ప్రతి ఒక్కరి కిచెన్ అల్మారాలో కనిపించే మొదటి ఆహార పదార్థం జీలకర్ర. అది సాంబారు, రసం, కర్రీ వంట ఏదైనా జీలకర్ర పడాల్సిందే. లేకుండా ఆహారం రుచిగా ఉండదు . ఇది సాధారణ కూరగాయల రుచిని కూడా మారుస్తుంది. రుచితో పాటు జీలకర్ర ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. జీలకర్ర తీసుకోవడం వల్ల జీర్ణక్రియ చాలా బలంగా మారుతుంది. అలాగే శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతుంది. దీన్ని తీసుకోవడం వల్ల అనేక ఉదర సంబంధిత సమస్యలు నయమవుతాయి. దీంతో పాటు శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది. అలాగే కోరింత దగ్గు, బ్రోన్కైటిస్, అలెర్జీ వంటి శ్వాసకోశ వ్యాధులకు వ్యతిరేకంగా ఇది చాలా అద్భుతంగా పని చేస్తుంది. అయితే ‘అతి సర్వత్రా వర్జయేత్’ అన్నట్లు అతిగా తీసుకుంటే ఏదైనా అనర్థమే. బోలెడు ఆరోగ్యప్రయోజనాలున్న జీలకర్ర విషయంలోనూ ఈ నియమం వర్తిస్తుంది. జీలకర్ర ఎక్కువగా తీసుకోవడం వల్ల హార్ట్ బర్న్ సమస్యలు తలెత్తుతాయి. దీంతో జీర్ణ సమస్యలు కూడా ఎదురవుతాయి. అందుకే ఈ మసాలాను పరిమిత పరిమాణంలో తీసుకోవాలంటున్నారు నిపుణులు.
కాలేయం దెబ్బతినే ప్రమాదం
జీలకర్రను ఎక్కువగా తీసుకోవడం వల్ల కిడ్నీలు దెబ్బతినే ప్రమాదం ఉంది. కాటట్టి వంటల్లో జీలకర్రను తక్కువగా వేయాలి. లేదంటే మన శరీరానికి ఫిల్టర్‌గా పనిచేసే కిడ్నీల పనితీరు దెబ్బతింటుంది. ఇక మోతాదుకు మించి జీలకర్ర తీసుకోవడం వల్ల పుల్లటి తేన్పులు వస్తాయి. ఇవి ప్రేగులు, కడుపులో పేరుకుపోయిన వాయువును విడుదల చేస్తాయి. ఇక జీలకర్రను అధికంగా తీసుకోవడం వల్ల శరీరంలో చక్కెర స్థాయులు తగ్గిపోతాయి. ఫలితంగా తీవ్ర అలసట, బలహీనత, మైకం వంటి సమస్యలు తలెత్తుతాయి. కాబట్టి లోబీపీ బాధితులు జీలకర్ర పరిమితంగానే తీసుకోవాలి. అందుకే ఎవరైనా సర్జరీ చేయించుకునేవారికి, డాక్టర్లు రెండు వారాల ముందు నుంచే జీలకర్రను తినొద్దని చెబుతుంటుంటారు. ఆపరేషన్ చేయించుకోవడానికి రక్తంలో షుగర్ లెవల్స్ కంట్రోల్ లో ఉండటం తప్పనిసరి కదా. అందువల్లే డాక్టర్లు జీలకర్రకు దూరంగా ఉండమంటుంటారు. ఇక మహిళలు పీరియడ్స్ సమయంలో జీలకర్రను ఎక్కువగా తీసుకోవడం వల్ల రక్తస్రావం అధికంగా జరిగే ప్రమాదం ఉంది. అలాగే గర్భిణులు కూడా డాక్టర్ల సలహా మేరకే జీలకర్రను తీసుకోవాలి.
మరిన్ని ఆరోగ్య సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..