Skin Care: మీ స్కిన్ డల్‌గా కనిపిస్తుందా… ఈ సూపర్ ఫుడ్స్ తప్పనిసరిగా తినాలి… అవేంటో తెలుసా..?
మనం తీసుకునే ఆహారాన్ని బట్టే మన చర్మ నిగారింపు ఉంటుంది. శరీరానికి తగినంత ప్రొటీన్స్, పోషకాలు అందించనట్లితే...చర్మం తాజాగా,యవ్వనంగా కనిపించదు.

మనం తీసుకునే ఆహారాన్ని బట్టే మన చర్మ నిగారింపు ఉంటుంది. శరీరానికి తగినంత ప్రొటీన్స్, పోషకాలు అందించనట్లితే…చర్మం తాజాగా,యవ్వనంగా కనిపించదు. ఫైబర్ లేని ప్రాసెస్ చేసిన పదార్థాలు తీసుకుంటే చర్మం నిగారింపును కోల్పోతుంది. డల్ గా కనిపిస్తుంది. అంతేకాదు పొడిబారడం, మొటిమలు, నల్లటి వలయాలు వంటి సమస్యలకు దారి తీస్తాయి. చాలామంది మెరిసే చర్మం కోసం అనేక మార్గాలను అన్వేషిస్తారు. రసాయనాలు కలిగిన అనేక బ్యూటీ ప్రొడక్స్ట్ ను వాడుతుంటారు. అయినా ఎలాంటి ఫలితం ఉండదు. అయితే చర్మ సౌందర్యం కోసం బయట చేసే ప్రయోగాలకన్నా..మనం తీసుకునే ఆహారం ఎంతగానో ఉపయోగపడుతుంది. ప్రొటీన్ ఉన్న మంచి ఆహారం తీసుకుంటే మన చర్మం ఆరోగ్యంగా ఉండటమే కాదు నిగారింపును కూడా సొంతం చేసుకుంటుంది.
చర్మం అందంగా నిగారింపును సంతరించుకోవాలంటే కొన్ని సూపర్ ఫుడ్స్ తీసుకోవాలి. ఈ సూపర్ ఫుడ్స్ చర్మాన్ని యవ్వనంగా ఉంచుతాయి. అంతేకాదను మీ చర్మానికి నిగారింపు కూడా వస్తుంది. నిత్య యవ్వనంగా కనిపిస్తారు. మరి ఆ సహాజసిద్ధమైన 7 సూపర్ ఫుడ్స్ ఏంటో తెలుసుకుందాం.
ఆరోగ్యకరమైన చర్మం కోసం 7 యాంటీ ఇన్ఫ్లమేటరీ ఫుడ్స్ ఇవే:
1. టొమాటో:
టొమాటోను మనం నిత్యం ఆహారంలో తీసుకుంటాం. టొమాటోలో లైకోపిన్, విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇవి రెండూ కూడా శరీరంలోని వేడిని ఆరికట్టడంలో సహాయపడే పోషకాలు. అంతేకాదు వీటిలో యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి ఆరోగ్యకరమైన చర్మానికి అద్బుతమైన సప్లిమెంట్‌గా పనిచేస్తాయి. టొమాటోను పచ్చిగా కానీ,స్టైర్ ఫ్రైస్లో కానీ, సాస్‌ల రూపంలో కానీ తీసుకోవచ్చు.
2. వెల్లుల్లి:
యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రయోజనాలను అందించే సహాజ ఆహారాల్లో వెల్లుల్లి ఒకటి. ఇది ఆక్సీకరణ ఒత్తిడిని కూడా తగ్గిస్తుంది. ఫ్రీరాడికల్స్ తో పోరాడుతుంది. మీ ఆహారంలో తరచుగా వెల్లుల్లిని చేర్చుకుంటే మంచి ఫలితం ఉంటుంది.
