AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Fake Eggs: తస్మాత్‌ జాగ్రత్త.. మార్కెట్లో విరివిగా నకిలీ గుడ్లు.. ఈ సింపుల్‌ చిట్కాలతో గుర్తించండి

మార్కెట్లో దొరికే కృత్రిమ, నకిలీ గుడ్లను తీసుకుంటే  తీవ్ర అనారోగ్య సమస్యలు తప్పవంటున్నారు నిపుణులు. అందుకే మార్కెట్ నుంచి గుడ్లు తీసుకొచ్చేటప్పుడే నకిలీ, అసలైన గుడ్ల మధ్య తేడాను గుర్తించాలని సూచిస్తున్నారు

Fake Eggs: తస్మాత్‌ జాగ్రత్త.. మార్కెట్లో విరివిగా నకిలీ గుడ్లు.. ఈ సింపుల్‌ చిట్కాలతో గుర్తించండి
Fake Eggs
Basha Shek
|

Updated on: Nov 07, 2022 | 12:06 PM

Share

కొన్నేళ్ల క్రితం వరకు కల్తీకాని ఆహారమేదైనా ఉందంటే గుడ్లు అని చెప్పుకునేవారు. అయితే ఇప్పుడు గుడ్లు కూడా కల్తీ అయిపోతున్నాయి. మార్కెట్లో కృత్రిమ గుడ్లు విరివిగా దొరుకుతున్నాయి. గుడ్లలో ప్రోటీన్లు, విటమిన్లు, మినరల్స్ పుష్కలంగా ఉన్నాయి. ఇవి ఆరోగ్యానికి మేలు చేస్తాయి. అయితే మార్కెట్లో దొరికే కృత్రిమ, నకిలీ గుడ్లను తీసుకుంటే  తీవ్ర అనారోగ్య సమస్యలు తప్పవంటున్నారు నిపుణులు. అందుకే మార్కెట్ నుంచి గుడ్లు తీసుకొచ్చేటప్పుడే నకిలీ, అసలైన గుడ్ల మధ్య తేడాను గుర్తించాలని సూచిస్తున్నారు. మార్కెట్లలో దొరుకుతున్న కృత్రిమ గుడ్లతో ఎలాంటి అనర్థాలు ఉన్నాయి? వాటినెలా గుర్తించాలి? తదితర విషయాలు తెలుసుకుందాం రండి. కాగా నకిలీ గుడ్లు నాడీ వ్యవస్థపై చెడు ప్రభావం చూపుతాయి. ఇందులోని రసాయనాలు మెదడు ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. ఈ గుడ్లు కాలేయానికి కూడా హానికరం. ఎముకలను బలహీనపరుస్తాయి. ఇలాంటి గుడ్లు తినడం వల్ల కిడ్నీలపై కూడా చెడు ప్రభావం పడుతుంది. కృత్రిమ గుడ్లు తినడం వల్ల రక్తహీనత సమస్యలు ఎదురువతాయి. ఇవి రక్తపోటును కూడా ప్రభావితం చేస్తుంది.

ఎలా గుర్తించాలంటే?

చైనా నుంచి మన దేశంలోకి పెద్ద ఎత్తున కృత్రిమ గుడ్లు వస్తున్నాయి. వీటిని సింథటిక్, ప్లాస్టిక్‌తో తయారుచేస్తాను. చూడ్డానికి ఇవి కూడా నిజమైన గుడ్ల వలె కనిపిస్తాయి. అందుకే మార్కెట్‌లో కొనుగోలు చేసే ముందు కృత్రిమ గుడ్లను సరిచూసుకోవాలి. ఇందుకోసం ముందుగా ఒక గుడ్డు పగులగొట్టి చూడండి. అందులోని పచ్చసొన, తెల్లసొన బాగా కలిసిపోతే గుడ్డు నకిలీదని అర్థం. నిజమైన గుడ్డు నీటిలో మునిగిపోతుంది. కానీ సింథటిక్, ప్లాస్టిక్‌తో చేసిన గుడ్డు నీటిలో మునిగిపోదు. సాధారణంగా గుడ్లను బహిరంగ ప్రదేశాల్లో ఉంచినప్పుడు వాటిపై చీమలు, ఈగలు వంటివి వాలుతాయి. ఒకవేళ అలా జరగకపోతే అవి కృత్రిమ గుడ్లు కావచ్చు. అలాగే నకిలీ గుడ్లను తయారు చేయడానికి దాని షెల్ మీద ప్లాస్టిక్‌ను ఉపయోగిస్తారు. అందుకే వాటిని మంట సమీపాన ఉంచినట్లయితే గుడ్డు నుంచి కాలిన వాసన వస్తుంది. ఒక్కోసారి మంటలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఇక గుడ్డు కొనేటప్పుడు దానిని గట్టిగా కదపండి. దాని నుంచి ఎటువంటి శబ్దం రాదు. నిండుగా ఉన్న భావన కలుగుతుంది. అదే నకిలీ గుడ్డును కదిలిస్తే దాని నుంచి కొంత శబ్దం వస్తుంది

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

ఇవి కూడా చదవండి

మరిన్ని హెల్త్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..