Health Tips: పొరపాటున కూడా వీటిని ఫ్రిజ్ లో పెట్టకండి.. మర్చిపోయి పెట్టారో ఇక అంతే..
కూరగాయలు చెడిపోకుండా ఉండేందుకు తరచుగా ఫ్రిజ్‌లో నిల్వ ఉంచుతాం. మార్కెట్ నుంచి మనం కూరగాయలు తెచ్చిన వెంటనే చేసే పని ఏదైనా ఉందంటే అది.. వాటిని ఫ్రిజ్ లో పెట్టడమే. ఫ్రిజ్ లో పెట్టడం ద్వారా..
కూరగాయలు చెడిపోకుండా ఉండేందుకు తరచుగా ఫ్రిజ్‌లో నిల్వ ఉంచుతాం. మార్కెట్ నుంచి మనం కూరగాయలు తెచ్చిన వెంటనే చేసే పని ఏదైనా ఉందంటే అది.. వాటిని ఫ్రిజ్ లో పెట్టడమే. ఫ్రిజ్ లో పెట్టడం ద్వారా కూరగాయలు పాడవకుండా ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి. కాబట్టి మాటిమాటికి కూరగాయలు తీసుకురావాల్సిన అవసరం లేకుండా ఒకేసారి తెచ్చుకుని నిల్వ చేసుకుంటుంటారు. అయితే ఫ్రిజ్ వాడకంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రతి పదార్థాన్నీ అందులో ఉంచడం మంచిది కాదు. కొన్ని సార్లు అవి విషపూరితంగానూ మారవచ్చు. కాబట్టి ఫ్రిజ్ లో ఆహార పదార్థాలు గానీ, కూరగాయలను గానీ నిల్వ చేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు పాటించాలని నిపుణులు చెబుతున్నారు. అవేంటంటే..
వెల్లుల్లి.. వెల్లుల్లి పాయలు లేదా విడిగా ఒలిచిన వెల్లుల్లిని ఫ్రిజ్ లో ఉంచకూడదు. వెల్లుల్లిని ఫ్రిజ్‌లో ఉంచడం వల్ల అది మొలకెత్తుతుంది. కాబట్టి వెల్లుల్లిని ఫ్రిజ్‌లో కాకుండా బయటే ఉంచడం మంచిది.
దోసకాయ.. దోసకాయను ఎప్పుడూ ఫ్రిజ్‌లో నిల్వ చేయకూడదు. దోసకాయను పది డిగ్రీల సెంటిగ్రేడ్ కంటే తక్కువ ఉష్ణోగ్రత వద్ద ఉంచితే దాని పై పొర త్వరగా కుళ్లిపోతుంది. అంతే కాకుండా ఇది ఇతర కూరగాయలనూ డ్యామేజ్ చేస్తుంది.
బంగాళదుంపలు.. బంగాళదుంపల్లో పిండి పదార్ధాలు అధికంగా ఉంటాయి. వీటిని ఫ్రిజ్‌లో ఉంచినట్లయితే పిండి పదార్ధం చక్కెరగా మారుతుంది. వాటిని మధుమేహ వ్యాధిగ్రస్తులు తింటే వారి రక్తంలో చక్కెర వేగంగా పెరిగే అవకాశం ఉంది. కాబట్టి ఇది చాలా ప్రమాదకరం. అందుకే బంగాళాదుంపలను ఫ్రిజ్‌లో కాకుండా బయటే ఉంచాలి.
ఉల్లిపాయలు.. ఉల్లిపాయలనూ ఎప్పుడూ ఫ్రిజ్‌లో ఉంచకూడదు. ఇది ఉల్లిపాయ మెత్తగా అయ్యేలా చేస్తుంది. సహజ మూలకాలు నశించిపోతాయి. కాబట్టి అధిక వేడి ఉన్న ప్రాంతం, చల్లగా ఉన్న ప్రాంతాల్లో కాకుండా సాధారణ గది ఉష్ణోగ్రత ఉన్న ప్రాంతాల్లో ఉల్లి పాయలను నిల్వ చేయడం మంచిది.
మరిన్ని హెల్త్ న్యూస్ కోసం