పంజా విసురుతోన్న మరో మహమ్మారి.. బ్రెయిన్ తినే అమిబాతో తొలి మరణం. ఇంతకీ ఈ వ్యాధి ఏంటంటే..

|

Dec 27, 2022 | 10:41 AM

మాయదారి కరోనా రోగం మళ్లీ ప్రపంచాన్ని భయపెడుతోంది. ఇప్పటికే చాలా దేశాల్లో కరోనా పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నాయి. ఇదిలా ఉంటే ఇప్పుడు మరో రోగం ప్రజలను భయాందోళనకు గురి చేస్తోంది. మనిషి మెదడుపై నేరుగా ప్రభావం చూపే నెగ్లెరియా ఫోవ్లేరి అనే వ్యాధి ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేసింది...

పంజా విసురుతోన్న మరో మహమ్మారి.. బ్రెయిన్ తినే అమిబాతో తొలి మరణం. ఇంతకీ ఈ వ్యాధి ఏంటంటే..
Brain Eating Amoeba
Follow us on

మాయదారి కరోనా రోగం మళ్లీ ప్రపంచాన్ని భయపెడుతోంది. ఇప్పటికే చాలా దేశాల్లో కరోనా పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నాయి. ఇదిలా ఉంటే ఇప్పుడు మరో రోగం ప్రజలను భయాందోళనకు గురి చేస్తోంది. మనిషి మెదడుపై నేరుగా ప్రభావం చూపే నెగ్లెరియా ఫోవ్లేరి అనే వ్యాధి ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేసింది. అమీబా జాతికి చెందిన ఈ సూక్ష్మజీవి మనిషి మెదడును తినేస్తుంది. ప్రపంచంలోని పలు దేశాల్లో ఇప్పటికే ఈ కేసులు నమోదుకాగా తాజాగా తొలి మరణం సంభవించింది. దక్షిణ కొరియాలో ఈ వ్యాధితో బాధపడుతోన్న ఓ వ్యక్తి మరణించాడు. కొరియా డిసీజ్‌ కంట్రోల్‌ అండ్‌ ప్రివెన్షన్‌ ఏజెన్సీ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది. థాయిలాండ్‌ నుంచి తిరిగి వచ్చిన 50 ఏళ్ల కొరియన్‌ వ్యక్తి ఈ వ్యాధితో బాధపడుతున్నట్లు గుర్తించారు.

దక్షిణ కొరియాలో నమోదైన తొలి నెగ్లెరియా కేసు ఇదే. నాలుగు రోజుల పాటు థాయ్‌లాండ్‌లో ఉన్న తర్వాత ఆ వ్యక్తి డిసెంబర్‌ 10వ తేదీన కొరియాకు వచ్చాడని, ఆ మరుసటి రోజు ఆసుపత్రిలో చేరాడని అధికారులు చెబుతున్నారు. ఇదిలా ఉంటే ఈ వ్యాధి తొలిసారి 1937లో అమెరికాలో వెలుగులోకి వచ్చింది. సాధరణంగా ఈ అమీబా మంచినీటి సరస్సులు, నదులు, కాలువల్లో నివసిస్తుంటాయి. ఆ నీటిని తాగిన సమయంలో అమీబా శరీరంలోకి ప్రవేశించి మెదుడను చేరుకుంటుంది. మెదడును లక్ష్యంగా చేసుకొని ఈ అమీబా అటాక్‌ చేస్తుంది.

వ్యాధి లక్షణాలు..

ఈ వ్యాధి బారిన పడిన వారిలో తొలుత తలనొప్పి, వికారం, వాంతులు వంటి ప్రారంభ లక్షణాలు కనిపిస్తాయి. తర్వాత క్రమే జ్వరం, వాంతులు, మెడ గట్టిగా మారడం వంటి సమస్యలు ఎదురవుతుంటాయి. శుభ్రమన నీటిని తాగాలని కొరియా డిసీజ్‌ కంట్రోల్‌ అండ్‌ ప్రివెన్షన్‌ ఏజెన్సీ సూచిస్తోంది. ఇదిలా ఉంటే ఈ మహమ్మారికి సంబంధించిన కేసులు భారత్‌లోనూ నమోదయ్యాయి. అమెరికా, భారత్‌, థాయ్‌లాండ్‌తో సహా ప్రపంచవ్యాప్తంగా 2018 నాటికి మొత్తం 381 కేసులు వెలుగులోకి వచ్చాయి. అమెరికాలో అత్యధికంగా 1962 నుంచి 2021 వరకు 154 కేసులు నమోదయ్యాయి. అయితే ఈ వ్యాధి బారిన పడిన వారిలో మరణాల రేటు 97 శాతంగా ఉండడం భయాందోళన కలిగించే అంశంగా చెప్పొచ్చు.

ఇవి కూడా చదవండి

మరిన్ని హెల్త్ ఆర్టికల్స్ కోసం క్లిక్ చేయండి..