AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cancer risk: ఆ లక్షణాలున్నాయా? తస్మాత్ జాగ్రత్త.. అది క్యాన్సర్ కావచ్చు.. ఆలస్యం చేయొద్దు..

2022 నాటికి 14,16,427 మంది క్యాన్సర్‌తో బాధపడుతున్నట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. ముఖ్యంగా మన భారతదేశంలో ప్రతి తొమ్మిది మందిలో కనీసం ఒకరికి క్యాన్సర్ వచ్చే అవకాశం ఉన్నట్లు నిపుణులు చెబుతున్నారు.

Cancer risk: ఆ లక్షణాలున్నాయా? తస్మాత్ జాగ్రత్త.. అది క్యాన్సర్ కావచ్చు.. ఆలస్యం చేయొద్దు..
Heart Stroke
Madhu
|

Updated on: Feb 03, 2023 | 4:30 PM

Share

క్యాన్సర్ చాప కింద నీరులా విస్తరిస్తోంది. ఈ దేశం, ఆ దేశం అని లేదు.. ఈ ప్రాంతం, ఆ ప్రాంతం అని లేదు.. అన్ని చోట్ల పెద్ద సంఖ్యలో ప్రజలను చుట్టేస్తోంది. 2022 నాటికి 14,16,427 మంది క్యాన్సర్‌తో బాధపడుతున్నట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. ముఖ్యంగా మన భారత దేశంలో ప్రతి తొమ్మిది మందిలో కనీసం ఒకరికి క్యాన్సర్ వచ్చే అవకాశం ఉన్నట్లు నిపుణులు చెబుతున్నారు. దీనికి అనేక కారణాలు ఉన్నాయని వారు వివరిస్తున్నారు. ఆహారపు అలవాట్లు, జీవన శైలి, వంశపారంపర్యం, జన్యు పరమైన అంశాలు కూడా ఉన్నాయని చెబుతున్నారు. అయితే ఏ క్యాన్సర్ అయినా తొలి దశలో వచ్చే లక్షణాలను బట్టి గుర్తించాలని, లేకుంటే అది ప్రాణాంతకం కాగలదని వివరిస్తున్నారు.

ఆలస్యంగా నిర్ధారణ అవుతుంది..

సాధారణంగా క్యాన్సర్ అనేది అతి పెద్ద మాస్క్వెరేడర్‌లలో ఒకటి, ఎందుకంటే ఇది ఆలస్యంగా నిర్ధారణ అవుతుంది. మెజారిటీ కేసుల్లో, అది చివరి దశలకు చేరుకునే వరకు సంకేతాలు, లక్షణాలు స్పష్టంగా కనిపించవు. ఎవరికైనా రక్తస్రావం, నొప్పి, దగ్గు మొదలైన అసాధారణ లక్షణాలు కనిపించినప్పుడు లేదా ఇతరులు గమనించినట్లుగా శరీర అలవాట్లు లేదా అకస్మాత్తుగా బరువు తగ్గడం వంటివి గమనించినప్పుడు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవాలి.

వంశపారంపర్యంగా..

క్యాన్సర్ ప్రమాదాన్ని ముందుగా గుర్తించాలంటే కుటంబ చరిత్ర అత్యంత ప్రధానమైనది. మీ కుటుంబంలో ఎవరైనా ఒక వ్యక్తికి క్యాన్సర్ ఉంటే ఆ తర్వాత జనరేషన్స్ కి కూడా వంశపారం పర్యంగా వచ్చే అవకాశం ఉంది. దీనిని జన్యు పరమైన పరీక్ష ద్వారా గుర్తించవచ్చని నిపుణులు చెబుతున్నారు. అది వచ్చే వయస్సు కూడా అంచనా వేయవచ్చని చెబుతున్నారు. సాధారణంగా రొమ్ము క్యాన్సర్‌లు/అండాశయ క్యాన్సర్‌లు/పెద్దప్రేగు క్యాన్సర్‌లు/ప్రోస్టేట్ క్యాన్సర్‌లు/ప్యాంక్రియాటిక్ క్యాన్సర్‌లు మొదలైన క్యాన్సర్‌లను గుర్తించడంలో ఈ జన్యు పరీక్ష ప్రధాన పాత్ర పోషిస్తుంది.

ఇవి కూడా చదవండి

కారణం లేకపోయినా..