3. లిఫీ గ్రీన్స్:
లిఫీగ్రీన్స్ అంటే ఆకుకూరలు. బచ్చలికూర, పాలకూర,తోటకూర ఇలా ఏదైన కావచ్చు. ఇందులో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి. అవి శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్‌గా పనిచేస్తుంది. అంతేకాదు లిఫీ గ్రీన్స్‌లో విటమిన్ సి కూడా పుష్కలంగా లభిస్తుంది. ఆకుకూరలను తరచుగా మీ ఆహారంలో భాగం చేసుకోండి. వారానికి రెండు సార్లు ఆకుకూరలను తీసుకున్నట్లయితే మీ చర్మ ఆరోగ్యంలో తేడా గమనించవచ్చు.
4. గింజలు:
గింజలు అత్యంత పోషక విలువలు కలిగిన ఆహారాలలో ఒకటి. వీటిలో యాంటీ ఇన్ఫ్లమేటరీ సమ్మేళనాలను కూడా కలిగి ఉన్నాయని పలు పరిశోధనల్లో వెల్లడైంది. బాదం, వాల్‌నట్‌లు, జీడిపప్పు, గుమ్మడికాయ గింజలు, పొద్దుతిరుగుడు విత్తనాలు, నువ్వులు వంటివి చర్మ సంరక్షణకు చాలా ప్రయోజనకరంగా ఉంటాయి. వీటిని తరచుగా ఆహారంలో చేర్చుకునే ప్రయత్నం చేయండి.
5. బ్లూబెర్రీస్:
బ్లూబెర్రీస్‌లో అనేక ఫ్లేవనాయిడ్స్ ఉంటాయి. ఇవి మెదడు కణాలు దెబ్బకుండా నిరోధించడంలో సహాయపడతాయి. వీటిలో మతిమరుపును నివారించడంలో సహాయపడే ఫోటో కెమికల్స్ కూడా కలిగి ఉంటాయి. బ్లూబెర్రీస్ ముఖ్యంగా యాంటీఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి శరీరంలో వచ్చే మంటను సహజంగా ఎదుర్కొంటాయి. ఆరోగ్యకరమైన చర్మం కోసం వాటిని పచ్చిగా కానీ సలాడ్లలో కానీ చేర్చుకుని తినవచ్చు.
6. అవోకాడో:
ఒమేగా -3 వంటి ఆరోగ్యకరమైన కొవ్వులు కూడా శరీరంపై యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రభావాన్ని కలిగి ఉంటాయి. అవకాడోలు సహజంగా ఆరోగ్యకరమైన మోనో-అసంతృప్త కొవ్వులతో సమృద్ధిగా ఉన్న ఆహారాలలో ఒకటి. అలాగే యాంటీఆక్సిడెంట్లు శరీరం మంటతో పోరాడటానికి, మృదువుగా, మెరిసే చర్మాన్ని అందించడంలో సహాయపడతాయి. కాబట్టి, సహజంగానే, ఆరోగ్యకరమైన చర్మానికి కోసం తరచుగా తినండి.
7. మునగ:
మునగలో విటమిన్ సి అధికంగా ఉంటుంది. ఏ సిట్రస్ పండ్లలో లేని విధంగా ఇందులో విటమిన్ సి లభిస్తుంది. మునగ చర్మాన్ని కాంతివంతంగా చేయడంతోపాటు… చర్మంపై వృద్ధాప్య లక్షణాలు కనపడకుండా చేస్తుంది. మునగతో తయారు చేసే వంటకాలు తింటే చర్మానికి ఎంతో మేలు జరుగుతుంది.
ఈ 7 సూపర్ ఫుడ్స్ మాత్రమే కాకుండా నిమ్మ, పసుపు, చిలగడదుంపలు మొదలైనవి కూడా ఆరోగ్యకరమైన ఆహారం కిందకే వస్తాయి. ఇవి కూడా మీకు చర్మ నిగారింపునకు దోహదపడతాయి. వీటిని కూడా తరచుగా ఆహారం తీసుకునే ప్రయత్నం చేయండి.
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి