Diabetic Patients: చర్మంపై దురద, దద్దుర్లతో ఇబ్బంది పడుతున్నారా… అది మధుమేహం లక్షణమా?

|

Jul 25, 2024 | 7:22 PM

మధుమేహం అనేది శరీరంలో చక్కెర స్థాయిని పెంచుతుందని నిపుణులు అంటున్నారు. శరీరం తగినంత ఇన్సులిన్ ఉత్పత్తి చేయనప్పుడు లేదా ఇన్సులిన్ సరిగ్గా ఉత్పత్తి కానప్పుడు మధుమేహ వ్యాధి బారిన పడతారు. ఇన్సులిన్ అనేది శరీరంలో చక్కెర స్థాయిని నియంత్రించడంలో సహాయపడే హార్మోన్. ఈ హార్మోన్ సరిగా పని చేయనప్పుడు చక్కెర స్థాయి పెరుగుతుంది. ఇది మధుమేహానికి దారితీస్తుంది.

Diabetic Patients: చర్మంపై దురద, దద్దుర్లతో ఇబ్బంది పడుతున్నారా... అది మధుమేహం లక్షణమా?
Diabetic Patients
Follow us on

మధుమేహం ఒక తీవ్రమైన ఆరోగ్య సమస్య. ఈ వ్యాధి శరీరంలోని అనేక భాగాలను ప్రభావితం చేస్తుంది. ఇందులో చర్మం కూడా ఉంటుంది. డయాబెటిక్ పేషెంట్లు ఏదో ఒక సమయంలో చర్మంపై దద్దుర్లు లేదా ఇతర చర్మ సంబంధిత సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. మధుమేహ బారిన పడిన వారు చర్మంపై దురదతో ఇబ్బంది పడవచ్చు. మధుమేహ వ్యాధిగ్రస్తుల చర్మంపై దురద, దద్దుర్లు ఏర్పడి తీవ్రంగా ఇబ్బంది పడవచ్చు.

మధుమేహం అనేది శరీరంలో చక్కెర స్థాయిని పెంచుతుందని నిపుణులు అంటున్నారు. శరీరం తగినంత ఇన్సులిన్ ఉత్పత్తి చేయనప్పుడు లేదా ఇన్సులిన్ సరిగ్గా ఉత్పత్తి కానప్పుడు మధుమేహ వ్యాధి బారిన పడతారు. ఇన్సులిన్ అనేది శరీరంలో చక్కెర స్థాయిని నియంత్రించడంలో సహాయపడే హార్మోన్. ఈ హార్మోన్ సరిగా పని చేయనప్పుడు చక్కెర స్థాయి పెరుగుతుంది. ఇది మధుమేహానికి దారితీస్తుంది.

మధుమేహం రెండు రకాలు

మధుమేహానికి అనేక కారణాలు ఉండవచ్చు. ప్రధాన కారణాలలో ఒకటి జన్యుపరమైనది.. అంటే కుటుంబంలో ఎవరికైనా మధుమేహం ఉంటే వారసులు దాని బారిన పడే ప్రమాదం ఉంది. దీనినే టైప్-1 డయాబెటిస్ అంటారు. అంతే కాదు తప్పుడు ఆహారపు అలవాట్లు, చెడు జీవనశైలి కూడా షుగర్ వ్యాధికి కారణం. ఇలా వచ్చే మధుమేహాన్ని టైప్-2 డయాబెటిస్ అంటారు.

ఇవి కూడా చదవండి

డయాబెటిస్‌ వ్యాధిగ్రస్తులకు దద్దుర్లు ఎందుకు వస్తాయి?

అనేక కారణాల వల్ల డయాబెటిస్‌లో చర్మంపై దద్దుర్లు వస్తాయని ఆర్‌ఎంఎల్ హాస్పిటల్ డెర్మటాలజీ విభాగం మాజీ అధిపతి డాక్టర్ భావుక్ ధీర్ చెప్పారు. శరీరంలో చక్కెర స్థాయి తగ్గడం వల్ల శక్తి లోపిస్తుంది. దీని కారణంగా చర్మ కణాలు ప్రభావితమవుతాయి. చర్మ సంబంధిత సమస్యలు వస్తాయి.

అంతేకాదు షుగర్ పేషెంట్స్ కు నివారణ కోసం మందులు తీసుకుంటే చర్మంపై దద్దుర్లు వచ్చే ప్రమాదం ఉంది. ఇలా స్కిన్ ఇబ్బందులు తలెత్తితే మందులను మార్చుకోవాలి అని సూచన కావచ్చు. అందుకనే ఈ సందర్భాలలో బాధితులు తప్పనిసరిగా వైద్యులను సంప్రదించాలి.

ఎలా రక్షించుకోవాలంటే

  1. రక్తంలో షుగర్ లెవెల్స్ ను తగిన స్థాయిలో ఉండేలా చూసుకోవాలి
  2. గోరువెచ్చని నీటితో స్నానం చేయాలి.. మాయిశ్చరైజింగ్ సబ్బును ఉపయోగించండి.
  3. చర్మాన్ని తేమగా ఉంచడానికి సిరామైడ్ కలిగిన క్రీమ్ ఉపయోగించండి.
  4. ఒక టవల్ తో చర్మాన్ని సున్నితంగా అద్దుకోవాలి. చర్మాన్ని పొడిగా ఉంచుకోవాలి.
  5. చర్మం హైడ్రేటెడ్ గా ఉంచుకోవాలి.

 

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..