వంశపారంపర్యంగా ఎటువంటి సమస్య లేకపోయినా అనేకమందికి క్యాన్సర్ సోకుతున్నట్లు నిపుణులు గుర్తించారు. ఆహారపు అలవాట్లు, ధూమపానం, మద్యపానం, పలు అంటువ్యాధులు, జీవనశైలి మార్పుల కారణంగా క్యాన్సర్ వచ్చే అవకాశాలున్నట్లు వివరిస్తున్నారు.

అన్ని క్యాన్సర్లను నివారించవచ్చా?

ఆరోగ్యకరమైన జీవనశైలి ద్వారా కొన్ని క్యాన్సర్ ల నుంచి మనల్ని మనం కాపాడు కోవచ్చని నిపుణులు చెబుతున్నారు. అలాగే క్యాన్సర్‌ను ముందస్తుగా గుర్తించడం, స్క్రీనింగ్ చేయడం చాలా ముఖ్యమని వివరిస్తున్నారు. కొంతమందికి వంశపారంపర్యంగా క్యాన్సర్ రావచ్చు.. మరికొంతమందికి ధూమపానం లేదా అధిక మద్యపానం వంటి కారణాల వల్ల క్యాన్సర్ రావచ్చు. మరికొందరికి వారి క్యాన్సర్‌కు స్పష్టమైన కారణం ఉండకపోవచ్చు. ఎందుకంటే క్యాన్సర్ అనేది జన్యుపరమైన, పర్యావరణ కారకాల కలయిక వల్ల అభివృద్ధి చెందే సంక్లిష్ట వ్యాధి. అయితే ఒక వ్యక్తి జీవనశైలి, ఆహారం, వ్యాయామం, కుటుంబ చరిత్ర మొదలైన వాటి ద్వారా సూక్ష్మ ప్రమాద కారకాలను గుర్తించవచ్చు.

ఇలా గుర్తించవచ్చు..

క్యాన్సర్ ప్రారంభ దశల్లో గుర్తిస్తే సరైన చికిత్స చేసేందుకు అవకాశం ఏర్పడుతుందని నిపుణులు చెబుతున్నారు. కొన్ని లక్షణాలను వారు వివరించారు. వాటిల్లో విపరీతమైన అలసట, అకస్మాత్తుగా బరువు తగ్గడం, ఆహార అలవాట్లలో మార్పు రావడం, గొంతు సమస్యలు, దీర్ఘకాలంగా ఉండే దగ్గు, నయం చేయలేని పుండ్లు , మహిళల్లో అసాధారణ పీరియడ్స్, పెల్విక్ నొప్పి, రొమ్ము పరిమాణాల్లో మార్పులు, నొప్పి, అజీర్ణం, మింగడంలో ఇబ్బంది, తరచూ జ్వరాలు, మొటిమలలు తదితరాలను లక్షణాలు గుర్తించవచ్చని చెబుతున్నారు.

అందుబాటులో చికిత్సలు..

ఇటీవలి కాలంలో క్యాన్సర్ కు మంచి చికిత్సలు అందుబాటులోకి వచ్చాయి. క్యాన్సర్ రకాన్ని బట్టి వైద్య చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. కొత్త మందులు, ఇమ్యునోథెరపీ వంటివి అందుబాటులో ఉన్నాయి. అది క్యాన్సర్ రకం, అది ప్రస్తుతం ఉన్న దశ, రోగుల ఆరోగ్య పరిస్థతి తదితర అంశాలపై ఇది ఆధారపడి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.

మన దేశంలో సాధారణ క్యాన్సర్లు ఇవి..

అధికారిక సమాచారం ప్రకారం, తల, మెడ, ఊపిరితిత్తుల క్యాన్సర్లు పురుషులలో సర్వసాధారణం కాగా, గర్భాశయ , రొమ్ము క్యాన్సర్ మహిళల్లో సర్వసాధారణం. పెద్ద పేగు క్యాన్సర్‌లు కూడా ఇటీవల బాగా పెరుగుతున్నాయి. మన దేశంలో అత్యంత సాధారణ క్యాన్సర్ ఊపరితిత్తుల క్యాన్సర్ కాగా ఆ తర్వాత స్థానంలో పెద్ద పేగు క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్ వంటివి కూడా అధికంగా వ్యాపిస్తున్నాయి.

మరిన్ని హెల్త్ వార్తల కోసం..