Diabetes: ఆహారంలో వీటిని చేర్చుకోకపోతే మధుమేహం ముప్పు.. తాజా అధ్యయనంలో వెలుగు చూసిన షాకింగ్‌ విషయాలు

|

Oct 31, 2022 | 2:02 PM

డైట్‌లో కార్బొహైడ్రేట్లు లోపిస్తే డయాబెటిస్‌ బారిన పడే ప్రమాదం ఎక్కువగా ఉందని ఈ రీసెర్చిలో తేలింది. JAMA నెట్‌వర్క్ ఓపెన్‌లో ప్రచురితమైన ఒక అధ్యయనం ప్రకారం, తక్కువ కార్బ్ ఆహారం శరీరంలో ఇన్సులిన్ వ్యవస్థను దెబ్బతీస్తుంది

Diabetes: ఆహారంలో వీటిని చేర్చుకోకపోతే మధుమేహం ముప్పు.. తాజా అధ్యయనంలో వెలుగు చూసిన షాకింగ్‌ విషయాలు
Diabetes
Follow us on

ఈ రోజుల్లో ప్రజలు బరువు తగ్గడం లేదా ఆరోగ్యంగా ఉండడం కోసం ఒక క్రమపద్ధతైన డైట్‌ ప్లాన్‌ను ఏర్పాటుచేసుకుంటున్నారు. అలాగే ఫిట్‌గా ఉండేందుకు శారీరక వ్యాయామాలు చేస్తున్నారు. అయితే చాలామంది స్టార్ట్‌ అండ్‌ స్లిమ్‌గా మారే క్రమంలో చాలామంది ఆహర పద్ధతులను మార్చుకుంటున్నారు. మరికొందరైతే బరువు తగ్గేందుకు ఏకంగా కడుపు మాడ్చుకుంటున్నారు. అయితే ఇలా చేయడం వల్ల మధుమేహం లాంటి ప్రమాదకరమైన వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందంటున్నారు నిపుణులు. ఇటీవల ఓ అధ్యయనం కూడా ఇదే విషయాన్ని ఉటంకించింది. డైట్‌లో కార్బొహైడ్రేట్లు లోపిస్తే డయాబెటిస్‌ బారిన పడే ప్రమాదం ఎక్కువగా ఉందని ఈ రీసెర్చిలో తేలింది. JAMA నెట్‌వర్క్ ఓపెన్‌లో ప్రచురితమైన ఒక అధ్యయనం ప్రకారం, తక్కువ కార్బ్ ఆహారం శరీరంలో ఇన్సులిన్ వ్యవస్థను దెబ్బతీస్తుంది. తద్వారా మధుమేహం వచ్చే ప్రమాదాన్ని పెంచుతుంది. ఇందుకోసం రెండు గ్రూపులు ఏర్పాటుచేసి ఒకరికి తక్కువ కార్బ్ డైట్‌ను అందించింది. నివేదిక ప్రకారం, ఆరు నెలల తర్వాత ఈ సమూహంలో ఉన్న వారికి హిమోగ్లోబిన్ స్థాయులు బాగా పడిపోయాయట. బరువు తగ్గడానికి తక్కువ కార్బ్ డైట్ పాటించడం మంచిదని, అయితే ఇది నిరంతరం లేకపోవడం వల్ల మధుమేహం మాత్రమే కాకుండా ఇతర ఆరోగ్య సమస్యలు కూడా వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

వీటిని డైట్‌లో చేర్చుకోవాల్సిందే..

రొట్టెలు, అన్నం లాంటి ఆరోగ్యకరమైన పిండి పదార్థాలతో పాటు తక్కువ కేలరీల పండ్లు, కూరగాయలను బాగా తినాలి. వీటిని తినడం వల్ల బరువు పెరగరు. అలాగే ఇందులో పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది. ఇక గ్రీన్ టీలో కార్బోహైడ్రేట్లు పుష్కలంగా ఉంటాయి, ఇది ఆకలి హార్మోన్‌ను నియంత్రిస్తుంది. అలాగే షుగర్ లెవెల్ ని కంట్రోల్ చేస్తుంది. మెటబాలిజం రేటును మెరుగు పరుస్తుంది. అలాగే తృణధాన్యాలు, కాయధాన్యాలు ఆరోగ్యకరమైన కార్బోహైడ్రేట్ల మంచి వనరులు. ఇవి ప్రోటీన్, ఐరన్, విటమిన్లు మరియు ఇతర పోషకాలతో నిండి ఉంటాయి. తృణధాన్యాలు, పప్పుధాన్యాలు తక్కువ కొవ్వు, కేలరీలు, ఫైబర్‌తో నిండి ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

ఇవి కూడా చదవండి

మరిన్ని హెల్త్ వార్తల కోసం  క్లిక్ చేయండి