వంటింట్లో పోపులడబ్బాలో ఉండే లవంగం గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. లవంగాన్ని ఆయుర్వేదంలో ఎక్కువగా ఉపయోగిస్తారు. ఒక్క పంటినొప్పికే కాకుండా దీంతో చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఇది శరీరానికి చేసే మేలు అంతా ఇంతా కాదు. మరి దీని వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటో.. దీన్ని శరీరానికి తగినట్లు ఎలా వాడాలో ఇప్పుడు తెలుసుకుందాం.
లవంగం రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఇన్ఫెక్షన్లతో పోరాడుతుంది. ఎండిన లవంగం తెల్లరక్త కణాల పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. దీనిలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి మీ కాలేయాన్ని దెబ్బతీసే ఫ్రీ రాడికల్స్‌తో పోరాడతాయి.
శ్వాసకోశ వ్యాధులను లవంగం నివారిస్తోంది. దగ్గు, స్వరపేటికవాపు, గొంతు నొప్పి వంటి వాటిని ఎదుర్కోడానికి సహజంగా పని చేస్తుంది. కీళ్ల నొప్పులు ఎక్కువగా ఉన్నప్పుడు.. రోజూ లవంగాలను తీసుకుంటే ఉపశమనం లభిస్తుంది. ప్రస్తుతం ఇప్పుడున్న జీర్ణ సమస్యలు సర్వసాధారణం. వికారం, పొట్టలో పుండ్లు, అజీర్తి మనల్ని ఇబ్బంది పెట్టే జీర్ణ సంబంధిత రుగ్మతలను తగ్గిస్తుంది.
ఏదైనా తిన్నది సరిగ్గా లేక వాంతులు వచ్చినప్పుడు కడుపు లో వికారంగా ఉన్నప్పుడు లవంగాల నూనెను తీసుకోవడం వల్ల ఉపశమనంగా ఉంటుంది. తేనె, కొన్ని లవంగాల నూనెను గోరు వెచ్చని నీటిలో కలిపి రోజుకు మూడు సార్లు తాగితే జలుబు నుంచి ఉపశమనం పొందవచ్చు.
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం..