AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gut Health: గట్ హెల్త్ బాగుండాలంటే.. ఇవి తినాల్సిందే..! పేగులకు మస్తు మంచిది..!

మన శరీరంలో దాదాపు 70 శాతం రోగనిరోధక శక్తికి పేగులే కేంద్రంగా ఉంటాయి. అందుకే పేగులు ఆరోగ్యంగా ఉండటం అంటే మన శరీరం మొత్తానికి ఆరోగ్యంగా ఉండటానికి బలమైన ఆధారం. పేగుల ఆరోగ్యం బాగుంటే మన శరీరానికి వ్యాధులను తట్టుకునే శక్తి పెరిగి ఇన్ఫెక్షన్ల నుంచి రక్షణ లభిస్తుంది.

Gut Health: గట్ హెల్త్ బాగుండాలంటే.. ఇవి తినాల్సిందే..! పేగులకు మస్తు మంచిది..!
Gut Health
Prashanthi V
|

Updated on: Jun 10, 2025 | 10:58 PM

Share

మన శరీరంలోని జీర్ణవ్యవస్థలో రకరకాల సూక్ష్మజీవులు ఉంటాయి. వీటిలో బాక్టీరియా, ఫంగస్, వైరస్ లాంటి జీవులు ఉంటాయి. ఈ సూక్ష్మజీవుల సముదాయాన్ని గట్ మైక్రోబయోమ్ అని పిలుస్తారు. వీటి సమతుల్యత పేగు ఆరోగ్యానికి చాలా అవసరం. ఇది బలహీనపడితే జీర్ణ సంబంధిత సమస్యలతో పాటు, మానసిక సమస్యలకూ దారితీస్తుంది.

ఆరోగ్యంగా ఉన్న పేగు ప్రతిదాన్నీ సమర్థంగా జీర్ణిస్తుంది. శక్తివంతమైన పోషకాలను శరీరానికి అందించి మలాన్ని బయటకు పంపే పనిలో కీలకంగా పనిచేస్తుంది. అలాగే మన శరీరంలో హార్మోన్ల సమతుల్యతకు అవసరమైన సెరోటొనిన్ అనే నరాల రసాయనం కూడా పేగులే ఉత్పత్తి చేస్తాయి. అందుకే పేగులను రెండవ మెదడు అని కూడా అంటారు. పేగుల ఆరోగ్యం బాగాలేకపోతే గుండె సంబంధిత సమస్యలు, మధుమేహం వంటి దీర్ఘకాలిక వ్యాధులు రావడానికి అవకాశం ఉంటుంది.

పేగు ఆరోగ్యాన్ని కాపాడేందుకు తినాల్సిన ముఖ్యమైన ఆహారాల గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

ముందురోజు వండిన అన్నాన్ని నీటిలో నానబెట్టి రాత్రంతా ఉంచి మరునాడు తినడం. ఇలా చేయడం వల్ల ఆ అన్నంలో సహజంగా ప్రోబయోటిక్స్ ఏర్పడతాయి. ఈ ఆహారం పేగులోని మంచి బాక్టీరియాను పెంపొందించడానికి సహాయపడుతుంది. దీన్ని తరచుగా తీసుకుంటే పేగు వ్యవస్థ బలపడుతుంది.

మజ్జిగలో దాగిన ఆరోగ్య రహస్యాలు చాలా ఉంటాయి. పెరుగు నుంచి వెన్న తీసేసిన తర్వాత మిగిలేది మజ్జిగ. ఇది జీర్ణవ్యవస్థకు ఎంతో మేలు చేస్తుంది. ఇందులో ఉండే లాక్టోబాసిలస్ అనే బాక్టీరియా మన పేగులకు ఆరోగ్యాన్ని అందిస్తుంది. ఇది శరీర వేడిని తగ్గిస్తుంది, శరీరాన్ని చల్లబరుస్తుంది.

ఆరోరూట్ కంద.. ఇది పసుపు రంగులో ఉండే ఒక రకమైన కందమూలం. దీని ముద్దను కంజీలా తయారు చేసి తాగడం ద్వారా జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది. ఇది తేలికగా జీర్ణమయ్యే పదార్థం కావడంతో పేగులు బలపడటానికి సహాయపడుతుంది. ఇది శరీరానికి తేలికగా శక్తిని అందిస్తుంది.

ఈ మూడు ఆహారాలను మన రోజువారీ జీవితంలో భాగం చేసుకుంటే పేగులలో ఉన్న చెడు బాక్టీరియా తగ్గి మంచి సూక్ష్మజీవులు పెరిగే అవకాశం ఉంటుంది. దీంతో పేగులు పూర్తిగా శుభ్రం అవుతాయి. జీర్ణ సంబంధిత సమస్యలు తగ్గుతాయి. దీర్ఘకాలికంగా చూస్తే ఇది శరీర ఆరోగ్యాన్ని మొత్తం మెరుగుపరిచే ప్రక్రియ అవుతుంది. ఈ చిన్న చిన్న మార్పులతో మన శరీరాన్ని, పేగులను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు.

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)