AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cancer Disease: క్యాన్సర్‌ కేసులు ఎందుకు పెరుగుతున్నాయి..? పరిశోధకుల షాకింగ్‌ నివేదిక

క్యాన్సర్‌ వ్యాధి వృద్ధుల్లో మాత్రమే వస్తుందని భావిస్తుంటారు చాలా మంది. కానీ మారుతున్న కాలానుగుణంగా చిన్న పెద్ద అనే తేడా లేకుండా అందరిని చుట్టుముట్టేస్తుంది..

Cancer Disease: క్యాన్సర్‌ కేసులు ఎందుకు పెరుగుతున్నాయి..? పరిశోధకుల షాకింగ్‌ నివేదిక
Cancer Disease
Subhash Goud
|

Updated on: Feb 17, 2023 | 6:30 AM

Share

క్యాన్సర్‌ వ్యాధి వృద్ధుల్లో మాత్రమే వస్తుందని భావిస్తుంటారు చాలా మంది. కానీ మారుతున్న కాలానుగుణంగా చిన్న పెద్ద అనే తేడా లేకుండా అందరిని చుట్టుముట్టేస్తుంది. ఈ మధ్య కాలంలో యువకుల్లో కూడా ఈ వ్యాధి వస్తుంది. ఇటీవల బ్రిగ్‌హామ్ అండ్ ఉమెన్స్ హాస్పిటల్, హార్వర్డ్ యూనివర్సిటీ నివేదిక ప్రకారం.. 50 ఏళ్లలోపు వారికి క్యాన్సర్ ముప్పు నిరంతరం పెరుగుతోంది. 1970లో పుట్టిన వారితో పోలిస్తే 1990 తర్వాత పుట్టిన వారికి క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని పరిశోధకులు చెబుతున్నారు.

క్యాన్సర్ కారణం

సాధారణంగా గుట్కా, ధూమపానం, మద్యం, కాలుష్యం వంటివి క్యాన్సర్‌కు కారణమని భావిస్తుంటారు. అయితే పరిశోధనల ప్రకారం.. చిన్ననాటి నుండి ఇప్పటి వరకు మీ జీవనశైలి కూడా క్యాన్సర్‌కు కారణమని తేలింది. క్యాన్సర్‌కు ప్రధాన కారణాలు ఆహారం, జీవనశైలి, పర్యావరణం, మన కడుపులో నివసించే పురుగులు (మైక్రోబయోమ్). ఊబకాయం కూడా క్యాన్సర్‌కు ప్రధాన కారణం. చిన్నతనం నుంచి ఊబకాయం ఉన్నవారికి క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.

పోషకాహార లోపం కూడా క్యాన్సర్‌కు ప్రధాన కారణం. గర్భిణీ స్త్రీలో పోషకాహార లోపం ఉంటే, ఆమె బిడ్డలో క్యాన్సర్ వచ్చే ప్రమాదం పెరుగుతుంది. ధూమపానం కాకుండా పర్యావరణం, రోజువారీ ఆహారం మరియు జీవనశైలి కూడా క్యాన్సర్‌కు కారణమవుతున్నాయి.

ఇవి కూడా చదవండి

ఎవరు ఎక్కువ ప్రమాదంలో ఉన్నారు?

50 ఏళ్లలోపు, అపై పైబడిన వారిలో క్యాన్సర్ జన్యువులు భిన్నంగా ఉన్నట్లు బ్రిగ్‌హామ్ అండ్ ఉమెన్స్ హాస్పిటల్, హార్వర్డ్ యూనివర్సిటీ పరిశోధకులు చెబుతున్నారు. దాని ప్రభావం కూడా భిన్నంగా ఉంటుంది. 50 ఏళ్ల వయస్సులో క్యాన్సర్ వచ్చినప్పుడు ఇది మరింత హానికరం. కొత్త తరాలకు క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఎక్కువ. పరిశోధకులు 14 రకాల క్యాన్సర్లపై పరిశోధనలు చేశాయి. ఇందులో భిన్నమైన కారణాలు తెరపైకి వచ్చాయి. మీరు క్యాన్సర్‌ను నివారించాలనుకుంటే మొదటి నుండి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సిన అవసరం ఉంది.

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణుల సలహాలు, సూచనల మేరకు అందించడం జరుగుతుంది. ఏవైనా సందేహాలు ఇంటే నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

నీటిపై ఇళ్లు.. నీళ్లే దారులు.. భారతదేశపు మిస్టరీ గ్రామం!
నీటిపై ఇళ్లు.. నీళ్లే దారులు.. భారతదేశపు మిస్టరీ గ్రామం!
ఏపీ ప్రజలకు చంద్రబాబు డబుల్ గిఫ్ట్.. ఒకేసారి రెండు పథకాలు..
ఏపీ ప్రజలకు చంద్రబాబు డబుల్ గిఫ్ట్.. ఒకేసారి రెండు పథకాలు..
ఎంబీబీఎస్ మార్కుల లిస్ట్ షేర్ చేసిన హీరోయిన్..
ఎంబీబీఎస్ మార్కుల లిస్ట్ షేర్ చేసిన హీరోయిన్..
40 ఏళ్ల తర్వాత మళ్లీ కలిసిన చిన్ననాటి స్నేహం.. జ్ఞాపకాల బస్సులో..
40 ఏళ్ల తర్వాత మళ్లీ కలిసిన చిన్ననాటి స్నేహం.. జ్ఞాపకాల బస్సులో..
బంగ్లాకు మద్దతుగా పాక్.. టీ20 ప్రపంచకప్ నుంచి ఔట్..?
బంగ్లాకు మద్దతుగా పాక్.. టీ20 ప్రపంచకప్ నుంచి ఔట్..?
గుప్త నవరాత్రులలో.. శ్యామల దేవిని పూజిస్తే ఎన్ని లాభాలో తెలుసా?
గుప్త నవరాత్రులలో.. శ్యామల దేవిని పూజిస్తే ఎన్ని లాభాలో తెలుసా?
వార్నీ.. అదేంటక్కాయ్ అలా తన్నేశావ్.. కొద్దిలో ఉంటే ..
వార్నీ.. అదేంటక్కాయ్ అలా తన్నేశావ్.. కొద్దిలో ఉంటే ..
ఒకేసారి షాకిస్తూ భారీగా పెరిగిన గోల్డ్ రేట్లు.. నేటి రేట్లు ఇవే..
ఒకేసారి షాకిస్తూ భారీగా పెరిగిన గోల్డ్ రేట్లు.. నేటి రేట్లు ఇవే..
నువ్వేం దొంగవు రా నాయనా.. నీ తెలివి తెల్లార.. ఏం జరిగిందో..
నువ్వేం దొంగవు రా నాయనా.. నీ తెలివి తెల్లార.. ఏం జరిగిందో..
బడ్జెట్‌లో భారీ శుభవార్త చెప్పనున్న కేంద్రం.. దేశ ప్రజలందరికీ..
బడ్జెట్‌లో భారీ శుభవార్త చెప్పనున్న కేంద్రం.. దేశ ప్రజలందరికీ..