AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

గర్భధారణలో థైరాయిడ్ ప్రభావం ఎలా ఉంటుందో తెలుసా..? నెలసరి సమస్యలు, జుట్టు రాలడం కూడా.. థైరాయిడ్ లక్షణాలేనా..?

థైరాయిడ్ గ్రంథి చిన్నదైనా.. దాని ప్రభావం శరీరవ్యాప్తంగా ఉంటుంది. జీవక్రియ, శక్తి వినియోగం, శరీర ఉష్ణోగ్రత వంటి ముఖ్యమైన వ్యవస్థలను నియంత్రిస్తుంది. ఈ గ్రంథి సరిగా పనిచేయకపోతే ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. అవి గుర్తించి ముందస్తు గా జాగ్రత్తలు తీసుకోవడం ముఖ్యం.

గర్భధారణలో థైరాయిడ్ ప్రభావం ఎలా ఉంటుందో తెలుసా..? నెలసరి సమస్యలు, జుట్టు రాలడం కూడా.. థైరాయిడ్ లక్షణాలేనా..?
Thyroid Health
Prashanthi V
|

Updated on: Jul 01, 2025 | 2:28 PM

Share

శరీరంలో ఎన్ని ముఖ్యమైన గ్రంథులున్నా.. మెడ భాగంలో ఉండే చిన్నదైన థైరాయిడ్ గ్రంథి అనేక శారీరక వ్యవస్థల పనితీరును ప్రభావితం చేస్తుంది. ఇది తగినంత హార్మోన్లను విడుదల చేయడం ద్వారా శరీరంలో జీవక్రియ, శక్తి వినియోగం, శరీర ఉష్ణోగ్రత వంటి అనేక పనులను నియంత్రిస్తుంది. ఈ గ్రంథి సరిగా పనిచేయకపోతే రెండు రకాల సమస్యలు ఎదురవుతాయి.. హైపర్ థైరాయిడిజం (హార్మోన్ల అధిక ఉత్పత్తి) హైపో థైరాయిడిజం (హార్మోన్ల లోపం). రెండు పరిస్థితులూ శరీరాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తాయి.

హైపర్ థైరాయిడిజం లక్షణాలు

థైరాయిడ్ హార్మోన్లు ఎక్కువగా ఉత్పత్తి అయ్యే స్థితిని హైపర్ థైరాయిడిజం అంటారు. ఈ పరిస్థితిలో సాధారణంగా కనిపించే సూచనలు.

  • అకస్మాత్తుగా బరువు తగ్గడం
  • ఆకలి మరింత పెరగడం
  • అధిక రక్తపోటు
  • వేడి తట్టుకోలేకపోవడం
  • తరచూ మూత్రవిసర్జన కావడం

మహిళల్లో ముఖ్యంగా ఋతుస్రావం అసమాన్యతలు, జుట్టు ఎక్కువగా రాలిపోవడం, గర్భధారణలో ఇబ్బందులు కనిపించవచ్చు. డాక్టర్లు చెబుతున్నదేమిటంటే.. ఈ లక్షణాలను నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్య సలహా తీసుకోవడం మంచిది.

గర్భధారణలో థైరాయిడ్

గర్భధారణ సమయంలో థైరాయిడ్ సమతుల్యత చాలా అవసరం. హార్మోన్ల స్థాయిలలో తేడా వస్తే..

  • ప్రీమెచ్యూర్ డెలివరీ
  • తక్కువ బరువుతో పుట్టిన శిశువు
  • ప్రీక్లాంప్సియా వంటి సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి.

ఇవి గర్భిణీ శరీరానికి మాత్రమే కాకుండా శిశువు ఆరోగ్యానికీ ప్రమాదం. అందువల్ల ప్రెగ్నెన్సీ సమయంలో థైరాయిడ్ పరీక్షలు తప్పనిసరిగా చేయించాలి.

ఏ లక్షణాలు ఉంటే జాగ్రత్త పడాలి..?

  • శరీర బరువు అకస్మాత్తుగా తగ్గడం లేదా పెరగడం
  • మానసిక స్థితిలో మార్పులు
  • మెలకువగా లేకపోవడం
  • జుట్టు రాలడం
  • ఎప్పుడూ అలసట
  • నెలసరి సమస్యలు

థైరాయిడ్ ఆరోగ్యం

మీ జీవన విధానమే థైరాయిడ్ ఆరోగ్యానికి పునాది. మీరు పాటించవలసిన కొన్ని ముఖ్యమైన పద్ధతులు.

  • ఐయోడిన్, జింక్, సెలీనియం వంటి ఖనిజాలు ఉండే ఆహారాన్ని తీసుకోవడం
  • ప్రతి రోజు వ్యాయామం ద్వారా హార్మోన్ల స్థిరత్వాన్ని ప్రోత్సహించడం
  • ధ్యానం, యోగా ద్వారా ఒత్తిడిని తగ్గించడం
  • పర్యవేక్షణ కోసం ఎప్పటికప్పుడు బ్లడ్ టెస్ట్‌లు చేయించుకోవడం

థైరాయిడ్ సమస్యలు చాలా మందిలో కనిపిస్తున్నా.. గుర్తించడంలో ఆలస్యం వల్ల దీర్ఘకాలిక సమస్యలకు దారితీస్తుంది. పై లక్షణాలను మీరు ఎప్పుడైనా గమనిస్తే వెంటనే వైద్య నిపుణులను సంప్రదించండి.

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)