Blood Donations: రెగ్యూలర్‌గా రక్తదానం చేస్తే మంచిదే.. ఈ విషయాలు తెలిస్తే మీరూ నిజమే అంటారు..!
Blood Donations: క్రమం తప్పకుండా రక్తదానం లేదా ప్లాస్మా దానం చేయడం వల్ల రక్తంలో ఉండే ప్రమాదకరమైన రసాయనాలు తగ్గిపోతాయని
Blood Donations: క్రమం తప్పకుండా రక్తదానం లేదా ప్లాస్మా దానం చేయడం వల్ల రక్తంలో ఉండే ప్రమాదకరమైన రసాయనాలు తగ్గిపోతాయని ఒక అధ్యయనంలో తేలింది. ఆస్ట్రేలియన్ క్లినికల్ ట్రయల్ ద్వారా రక్తంలో ఉండే అత్యంత విషపూరిత రసాయనాలు PFAS (Perfluoroalkyl and Polyfluoroalkyl Substances) 30 శాతం తగ్గుతాయని తేలింది. పెర్ఫ్లోరోఅల్కైల్, పాలీఫ్లోరోఅల్కైల్ పదార్థాలు (PFAS) అనేవి ఒక రసాయనాల సమూహం. ఇంట్లో వాడే తివాచీల నుంచి నాన్-స్టిక్ వంటసామాను వరకు అన్ని వస్తువుల తయారీలో ఈ రసాయనాలని వినియోగిస్తారు. ఆస్ట్రేలియన్ ట్రయల్‌లో 285 మంది అగ్నిమాపక సిబ్బందిపై ఒక పరిశోధన నిర్వహించారు.
ఇందులో ఆరువారాలకి ఒకసారి ప్లాస్మాదానం చేసేవారు, ప్రతి 12 వారాలకు ఒక సంవత్సరం పాటు రక్తదానం చేసేవారు, ఇంకొక సమూహం ఎటువంటి రక్తదానం చేయని వారిగా విభజించి వారిని కొన్నిరోజులు అబ్జర్వ్ చేశారు. తర్వాత ఈ అధ్యయనంలో తేలింది ఏంటంటే ప్లాస్మా, రక్తదానం చేసినవారిలో PFAS రసాయనాలు 30 శాతం తగ్గినట్లు తేలింది. ప్లాస్మా దానం చేసినవారిలో ఎక్కువగా తగ్గినట్లు నిర్వాహకులు తెలిపారు. ఇక ఎటువంటి రక్తందానం చేయనివారిలో మార్పులు ఏమి లేవని నిర్ధారించారు. ఈ క్లినికల్ వల్ల తరుచుగా రక్తదానం చేయడం వల్ల రక్తంలో ఉండే రసాయన పదార్థాలు తగ్గుతాయని పరిశోధకులు తేల్చారు. వాస్తవానికి అగ్నిమాపక సిబ్బంది తరచుగా వారి ఆరోగ్యం కంటే ఇతరుల కోసం పనిచేస్తారు. కాబట్టి ఈ పరిశోధన వారిపై నిర్వహించారు. రక్తదానం చేయడం వల్ల ఆరోగ్యానికి ఎటువంటి హాని ఉండదు. అంతేకాకుండా రక్తంలో ఉండే రసాయనాలని కూడా తొలగించుకోవచ్చు. అందుకే ప్రతిఒక్కరు తరచుగా రక్తదానం చేయడం మంచిదని నిపుణులు సూచించారు.
గమనిక :- అధ్యయనాలు.. ఆరోగ్య నిపుణుల సూచనలు.. ఇతర ఆరోగ్య సంబంధిత నివేదికల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలపట్ల నిర్ణయాలను తీసుకునే ముందు వైద్యులను సంప్రదించండి.
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి