alert: అల్పపీడనం ప్రభావం.. ఏపీ, తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలకు ఛాన్స్..

KRMB Meeting: తెలంగాణ ప్రభుత్వం వెనక్కి తగ్గిందా? వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తోందా?

Telangana: తెలంగాణలో భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీలు.. ఏ జిల్లాకు ఏ కలెక్టర్ అంటే..