Health Tips: ఎండాకాలంలో రోజుకు ఎన్ని గ్లాసుల నీరు తాగాలి.? అతిగా తాగితే ఏమవుతుందో తెల్సా

రోజూ ఎంత నీరు త్రాగాలి అనే దానికి ఖచ్చితమైన సమాధానం లేదు. శరీర కార్యకలాపాలు, వాతావరణం, ఆరోగ్య పరిస్థితులు వంటి అనేక అంశాలపై ఇది ఆధారపడి ఉంటుంది. ఉదయం ఎక్కువ నీరు త్రాగడం మంచిది. మూత్రం రంగును బట్టి నీటి అవసరాన్ని అంచనా వేయవచ్చు.

Health Tips: ఎండాకాలంలో రోజుకు ఎన్ని గ్లాసుల నీరు తాగాలి.? అతిగా తాగితే ఏమవుతుందో తెల్సా
Water

Updated on: Mar 09, 2025 | 9:16 AM

ఓ వ్యక్తి ప్రతిరోజూ ఎన్ని లీటర్ల నీళ్లు తాగాలి? ఏ సమయంలో నీళ్లు తాగాలి? ఈ ప్రశ్నలకు రకరకాల సమాధానాలు వినిపిస్తుంటాయి. ఉదయాన్నే నిద్రలేవగానే ఎక్కువ నీళ్లు తాగాలని కొందరు చెబితే, ప్రతిరోజూ ఇన్ని లీటర్ల నీళ్లు తప్పనిసరిగా తాగాల్సిందేనని మరికొందరు అంటారు. వీటిలో ఏది నిజమో పక్కన పెడితే, వేసవికాలం మొదలవుతుండటంతో ఈ నీటి లెక్క మరింత చేచినయాంశం కాబోతోంది. వాస్తవానికి ఒక మనిషి రోజుకు ఎన్ని నీళ్లు తాగాలనేదానికి స్పష్టమైన లెక్కలు లేవు. కానీ భౌగోళిక పరిస్థితులు, ఎండల తీవ్రత అంశాల ఆధారంగా ఒక మనిషి ఎన్ని నీళ్లు తాగాలి అనేది ఆధారపడి ఉంటుందని ఎక్కువమంది వైద్య నిపుణుల అభిప్రాయం. ఒక మనిషి పనిచేసే వాతావరణం ప్రకారం నీళ్లు తీసుకోవాల్సి ఉంటుందని చెబుతున్నారు. తాగునీటి పరిమాణం అందరిలోనూ ఒకే విధంగా ఉండదని హార్వర్డ్ మెడికల్ స్కూల్ స్పెషల్ హెల్త్ రిపోర్ట్ చెబుతోంది. ఒక మనిషి జీవనశైలి, పనిప్రదేశం, ఉష్ణోగ్రతలతో పాటు ఆరోగ్య సమస్యలు తీసుకునే మందుల ఆధారంగా మంచి నీటిని తీసుకోవాలని ఈ నివేదిక పేర్కొంది. నీళ్లు ఎప్పుడు తాగాలి అనే దానిపై వైద్య నిపుణులు పలు సూచనలు చేస్తున్నారు.

ఇది చదవండి: 109 బంతుల్లో ఒక్క పరుగు చేయలేదు.. ఈ డైనోసర్ బౌలర్ ముందు కోహ్లీ అట్టర్ ఫ్లాప్.. ఎవరో తెల్సా

రాత్రి నిద్రపోయి ఉదయం నిద్రలేచేసరికి ఓ మనిషి శరీరంలో నీటి నిల్వలు తగ్గుతాయి. అందువల్ల ఉదయాన్నే కొంచెం ఎక్కువ నీళ్లు తీసుకోవాలని అంటారు. సాధారణంగా మూత్రం కొద్దిగా లేత పసుపు రంగులో ఉంటుంది. నీళ్లు ఎక్కువగా తాగితే మూత్రం కూడా అదే రంగులో వస్తుంది. చాలాసేపు మంచి నీళ్లు తాగకుండా ఉంటే మూత్రం ముదురు పసుపు రంగులోకి మారుతుంది. కొన్నిసార్లు మూత్రంలో మంట కూడా వస్తుంది. ఒక మనిషి రోజుకు కనీసం లీటర్ నుంచి లీటర్న్నర వరకు మూత్రం పోయా లని వైద్యులు చెబుతున్నారు. మూత్రం లేత పసుపు రంగు నుంచి ముదురు పసుపు రంగులోకి మారేవరకు ఆగకుండా నీరు తాగాలి. ఒకవేళ ముదురు పసుపు రంగులోకి మారితే ఖచ్చితంగా తగినన్ని నీళ్లు తీసుకోవాలని సూచిస్తున్నారు. అయితే ఎన్ని నీళ్లు తాగాలనేది సదరు వ్యక్తి పనిచేసే ఉంటున్న వాతావరణ పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకు కార్యాలయంలో పనిచేసేవారైతే రోజుకు రెండు లీటర్ల వరకు నీళ్లు తాగాలని వైద్యులు చెబుతున్నారు. అదే తీవ్రమైన ఎండలో బహిరంగ ప్రదేశాల్లో పనిచేసే వ్యవసాయ కూలీలు, కార్మికుల శరీరం నుంచి చెమట రూపంలో నీటి నిల్వలు శరీరం నుంచి బయటకు పోతాయి. అందువల్ల అలాంటి వారు రోజుకు కనీసం మూడు నుంచి నాలుగు లీటర్ల నీళ్లు తాగాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

ఇది చదవండి: దమ్మునోడురా మావా.! బీసీసీఐ ఛీ కొట్టి తరిమేసింది.. కట్ చేస్తే.. 14 ఫోర్లు, 3 సిక్సర్లతో ఊచకోత

శరీరంలో నీటి నిల్వలు తగ్గకూడదని, నీళ్లు అతిగా తాగినా ముప్పు ఏనని వైద్యులు హెచ్చరిస్తున్నారు. నీళ్లు ఎక్కువగా తాగితే శరీరంలోని సోడియం మూత్రంతో వెళ్లిపోయే ప్రమాదం ఉంది. అందువల్ల అతిగా నీళ్లు తీసుకోవడం కూడా ముప్పు. ఇక రక్తపోటు మందులు శరీరంలో సోడియం లెవెల్స్‌ను తగ్గిస్తాయి. రక్తపోటు మందులు తీసుకునేవారు నీళ్లు ఎక్కువగా తాగితే సోడియం లెవెల్స్ మరింత వేగంగా తగ్గుతాయి. అదే జరిగితే మెదడు దెబ్బతిని మనిషి అపస్మారక స్థితిలోకి వెళ్లే ముప్పు ఉంది. అందువల్ల రక్తపోటు మందులు వాడుతున్నవారు నీటిని తీసుకోవడంలో జాగ్రత్తలు పాటించాల్సిందేనని వైద్యులు సూచిస్తున్నారు.

ఇది చదవండి: ఈ ఫోటోలో మీకు మొదటిగా కనిపించేది.. మీరెలాంటివారో చెప్పేస్తుంది.. ఎలాగంటే.?

మరిన్ని హెల్త్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి