Salt: కూరల్లో ఉప్పు ఎక్కువైందా.. డోంట్ వర్రీ.. ఈ సింపుల్ టిప్స్ ను ఫాలో అయిపోండి..
వంట చేసేటప్పడు అతి ముఖ్యమైన పదార్థ ఏదైనా ఉందంటే.. అది కేవలం ఉప్పు మాత్రమే. ఎందుకంటే ఉప్పు లేని వంటను ఊహించుకోలేం. ముద్ద కూడా నోట్లో పెట్టుకోలేం. ఏ వెరైటీ చేసినా ఉప్పు ఉండి తీరాల్సిందే...
వంట చేసేటప్పడు అతి ముఖ్యమైన పదార్థ ఏదైనా ఉందంటే.. అది కేవలం ఉప్పు మాత్రమే. ఎందుకంటే ఉప్పు లేని వంటను ఊహించుకోలేం. ముద్ద కూడా నోట్లో పెట్టుకోలేం. ఏ వెరైటీ చేసినా ఉప్పు ఉండి తీరాల్సిందే. అలా అని ఉప్పు ఎక్కువైనా కష్టమే. చాలా సందర్భాల్లో వంట చేసేటప్పుడు హడావిడిగా ఉంటాం. ఆయా పదార్థాలు వేసామో లేదోనని ఒకటికి రెండు సార్లు చూసుకుంటాం. అయితే కొన్ని సార్లు మనకు తెలియకుండానే ఉప్పు ఎక్కువగా పడిపోతుంది. అలాంటప్పుడు ఆహార పదార్థం పూర్తి ఉప్పుమయంగా మారడమే కాకుండా ఆరోగ్య సమస్యలూ వస్తాయి. అంతే కాకుండా తినడానికి కూడా పనికి రాకుండా పోతుంది. కాబట్టి వంట వండేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. వంట ఎంత బాగా తయారు చేసినప్పటికీ అదనపు ఉప్పు రుచిని పూర్తిగా మార్చేస్తుంది. వంటల్లో ఉప్పు ఎక్కువైన సందర్భాలలో కొన్ని చిట్కాలు పాటించడం ద్వారా అదనపు ఉప్పును తొలగించుకోవచ్చని పాకశాస్త్ర నిపుణులు చెబుతున్నారు. అవేంటో మీరూ చూసేయండి..
వంటల్లో ఉప్పు ఎక్కువైనప్పుడు పచ్చి బంగాళాదుంపను పెద్ద పెద్ద ముక్కలుగా చేసి, కూరలో వేయాలి. ఇవి ఆహారంలోని అదనపు ఉప్పును గ్రహిస్తాయి. వాటిని సుమారు 20 నిమిషాలు డిష్‌లో ఉంచాలి. అంతే కాకుండా గోధుమ పిండి గానీ మైదా పిండిని గానీ ముద్దలుగా చేసుకుని అక్కడక్కడ ఉంచాలి. ఇవి ఎక్కువైన ఉప్పును స్వీకరించి.. కూరలో ఉప్పు బ్యాలెన్సింగ్ గా ఉండేలా చేస్తాయి. అయితే ఆహారం వడ్డించుకునే ముందు వీటిని తీసేయడం మాత్రం మరిచిపోవద్దు. ఉప్పు రుచిని తగ్గించడానికి డిష్‌కు క్రీమ్ యాడ్ చేయాలి. ఇది కూరను గ్రేవీలా చేయడమే కాకుండా అదనపు ఉప్పగా ఉండే రుచిని తగ్గించి, మంచి ఆహారాన్ని అందిస్తుంది.
పచ్చి బంగాళాదుంపలే కాకుండా ఉడికించిన బంగాళాదుంపలు ఉప్పును గ్రహించడంలో అద్భుతంగా పని చేస్తాయి. వీటితో పాటు కూరలో 1 టేబుల్ స్పూన్ పెరుగు వేసి 5 నిమిషాలు ఉంచాలి. పెరుగు కూరలో ఉప్పు మొత్తాన్ని తగ్గిస్తుంది. మంచి రుచిని అందిస్తుంది.. కాబట్టి.. కూరల్లో ఉప్పు ఎక్కువైందనే ఇబ్బంది లేకుండా.. సింపుల్ గా ఈ చిట్కాలు పాటించి మంచి ఆహారాన్ని ఆస్వాదించండి..
మరిన్ని ఆరోగ్య సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి