AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మీకు చూయింగ్ గమ్ నమిలే అలవాటుందా..? వామ్మో.. యమడేంజర్.. ముందే జాగ్రత్త పడండి

ఈ రోజుల్లో చాలా మంది చూయింగ్ గమ్ నమలడం అలవాటు చేసుకుంటున్నారు.. కానీ దానిని నమలడం ఆరోగ్యానికి ఎంత ప్రమాదకరమో మీకు తెలుసా..? అవును..  ఇది ప్లాస్టిక్ లాగానే సింథటిక్ పదార్థాలను కలిగి ఉంటుంది. అయితే, వాటిని తినడానికి సురక్షితమైనవిగా భావిస్తారు.. వాటిని మింగకూడదు. ఇవి నమలడానికి మాత్రమే తయారు చేయబడ్డాయని నిపుణులు చెబుతున్నారు.

మీకు చూయింగ్ గమ్ నమిలే అలవాటుందా..? వామ్మో.. యమడేంజర్.. ముందే జాగ్రత్త పడండి
Chewing Gum
Shaik Madar Saheb
|

Updated on: May 13, 2025 | 4:34 PM

Share

చూయింగ్ గమ్.. ఈ రోజుల్లో గమ్‌ను చాలా మంది నమలడానికి ఇష్టపడతున్నారు. ఇది ఓ రొటీన్ అలవాటు కూడా.. కొంతమందికి ఇది మౌత్ ఫ్రెషనర్.. మరికొందరికి ఇది తీపిని కలిగిస్తుంది.. కానీ మీకు కూడా చూయింగ్ గమ్ నమలడం అలవాటు ఉంటే జాగ్రత్తగా ఉండాలంటున్నారు వైద్య నిపుణులు.. చూయింగ్ గమ్ తినడం ఆరోగ్యానికి హానికరమని పేర్కొంటున్నారు. ఇది ప్లాస్టిక్ లాగానే సింథటిక్ పదార్థాలను కలిగి ఉంటుంది. అయితే, దీనిని చాలా మంది సురక్షితమైనవిగా భావిస్తారు.. కానీ.. దాని సారాన్ని మింగకూడదు. ఇవి నమలడానికి మాత్రమే తయారు చేయబడ్డాయని నిపుణులు చెబుతున్నారు.

వాస్తవానికి చూయింగ్ గమ్ ఒక సాగే, జిగురు పదార్థం.. నమలడానికి రూపొందించబడింది. కానీ మ్రింగడానికి కాదు. ఆధునిక చూయింగ్ గమ్.. గమ్ బేస్, స్వీటెనర్లు, రుచులు.. రంగులతో కూడి ఉంటుంది. ఇది మరింత హానికరం.. వాస్తవానికి మీరు చూయింగ్ గమ్ నమలేటప్పుడు తెలియకుండానే వేల చిన్న ప్లాస్టిక్ ముక్కలను మింగేస్తున్నారా? మరి మనం నిజంగా ప్లాస్టిక్‌ను నమలుతున్నామా? చూయింగ్ గమ్- ప్లాస్టిక్ మధ్య తేడా ఏమిటి.. అని ప్రజలు తరచుగా సందేహాలను వ్యక్తంచేస్తుంటారు..? అయితే.. నిపుణులు చెప్పే సమాధానాలు తెలిస్తే నిజంగానే ఆశ్చర్యపోతారు..

చూయింగ్ గమ్ అంటే ఏమిటి?..

చూయింగ్ గమ్ ప్రధాన ఆధారం గమ్ బేస్. పూర్వ కాలంలో, గమ్ బేస్ చికిల్ (ఒక చెట్టు రెసిన్) వంటి సహజ పదార్థాలతో తయారు చేయబడింది. కానీ ఈ రోజుల్లో చాలా చూయింగ్ గమ్‌ల గమ్ బేస్ ప్లాస్టిక్‌ను పోలి ఉండే కృత్రిమ పాలిమర్‌లతో తయారు చేస్తున్నారు..

గమ్ బేస్‌లో సాధారణంగా ఏముంటుంది?

  • పాలీ వినైల్ అసిటేట్
  • పాలిథిలిన్
  • రబ్బరు లేదా రెసిన్
  • ప్లాస్టిసైజర్లు (మృదుత్వ కారకాలు)

కొత్త అధ్యయనం – పరిశోధన ఏం చెబుతుంది..

ఇవన్నీ సింథటిక్ పదార్థాలు, వీటిని ప్లాస్టిక్ తయారీలో కూడా ఉపయోగిస్తారు. తాజా పరిశోధన, అధ్యయనంలో దిగ్భ్రాంతికరమైన విషయాలు వెల్లడయ్యాయి.

మొదటి వాస్తవం – కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం లాస్ ఏంజిల్స్ అధ్యయనం ప్రకారం, ఒక గ్రాము చూయింగ్ గమ్ నుండి సగటున 100 మైక్రోప్లాస్టిక్ ముక్కలు విడుదలవుతాయి.. అయితే కొన్ని గమ్ లు 600 కంటే ఎక్కువ ముక్కలను విడుదల చేయగలవు.

