AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రోజూ ఈ మ్యాజిక్ జ్యూస్ తాగండి.. రోజంతా ఉల్లాసంగా, ఆరోగ్యంగా ఉంటారు..!

శరీరాన్ని వైరస్‌ ల నుంచి కాపాడుకోవడానికి రోగనిరోధక శక్తిని పెంచుకోవడమే కీలకం. ఇలాంటి సమయంలో శక్తిని తిరిగి తెచ్చే, మలినాలను తొలగించే, రోగనిరోధక శక్తిని పెంచే రకాల రసాలను మనం ఆహారంలో భాగంగా తీసుకోవాలి. ప్రతిరోజు యాపిల్, క్యారెట్, బీట్‌ రూట్ వంటివి విడివిడిగా తినడం కన్నా.. వీటన్నింటినీ కలిపి రసంగా తీసుకోవడం చాలా మంచిది. ఈ మూడింటినీ కలిపి తీసుకున్నప్పుడు శరీరంలోని విషపదార్థాలను త్వరగా బయటకు పంపించడంలో అది చక్కగా పనిచేస్తుంది. అలాగే ఉదయాన్నే ఇది తీసుకుంటే శరీరం ఉల్లాసంగా మారుతుంది.

రోజూ ఈ మ్యాజిక్ జ్యూస్ తాగండి.. రోజంతా ఉల్లాసంగా, ఆరోగ్యంగా ఉంటారు..!
Apple Beet Carrot Juice
Prashanthi V
|

Updated on: Jun 29, 2025 | 1:02 PM

Share

ఈ జ్యూస్ ముఖ్యంగా ఊపిరితిత్తులు, మూత్రపిండాలు వంటి లోపలి అవయవాల్లో పేరుకుపోయే హానికర పదార్థాలను తొలగించడంలో బాగా పనిచేస్తుంది. శరీరంలోని గందరగోళాలను తగ్గించి లోపలి శుభ్రతను పెంచుతుంది. దీని వల్ల చర్మం మెరిసేలా మారుతుంది. అంతేకాదు రోగనిరోధక వ్యవస్థ బలపడుతుంది.

బీట్‌ రూట్‌ లో ఉండే పొటాషియం, విటమిన్ C, ఐరన్, మాంగనీస్, యాంటీఆక్సిడెంట్లు వంటి పోషకాలు శరీరానికి పుష్కలంగా అవసరం. బీట్ రసం రక్తాన్ని శుభ్రం చేస్తుంది. కొవ్వు కణాలను కరిగించేందుకు సహాయపడుతుంది. ముఖ్యంగా ఊపిరితిత్తుల ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది.

యాపిల్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే పండు. దీనిలో విటమిన్లు A, B1, B2, B6 తో పాటు జింక్, పొటాషియం లాంటి ఖనిజాలు కూడా ఉంటాయి. ఇవి శరీర శక్తిని పెంచుతాయి. వైరస్‌ లను ఎదుర్కొనే శక్తిని ఇవ్వగలవు.

క్యారెట్‌ లో విటమిన్ A తో పాటు B1, B2, B3 ఉంటాయి. అలాగే ఇందులో కాల్షియం, పొటాషియం, మాగ్నీషియం, సెలీనియం వంటి శరీరానికి కావాల్సిన ఖనిజాలు ఉంటాయి. పీచు పదార్థాలు ఎక్కువగా ఉండే ఈ కూరగాయ జీర్ణవ్యవస్థకు ఎంతో మేలు చేస్తుంది.

ఈ మూడు పదార్థాలనూ ఒక మిక్సీలో వేసి బాగా రుబ్బాలి. ఆ మిశ్రమంలో ఐదు పుదీనా ఆకులు, కొద్దిగా అల్లం ముక్కలు, తగినంత తాగునీరు కలిపి మెత్తగా రసంగా తయారు చేసుకుని వడకట్టి ఉదయం ఖాళీ కడుపుతో తాగితే మరువలేని మార్పులు కనిపిస్తాయి.

ఈ రసాన్ని ప్రతిరోజు తీసుకోవడం ద్వారా శరీరం శక్తివంతంగా మారుతుంది. చర్మం మెరుస్తుంది, అనారోగ్యాలు దరిచేరవు. ఇది ఒక రకంగా ఇంట్లో తయారయ్యే సహజ టానిక్ లాంటిది. కాబట్టి ఆరోగ్యాన్ని బలోపేతం చేయాలనుకుంటే.. ఈ మూడింటి మిశ్రమాన్ని తప్పకుండా ఆహారంలో భాగం చేసుకోండి.

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)