కాకర కాయ.. అంటేనే చాలా మందికి ఇష్టం ఉండదు. కాకక కాయతో వంటలు చేస్తే ఆమడ దూరం పారిపోతారు. కానీ ఎన్నో దీర్ఘకాలిక వ్యాధులకు చెక్ పెడుతుంది కాకర కాయ. కాకరలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు, పోషకాలు దాగి ఉన్నాయి. వీటి వల్ల అనారోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చు. అయితే కొంత మంది మాత్రం కాకరను ఇష్టంగా తింటూంటారు. కాకర కాయతో ఆరోగ్యాన్నే కాదు.. చర్మ సౌందర్యాన్ని కూడా రెట్టింపు చేసుకోవచ్చు. కాకర కాయలో చర్మ సమస్యలను తగ్గించే గుణాలు మెండుగా ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. మరి అందాన్ని పెంచుకునేందుకు కాకరను ఎలా ఉపయోగించుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
మొటిమలు – మచ్చలు మాయం:
మొటిమలు, మచ్చలను తగ్గించడంలో కాకర కాయ హెల్ప్ చేస్తుంది. ముఖాన్ని నీటిగా ఉంచుతుంది. కొద్దిగా కాకర కాయ జ్యూస్ ను గిన్నెలోకి తీసుకోవాలి. దీనిలో కొంచెం కరివేపాకు పొడిని వేసి, మిక్స్ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని కాటన్ సహాయంతో కానీ లేదా వేళ్లతో కానీ తీసుకుని ముఖానికి ప్యాక్ లాగా వేసుకోవాలి. ఈ ప్యాక్ బాగా ఆరిపోయాక.. గోరు వెచ్చటి నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా వారానికి ఒక్కసారైనా చేస్తూండటం వల్ల మొటిమలు, మచ్చలు లేని క్లియర్ చర్మం మీ సొంతం అవుతుంది.
నల్లటి మచ్చలను ఇలా తగ్గించుకోండి:
కొంత మంది ముఖంపై నల్లటి మచ్చలతో ఇబ్బంది పడుతూంటారు. అలాంటి వారు ఈ సారిక కాకర కాయను ట్రై చేయండి. కాకర కాయ జ్యూస్ ను కొద్దిగా గిన్నెలోకి తీసుకుని.. దీన్ని కాటన్ సహాయంతో ముఖమంతా రాసుకోవాలి. ఆరిపోయాక నీటితో క్లీన్ చేసుకోవాలి. ఇలా చేస్తూ ఉంటే నల్లటి మచ్చలు తగ్గిపోతాయి.
ముఖం అందంగా మారాలంటే:
ముఖం అందంగా మారాలంటే.. కాకర కాయతో ఫేస్ ప్యాక్ కూడా వేసుకోవచ్చు. కాకర కాయను ముక్కలుగా కట్ చేసి.. మిక్సీలో మెత్తగా పేస్ట్ లా చేసుకోవాలి. ఈ కాకర పేస్ట్ లోకి కొద్దిగా జాజికాయ పొడి, కొద్దిగా పెరుగు కలిపి ముఖానికి ఫేస్ ప్యాక్ లా వేసుకోవాలి. ఈ ప్యాక్ ఆరిపోయాక.. గోరు వెచ్చటి నీటితో క్లీన్ చేసుకోవడమే. ఇలా చేస్తే ఫేస్ అందంగా కనిపిస్తుంది.
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
గమనిక: ఇది నిపుణుల నుంచి సేకరించిన సమాచారం. దీన్ని ఫాలో అయ్యే ముందు ఒకసారి వైద్యుల్ని సంప్రదించడం మేలు.