రెండవ వాస్తవం – ఒక సాధారణ చూయింగ్ గమ్ ముక్క దాదాపు 1.5 గ్రాముల బరువు ఉంటుంది.. అంటే రోజూ గమ్ నమిలే వ్యక్తి ప్రతి సంవత్సరం దాదాపు 30,000 మైక్రోప్లాస్టిక్ కణాలను మింగవచ్చు.

మూడవ వాస్తవం: చూయింగ్ గమ్‌లో ఉపయోగించే పాలిమర్‌లు, గమ్‌కు మంచి రుచిని కలిగిస్తాయి.. ఇవి తరచుగా పెట్రోలియం నుండి తయారైన సింథటిక్ ప్లాస్టిక్‌లు, అయితే కొన్ని గమ్‌లలో చెట్టు రసం నుండి తయారైన సహజ పాలిమర్‌లు కూడా ఉంటాయి. రెండు రకాల గమ్‌లలో మైక్రోప్లాస్టిక్‌లు కనుగొన్నారు.

నాల్గవ వాస్తవం: ఈ మైక్రోప్లాస్టిక్ కణాలు చాలా చిన్నవిగా ఉంటాయి, అవి లాలాజలంతో పాటు నోటిలోకి ప్రవేశిస్తాయి.. కొంతమంది నమిలి మింగుతారు.. ఈ కణాలలో కొన్ని నానోప్లాస్టిక్‌ల రూపంలో కూడా ఉంటాయి.. ఇవి ఇంకా చిన్నవిగా ఉండి శరీర కణాలను చేరుకోగలవు.. ఇది క్రమంగా ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది.

మనం ప్లాస్టిక్ నమలుతున్నామా?..

సరళంగా చెప్పాలంటే.. అవును, నేటి చూయింగ్ గమ్‌లో ప్లాస్టిక్ వంటి సింథటిక్ పదార్థాలు ఉంటాయి. అయితే, వాటిని తినడానికి సురక్షితమైనవిగా భావిస్తారు.. వాటిని మింగకూడదు. ఇవి నమలడానికి మాత్రమే తయారు చేయబడ్డాయి.

కాబట్టి తదుపరి ప్రశ్న ఏంటంటే.. చూయింగ్ గమ్ తినడం సురక్షితమేనా? చూయింగ్ గమ్ నమలడానికి మాత్రమే సురక్షితం.. కానీ దానిని మింగకూడదు. అనుకోకుండా మింగినప్పటికీ, అది సాధారణంగా జీర్ణం కాకుండానే శరీరం నుండి బయటకు వెళ్లిపోతుంది. ఎక్కువగా మింగడం హానికరం కావచ్చు.

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఎర్రకోట వద్ద బాంబు పేలుడు ఘటనలో 40కిలోల పేలుడు పదార్థాన్ని వాడారు
ఎర్రకోట వద్ద బాంబు పేలుడు ఘటనలో 40కిలోల పేలుడు పదార్థాన్ని వాడారు
ఈ-సిగరెట్ ఇంత ప్రమాదకరమా? మహిళ తన కంటి చూపు కోల్పోయింది!
ఈ-సిగరెట్ ఇంత ప్రమాదకరమా? మహిళ తన కంటి చూపు కోల్పోయింది!
ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులకు షాక్.. డబ్బులు కట్
ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులకు షాక్.. డబ్బులు కట్
ఈ మూడు రోజులు జాగ్రత్త బాస్‌..! చెప్పేది అర్ధం చేసుకోండి
ఈ మూడు రోజులు జాగ్రత్త బాస్‌..! చెప్పేది అర్ధం చేసుకోండి
థైరాయిడ్‌ రోగులకు బిగ్ అలర్ట్.. శీతాకాలంలో వీటిని అస్సలు తినొద్దు
థైరాయిడ్‌ రోగులకు బిగ్ అలర్ట్.. శీతాకాలంలో వీటిని అస్సలు తినొద్దు
వైజాగ్ వెళ్లే టూరిస్ట్‌లకు బిగ్‌అలర్ట్.. ఇకపై మ్యూజియాలన్నీ
వైజాగ్ వెళ్లే టూరిస్ట్‌లకు బిగ్‌అలర్ట్.. ఇకపై మ్యూజియాలన్నీ
ఇదేదో చెక్కబెరడు అనుకుంటే పొరపాటే.. గుండె జబ్బులకు గొడ్డలిపెట్టు!
ఇదేదో చెక్కబెరడు అనుకుంటే పొరపాటే.. గుండె జబ్బులకు గొడ్డలిపెట్టు!
సంక్రాంతికి అరడజను సినిమాలు.. అందరికీ న్యాయం జరుగుతుందా
సంక్రాంతికి అరడజను సినిమాలు.. అందరికీ న్యాయం జరుగుతుందా
సౌత్ మార్కెట్ కోసం బాలీవుడ్ హీరోల స్ట్రాటజీ
సౌత్ మార్కెట్ కోసం బాలీవుడ్ హీరోల స్ట్రాటజీ
వాట్సప్‌లో మరో అద్భుత ఫీచర్.. కొత్త ఏడాది వేళ లాంచ్
వాట్సప్‌లో మరో అద్భుత ఫీచర్.. కొత్త ఏడాది వేళ లాంచ్