Beer: బీర్ తాగితే కిడ్నీలో రాళ్లు పోతాయా ? అసలు నిజం ఇదే

| Edited By: Ravi Kiran

Aug 14, 2023 | 6:32 AM

మద్యపానం సేవించడం ఆరోగ్యానికి హానికరం. ఈ కొటేషన్ అందరూ వినే ఉంటారు. ఆకరికి మద్యం బాటిళ్లపై కూడా ఆ హెచ్చరిక రాసి ఉంటుంది. అయినప్పటికీ ప్రపంచవ్యాప్తంగా ఆల్కహాల్‌కు ఉండే డిమాండ్ అంతా ఇంతా కాదు. యువకుల నుంచి వృద్ధుల వరకు చాలామంది మద్యపానాన్ని సేవిస్తుంటారు. ఇంకొందరైతే ఒక్కరోజూ కూడా మందు లేనిదే ఉండేలేరు. మరోవిషయం ఏంటంటే ఈ రోజుల్లో ఎక్కువగా బీర్లు తాగడం ఓ ఫ్యాషన్‌ల మారిపోయింది. ఏ చిన్న పార్టీ అయినా, నలుగరు స్నేహితులు కలిసిన బీర్లు తాగడం కామన్ అయిపోయింది.

Beer: బీర్ తాగితే కిడ్నీలో రాళ్లు పోతాయా ? అసలు నిజం ఇదే
Beer
Follow us on

మద్యపానం సేవించడం ఆరోగ్యానికి హానికరం. ఈ కొటేషన్ అందరూ వినే ఉంటారు. ఆకరికి మద్యం బాటిళ్లపై కూడా ఆ హెచ్చరిక రాసి ఉంటుంది. అయినప్పటికీ ప్రపంచవ్యాప్తంగా ఆల్కహాల్‌కు ఉండే డిమాండ్ అంతా ఇంతా కాదు. యువకుల నుంచి వృద్ధుల వరకు చాలామంది మద్యపానాన్ని సేవిస్తుంటారు. ఇంకొందరైతే ఒక్కరోజూ కూడా మందు లేనిదే ఉండేలేరు. మరోవిషయం ఏంటంటే ఈ రోజుల్లో ఎక్కువగా బీర్లు తాగడం ఓ ఫ్యాషన్‌ల మారిపోయింది. ఏ చిన్న పార్టీ అయినా, నలుగరు స్నేహితులు కలిసిన బీర్లు తాగడం కామన్ అయిపోయింది. అయితే బీర్ తాగడం వల్ల కిడ్నీలోని రాళ్లు తొలగిపోతాయని చాలామంది భావిస్తుంటారు. కానీ దీనిపై నిపుణులు కీలక వ్యాఖ్యలు చేశారు. బీర్ తాగడం వల్ల రాళ్లు తొలగిపోతాయనేది కేవలం అపోహే అని స్పష్టం చేస్తున్నారు. వీటిని తాగడం వల్ల కిడ్నీలో ఉన్నటువంటి రాళ్లు బయటకు వస్తాయనేందుకు ఎలాంటి ఆధారాలు లేవని అమెరికన్ అడిక్షన్ సెంటర్ తెలిపింది.

అలాగే పదే పదే బీరు తాగడం వల్ల మూత్రపిండాలు విఫలమవుతాయని.. రక్తపోటు, క్యాన్సర్‌‌తో సహా రోగ నిరోధక వ్యవస్థ బలహీనపడుతుందని చెబుతున్నారు. బీరు తాగినప్పుడు మూత్ర విసర్జన జరుగుతుందని.. అలాంటి సమయంలో కిడ్నీలో ఉండే రాళ్లు బయటకు సులువుగా వెళ్లిపోతాయని చాలామంది అనుకుంటారు. వాస్తవానికి ఆల్కహాల్ అయినా, బీర్ అయినా కీడ్నీలను బయటకు పంపడంలో ఏదీ కూడా సహాయపడదని ఏసీపీ నివేదిక చెబుతోంది. అయితే మూత్రవిసర్జనను పెంచేందుకు బీర్ పనిచేస్తుందని.. దీనివల్ల చిన్న రాళ్లను తీయడం సాధ్యమవుతుందని వైద్యులు చెబుతున్నారు. కానీ 5 మిల్లీమీటర్ల కంటే పెద్ద రాళ్లను బయటకు తీయలేదని అంటున్నారు. వాటి పెరుగుదల మార్గం సుమారు 3 మిల్లీమీటర్ల వరకు ఉంటుందని చెబుతున్నారు. మూత్రపిండాల్లో నొప్పి ఉన్నప్పుడు బీర్ తాగితే ఆరోగ్య పరిస్థితి మరింత దిగజారిపోతుందని తెలిపారు.

బీరు తాగడం వల్ల మూత్రాన్ని ఎక్కవగా ఉత్పత్తి చేస్తుంది. అధికంగా తీసుకోవడం వల్ల డీ హైడ్రైషన్‌కు కూడా దారితీస్తుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. కిడ్నీ రక్తాన్ని శుభ్రం చేస్తుంది. దీనిద్వారా టాక్సిన్స్, అనవసరమైన పోషకాలను మూత్రం నుంచి తొలగిస్తుంది. అయితే రక్తంలో విషపూరితమైన మూలకాల పరిమాణం పెరిగితే కిడ్నీ వాటిని సరిగ్గా ఫిల్టర్ చేయలేదు. వీటివల్ల సమస్యలు ఏర్పడుతాయి. అలాగే ఘనరూపంలో వ్యర్థాలు పేరుకుపోతుంటాయి. పొత్తి కడుపులో ఒకవైపు లేకపోతే వెనకభాగంలో నొప్పి, మూత్ర విసర్జన చేసే సమయంలో నొప్పి లేదా మంటగా అనిపించిన పరిస్థితుల్లో వెంటనే వైద్యులను సంప్రదించాలి. ఇలాంటి విషయాల పట్ల అస్సలు అజాగ్రత్తలు పాటించకూడదు.

ఇవి కూడా చదవండి

మరిన్ని హెల్త్ న్యూస్ కోసం