Thyroid Health: థైరాయిడ్ ఉన్నవారు ఉదయం వేడి నీరు తాగొచ్చా..? నిపుణులు ఏం చెబుతున్నారో తెలుసా..?
ప్రస్తుత రోజుల్లో థైరాయిడ్ సమస్య చాలా మందిని వేధిస్తోంది. పురుషుల కంటే ఎక్కువగా మహిళలే ఈ సమస్యతో బాధపడుతున్నారు. శరీరంలో మెటాబాలిజం, బరువు నియంత్రణ, శక్తి ఉత్పత్తి వంటి ఎన్నో ముఖ్యమైన పనుల్లో థైరాయిడ్ గ్రంథి కీలక పాత్ర పోషిస్తుంది. ఒకవేళ ఈ గ్రంథి సరిగా పని చేయకపోతే అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి.

ఇలాంటి పరిస్థితుల్లో కొంతమంది నిపుణులు థైరాయిడ్ ఉన్నవారు వేడి నీరు తాగడం వల్ల కొంతవరకు ఉపశమనం పొందవచ్చని సూచిస్తున్నారు. ముఖ్యంగా బరువు పెరగడం నివారించడంలో ఇది సహాయపడుతుందనే అభిప్రాయం ఉంది. అయితే ఈ విషయాన్ని పూర్తిగా నిర్ధారించే శాస్త్రీయ ఆధారాలు ఇంకా పూర్తిగా లేవని వారు చెబుతున్నారు. అయినప్పటికీ వేడి నీరు శరీరంపై అనేక రకాల లాభాలను కలిగించగలదని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
థైరాయిడ్ సమస్యతో బాధపడేవారిలో సాధారణంగా జీర్ణ సంబంధిత సమస్యలు ఎక్కువగా ఉంటాయి. ఆకలి లేకపోవడం, ఉబ్బసం, నొప్పులు, గ్యాస్ లాంటివి తరచూ వస్తుంటాయి. అటువంటి వారు ప్రతిరోజూ ఉదయం ఖాళీ కడుపుతో ఒక గ్లాస్ వేడి నీరు తాగడం వల్ల జీర్ణతంత్రానికి ఉపశమనం కలగవచ్చని వైద్యులు సూచిస్తున్నారు. ఇది అసిడిటీ, గ్యాస్ వంటి సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుంది.
అంతేకాకుండా వేడి నీరు శరీరంలోని హానికరమైన పదార్థాలను బయటకు పంపించి డిటాక్స్ ప్రభావాన్ని కలిగిస్తుంది. ఇది శరీరాన్ని శుభ్రంగా ఉంచడమే కాకుండా మెటాబాలిజం వేగంగా పని చేసేలా చేసి శక్తిని పెంచుతుంది. థైరాయిడ్ సమస్య ఉన్నవారు అధికంగా బరువు పెరగవచ్చు కాబట్టి వేడి నీరు తాగడం వలన ఈ సమస్యను సమర్థవంతంగా నియంత్రించుకోవచ్చు.
వేడి నీటిలో నిమ్మరసం తేనె కలిపి తాగడం వల్ల అదనపు లాభాలు ఉంటాయి. నిమ్మకాయలో ఉండే విటమిన్ C శరీరాన్ని శక్తివంతంగా ఉంచుతుండగా.. తేనె సహజ శక్తినిచ్చే పదార్థంగా పని చేస్తుంది. ఇది శరీరంలో హార్మోన్ సమతుల్యతను క్రమబద్ధీకరించడంలో తోడ్పడుతుంది.
థైరాయిడ్ గ్రంథి మామూలుగా రక్త ప్రసరణపై నేరుగా ప్రభావం చూపదు. అయితే వేడి నీరు తాగడం వల్ల రక్త ప్రవాహం మెరుగుపడుతుంది. శరీరంలోని అవయవాలకు అవసరమైన ఆక్సిజన్ సజావుగా వెళ్లేలా చేస్తుంది. ఇది శరీరాన్ని చురుకుగా ఉంచుతుంది.
థైరాయిడ్ సమస్య ఉన్నవారు ప్రతి రోజు ఉదయం ఖాళీ కడుపుతో ఒక గ్లాస్ వేడి నీటిని తాగితే.. జీర్ణ సంబంధిత సమస్యలు తగ్గుతాయి, రక్త ప్రసరణ మెరుగుపడుతుంది, బరువు నియంత్రణకు కూడా సహాయపడుతుంది. వేడి నీటితో పాటు నిమ్మరసం, తేనె వంటి సహజ పదార్థాలను కలిపి తీసుకుంటే మరింత మంచిది. అయితే దీన్ని ప్రారంభించే ముందు వైద్యుల సలహా తప్పనిసరిగా తీసుకోవాలి.
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)
