Blood Pressure: వీటితో హై బీపీ సమస్యకి చెక్ పెట్టండి.. ఇంకా మరెన్నో ఆరోగ్య ప్రయోజనాలు..

బీపీని అదుపులో ఉంచేందుకు కొన్ని పండ్లు, పలు ఆహార పదార్థాలు చాలా మేలు చేస్తాయని, దీంతోపాటు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని సూచిస్తున్నారు.

Blood Pressure: వీటితో హై బీపీ సమస్యకి చెక్ పెట్టండి.. ఇంకా మరెన్నో ఆరోగ్య ప్రయోజనాలు..
Bp
Follow us
Shaik Madar Saheb

|

Updated on: May 19, 2022 | 6:24 PM

Blood Pressure Control Tips: ఆధునిక కాలంలో చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా చాలామంది బ్లడ్ ప్రెజర్ (బీపీ) సమస్యతో బాధపడుతున్నారు. మారుతున్న పరిస్థితులు, జీవనశైలి, పని ఒత్తిడి, కుటుంబ బాధ్యతలు, ఆహారపు అలవాట్లు, చెడు అలవాట్లు (మద్యపానం – ధూమపానం) తదితర కారణాలతో చాలామంది రక్తపోటు – అధిక రక్తపోటు లాంటి సమస్యను ఎదుర్కొంటున్నారని నిపుణులు పేర్కొంటున్నారు. సాధారణంగా గతంలో 50 ఏళ్లు దాటిన వారికే అధిక రక్తపోటు సమస్య తలెత్తేది. కానీ.. ప్రస్తుతం ఈ ధోరణి 25 నుంచి 30 ఏళ్ల యువతలో కూడా కనిపిస్తోంది. అధిక రక్తపోటు ఉన్నట్లయితే గుండెపోటు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉన్నట్లు వైద్యులు పేర్కొంటున్నారు. బీపీని అదుపులో ఉంచేందుకు కొన్ని పండ్లు, పలు ఆహార పదార్థాలు చాలా మేలు చేస్తాయని, దీంతోపాటు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని సూచిస్తున్నారు. కావున బీపీని అదుపులో ఉంచే పండ్లు ఏవో ఇప్పుడు తెలుసుకుందాం..

బీపీని అదుపులో ఉంచే  పదార్థాలు.. 

కివీ పండు: బీపీని అదుపులో ఉంచుకోవాలంటే కివీని తప్పనిసరిగా తినాలి. దీన్ని తినడం లేదా జ్యూస్ తాగడం వల్ల బీపీ అదుపులో ఉంటుంది. ఇది కాకుండా మీరు అనేక వ్యాధుల నుంచి కూడా దూరంగా ఉంటారు. వారానికి ఒకసారి ఈ పండును తినడానికి ప్రయత్నించండి. వాస్తవానికి కివీలో మెగ్నీషియం, పొటాషియం ఉంటాయి. దీని ద్వారా BP ని నియంత్రించవచ్చు.

అరటిపండు: అరటి పండు తింటే కూడా బీపీ అదుపులో ఉంటుంది. దీనిని ఖచ్చితంగా మీ ఆహారంలో చేర్చుకోవాలి. వాస్తవానికి ఈ పండులో పొటాషియం, ఒమేగా 3, కొవ్వు ఆమ్లాలు, ఫైబర్ మొదలైన పోషకాలు ఉంటాయి. ఇలాంటి పరిస్థితుల్లో దీన్ని తీసుకోవడం ఆరోగ్యానికి కూడా మంచిది.

పెరుగు: BP సమస్యతో బాధపడుతున్నవారు పెరుగు తింటే చాలా మంచిది. వాస్తవానికి పెరుగులో రక్తపోటును నియంత్రించే లక్షణాలు ఉన్నాయి. ప్రోటీన్, కాల్షియం, రిబోఫ్లావిన్, విటమిన్ బి6, విటమిన్ బి12 పోషకాలు పుష్కలంగా ఉన్నాయి.

చిలగడదుంప: చిలగడదుంప వల్ల కూడా బీపీ అదుపులో ఉంటుంది. బీపీని నియంత్రించడంలో ఇది బాగా ఉపయోగపడుతుంది. దీనిలో బీటా కెరోటిన్, కాల్షియం, ఫైబర్ ఉన్నాయి. ఇది ఒత్తిడిని తగ్గించి రక్తపోటును నియంత్రణలో ఉంచుతుంది.

స్ట్రాబెర్రీ: స్ట్రాబెర్రీ కూడా బీపీని అదుపులో ఉంచుతుంది. ఈ పండులో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. అంతే కాకుండా ఇందులో ఉండే పొటాషియం అధిక రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది.

కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
ఖాళీ కడుపుతో ఉసిరికాయ రసం తాగితే ఎన్ని లాభాలో తెలుసా..?
ఖాళీ కడుపుతో ఉసిరికాయ రసం తాగితే ఎన్ని లాభాలో తెలుసా..?
జియో నుంచి 98 రోజుల వ్యాలిడిటీ ఉండే ప్లాన్‌ గురించి మీకు తెలుసా?
జియో నుంచి 98 రోజుల వ్యాలిడిటీ ఉండే ప్లాన్‌ గురించి మీకు తెలుసా?
స్వీట్‌ పొటాటో తింటే.. మీ గుండె ఆరోగ్యానికి ఢోకా ఉండదు.. మరెన్నో
స్వీట్‌ పొటాటో తింటే.. మీ గుండె ఆరోగ్యానికి ఢోకా ఉండదు.. మరెన్నో
ప్లానింగ్‌తో పిచ్చెక్కిస్తున్న డాకూ మహరాజ్
ప్లానింగ్‌తో పిచ్చెక్కిస్తున్న డాకూ మహరాజ్
ఎరక్కపోయి ఇరుక్కున్నాడా..! ఈ కేసు నుంచి బన్నీ బయటపడే దారుందా..?
ఎరక్కపోయి ఇరుక్కున్నాడా..! ఈ కేసు నుంచి బన్నీ బయటపడే దారుందా..?
మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్..
మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్..