AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Red Foods Benefits: రెడ్ ఫుడ్స్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు మీకు తెలుసా..?

ఎరుపు రంగు పండ్లు, కూరగాయలు చాలా మందికి పెద్దగా ప్రాముఖ్యత ఉండకపోయినా, వీటి పోషక విలువలు, ఆరోగ్య ప్రయోజనాలు అద్భుతమైనవి. వీటిలో ఉండే యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు, మినరల్స్ ఎన్నో ఆరోగ్య సమస్యలకు పరిష్కారంగా నిలుస్తాయి. ప్రతి రోజూ ఆహారంలో భాగం చేసుకోవడం ద్వారా ఆరోగ్యం మెరుగుపడుతుంది.

Prashanthi V
|

Updated on: Jan 24, 2025 | 1:26 PM

Share
ఎరుపు రంగులో మెరిసే రెడ్ బెల్ పెప్పర్స్ వంటకాల అందాన్ని పెంచడంతో పాటు, మంచి ఆరోగ్యాన్ని అందిస్తాయి. ఇందులో విటమిన్ సి పుష్కలంగా ఉండటం వల్ల ఇది ఇమ్యూనిటీని పెంచడంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. రెడ్ బెల్ పెప్పర్స్‌లో ఉండే క్వెర్సెటిన్ వంటి యాంటీఆక్సిడెంట్లు శరీరంలోని వాపును తగ్గించడంలో, దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడతాయి.

1 / 5
ఎర్రగా మెరిసే టమోటాలు ప్రతి వంటకంలో ప్రత్యేకమైన స్థానం పొందాయి. వీటిలో లైకోపీన్, విటమిన్ సి, బీటా కెరోటిన్ వంటి యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. టమోటాలు గుండె ఆరోగ్యానికి అద్భుతంగా పనిచేస్తాయి. గుండె జబ్బుల రిస్క్‌ను తగ్గించడం, క్యాన్సర్‌లను నిరోధించడం వీటి ప్రధాన ప్రయోజనాలు. తక్కువ కేలరీలతో పాటు అధిక ఫైబర్‌ను కలిగి ఉండటం వల్ల బరువు తగ్గాలని కోరుకునే వారి ఆహారంలో టమోటాలు ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి.

2 / 5
ఇతర కూరగాయలతో పోలిస్తే రెడ్ క్యాబేజీ చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. ఈ కూరగాయలో ఆంథోసైనిన్స్, విటమిన్ సి, విటమిన్ కె, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. ఇది జీర్ణక్రియను మెరుగుపరచడంలో, రోగనిరోధక శక్తిని పెంచడంలో, ఎముకల ఆరోగ్యానికి మేలు చేయడంలో చాలా సహాయపడుతుంది. అంతేకాదు, ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించడంలో ఇది ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది.

3 / 5
తేలికైన తీపి రుచితో, అందరినీ ఆకట్టుకునే స్ట్రాబెర్రీలు పుష్కలమైన పోషకాలను అందిస్తాయి. వీటిలో విటమిన్ సి, మాంగనీస్, యాంటీ-ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉంటాయి. ఆంథోసైనిన్స్, ఎలాజిక్ యాసిడ్ వంటి యాంటీఆక్సిడెంట్లు చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో కీలక పాత్ర పోషిస్తాయి. స్ట్రాబెర్రీలను తినడం వల్ల గుండె ఆరోగ్యానికి మేలు కలిగించడమే కాకుండా.. రక్తంలో చక్కెర స్థాయిలను సరిచేసే గుణం కూడా ఉంటుంది.

4 / 5
తీపి రుచితో ఎర్రగా మెరిసే చిలగడదుంపలు ఆరోగ్యకరమైన కార్బోహైడ్రేట్లకు మంచి మూలం. వీటిలో నైట్రేట్‌లు అధికంగా ఉండటం వల్ల రక్తపోటును నియంత్రణలో ఉంచడంలో, శరీరానికి అవసరమైన ఆక్సిజన్ వినియోగాన్ని మెరుగుపరచడంలో కీలకంగా పనిచేస్తాయి. ఇందులో ఫైబర్, ఫోలేట్, విటమిన్ సి వంటి పోషకాలు గుండె ఆరోగ్యం, జీర్ణక్రియ, ఇమ్యూనిటీని పెంచడంలో సహాయపడతాయి.

5 / 5