ప్రస్తుత కాలంలో మలబద్ధకం అనేది సాధారణ సమస్యగా మారింది. మారిన ఆహార అలవాట్ల కారణంగా ముఖ్యంగా యువతలో మలబద్ధక సమస్య అధికంగా ఉంది. కానీ ఆ సమస్యతో బాధపడడం తప్ప చికిత్స తీసుకోవడానికి సిగ్గు పడుతుంటారు. చలికాలంలో శారీరక శ్రమ లేకపోవడం పరిస్థితిని మరింత దిగజారుస్తుంది. రోజువారీ దినచర్య ఈ సమస్యతో డిస్ట్రబ్ అవుతుంది. మధుమేహం, హైపోథైరాడిజం, సాధారణ కడుపు సమస్యలు వంటివి కూడా మలబద్ధక సమస్యకు కారణం కావొచ్చు. ధీర్ఘకాలిక మలబద్ధక సమస్య హోమోరాయిడ్స్, ఆసన పగుళ్లు, ప్రోలాప్స్ వంటి సమస్యలను పెంచుతుంది. శీతాకాలంలో ఈ సమస్యను వదిలేస్తే మరింత తీవ్రమవుతుంది. అయితే అలాంటి వారు కొన్ని ఆహారాలను నియంత్రిస్తే మంచి ఫలితాలు ఉంటాయని వైద్యులు చెబుతున్నారు. జీర్ణ వ్యవస్థకు ఇబ్బంది కలిగించే ఆహారాలను తగ్గించడం వల్ల కొంత మేలు జరుగుతుందని సూచిస్తున్నారు. మలబద్ధకం ఉన్న వారు తినకూడని ఆహారాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
చలికాలంలో సగటు నీటి వినియోగం తక్కువగా ఉంటుంది. ఇలాంటి సమయంలో శరీరం డీహైడ్రేషన్ గురయ్యే పానియాలను దూరం పెడితే మంచిది. ముఖ్యంగా ఆల్కహాల్, కెఫెన్ వంటి ఆహారాలతో ముప్పు ఉందని వైద్యులు సూచిస్తున్నారు. కాబట్టి వాటి వినియోగాన్ని అదుపులో ఉంచుకోవాలని కోరుతున్నారు.
చలికాలంలో జీర్ణక్రియకు సజావుగా సాగడానికి అధిక ఫైబర్ అవసరం. అయితే ప్రాసెస్ చేసిన బియ్యం, బ్రెడ్ వంటి ఆహారంలో ఫైబర్ తక్కువగా ఉంటుంది. కాబట్టి ప్రాసెస్ చేసిన ఆహారం ధాన్యాలను తక్కువగా తీసుకోవాలి.
సాధారణంగా అరటి పండ్లు జీర్ణ క్రియకు సాయం చేస్తాయి. కానీ పచ్చి అరటి పండ్లు మాత్రం మలబద్దక సమస్యను పెంచుతుంది. పచ్చి అరటి పండ్లల్లో అధికంగా స్టార్చ్ ఉండడం వల్ల జీర్ణం కావడానికి ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి వీలైనంతగా పచ్చి అరటిపండ్లను దూరం పెడితే మంచిది.
పాలు లేదా పాల ఉత్పత్తులను తీసుకున్నప్పుడు వాటిని జీర్ణం చేయడానికి లాక్టేజ్ అనే ఎంజైమ్ అనే అవసరం. అయితే మలబద్ధక సమస్యతో బాధపడేవారికి లాక్టేజ్ ఉత్పత్తి తక్కువ స్థాయిలో ఉంటుంది. కాబట్టి వారు పాల ఉత్పత్తులను తీసుకోకూడదు.
మలబద్ధకంతో బాధపడే వారు వీలైనంతగా ఫాస్ట్ ఫుడ్స్ లేదా జంక్ ఫుడ్స్ కు దూరంగా ఉంటే మేలని వైద్యులు సూచిస్తున్నారు. ఎందుకంటే వీటిల్లో అధికంగా వాడే ఉప్పు/చక్కెర మలబద్దకాన్ని తీవ్రం చేస్తుంది. ఫాస్ట్ ఫుడ్స్ లో శరీరానికి అవసరమయ్యే ఫైబర్ ఎక్కువ ఉండదు. దీంతో ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అయితే ఫాస్ట్ ఫుడ్స్ తీసుకుంటే మధుమేహం లాంటి ఇతర సమస్యలకు కూడా గేట్స్ ఓపెన్ చేసినట్లే అని గుర్తుంచుకోవడం ఉత్తమం.
మరిన్ని హెల్త్ వార్తల కోసం చూడండి.