AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఈ పార్ట్స్‌ను పొరపాటున కూడా చేతులతో తాకకూడదు.. ఎందుకో తెలుసా..?

మన రోజువారీ జీవితంలో చేతుల పనితనం ఎంతో ఉంటుంది. తెలిసి గానీ, తెలియక గానీ మనం అనేక వస్తువులను తాకుతుంటాం. ఫలితంగా చేతులపై అనేక రకాల క్రిములు, బ్యాక్టీరియా చేరుతాయి. అలాంటి చేతులతో శరీరంలోని కొన్ని సున్నితమైన భాగాలను తాకడం వల్ల ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశముంది. కాబట్టి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే ఏ భాగాలను తాకకూడదో తెలుసుకోవడం అవసరం.

ఈ పార్ట్స్‌ను పొరపాటున కూడా చేతులతో తాకకూడదు.. ఎందుకో తెలుసా..?
Avoid Touching These Body Parts
Prashanthi V
|

Updated on: Mar 15, 2025 | 3:04 PM

Share

ముఖం చాలా సున్నితమైన భాగం. చాలా మంది అలవాటుగా చేతులతో ముఖాన్ని తాకుతూ ఉంటారు. అయితే ఇలా చేయడం వల్ల ముఖంపై ఉన్న రంధ్రాలు మూసుకుపోయి మొటిమలు, దురద, చర్మ సమస్యలు రావచ్చు. ముఖ్యంగా చేతుల ద్వారా ధూళి, బ్యాక్టీరియా ముఖంపై చేరి చర్మం పొడిబారిపోవడం లేదా అలర్జీలు ఏర్పడే ప్రమాదం ఉంది. అందుకే ముఖాన్ని చేతులతో పదే పదే తాకకుండా ఉండటం మంచిది.

చెవుల్లోని లోపలి భాగం చాలా సున్నితంగా ఉంటుంది. చేతులు శుభ్రంగా లేకుండా చెవులను తాకడం వల్ల ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం ఎక్కువ. కొందరికి చెవుల్లో చెదిరిన మైనం తొలగించేందుకు వేళ్లు పెట్టే అలవాటు ఉంటుంది. కానీ ఇది హానికరం. చెవుల్లో ఏదైనా అసౌకర్యం ఉంటే డాక్టర్ సలహా తీసుకోవడం ఉత్తమం.

చాలా మందికి తెలియకుండానే చేతులను నోటికి దగ్గరగా తీసుకెళ్లే అలవాటు ఉంటుంది. తినేటప్పుడు మాత్రమే కాకుండా ఖాళీ సమయాల్లోనూ ఈ అలవాటు చూస్తుంటాం. చేతుల ద్వారా వచ్చే క్రిములు నేరుగా నోటిలోకి వెళ్లి జీర్ణ సమస్యలు, ఫుడ్ పాయిజన్ వంటి ఇబ్బందులను కలిగించవచ్చు. అందుకే చేతులను తరచుగా కడుక్కోవడం నోటికి తాకకుండా ఉండటం ఆరోగ్యానికి మంచిది.

కళ్లను తరచుగా చేతులతో తాకడం వల్ల అనేక రకాల ఇన్ఫెక్షన్లు రావచ్చు. దురద కలిగినప్పుడు చాలా మంది చేతులతో గట్టిగా రుద్దుతుంటారు. అయితే ఇలా చేయడం వల్ల కళ్లలో బ్యాక్టీరియా చేరి ఇన్ఫెక్షన్లు, ఎర్రదనం, కంటి పొడిబారడం వంటి సమస్యలు వస్తాయి. అందుకే చేతులు శుభ్రంగా లేకపోతే కళ్లను తాకకూడదు.

కొంతమందికి ముక్కులో వేళ్లు పెట్టుకునే అలవాటు ఉంటుంది. కానీ ఇది చాలా ప్రమాదకరం. ముక్కులో వేళ్లు పెట్టడం వల్ల స్టెఫిలోకాకస్ ఆరియస్ అనే హానికరమైన బ్యాక్టీరియా వ్యాప్తి చెందే ప్రమాదం ఉంది. దీని వల్ల జలుబు, అలర్జీ, శ్వాసకోశ సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అందుకే ముక్కును శుభ్రం చేసుకోవాలంటే టిష్యూ లేదా శుభ్రమైన బట్టను ఉపయోగించడం ఉత్తమం.

మలద్వారం శరీరంలో అత్యంత సున్నితమైన భాగాల్లో ఒకటి. కొంత మందికి దురద లేదా చెమట వల్ల మలద్వారాన్ని తాకే అలవాటు ఉంటుంది. కానీ ఇది చాలా ప్రమాదకరం. చేతుల ద్వారా క్రిములు వ్యాపించి జీర్ణ సంబంధిత ఇన్ఫెక్షన్లు రావచ్చు. అందుకే శుభ్రత పద్ధతులను పాటిస్తూ అవసరమైన జాగ్రత్తలు తీసుకోవడం మంచిది.

మన చేతులు రోజూ అనేక వస్తువులను తాకుతాయి. అందుకే శరీరంలోని కొన్ని భాగాలను అనవసరంగా తాకకూడదు. ముఖం, చెవులు, ముక్కు, కళ్ల వంటి సున్నితమైన భాగాలను చేతులతో తాకడం అనారోగ్య సమస్యలకు దారి తీస్తుంది. కాబట్టి శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవాలంటే శుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వడం, చేతులను తరచుగా కడుక్కోవడం, అవసరం లేని స్థితిలో శరీర భాగాలను తాకకుండా ఉండటం ఉత్తమం.

అమెరికా నుంచి వచ్చి సర్పంచ్‌ ఎన్నికల్లో పోటీ!
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్‌ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్‌ ఫ్రీగా చేస్తా
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్‌ ఫ్రీగా చేస్తా
అర్జెంట్‌గా డబ్బు కావాలా? గోల్డ్ లోన్ vs పర్సనల్ లోన్.. ఏది బెటర్
అర్జెంట్‌గా డబ్బు కావాలా? గోల్డ్ లోన్ vs పర్సనల్ లోన్.. ఏది బెటర్
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
సాయి పల్లవికి పొగరెక్కువన్న యంగ్ హీరో..
సాయి పల్లవికి పొగరెక్కువన్న యంగ్ హీరో..
భారత సాహిత్యాన్ని ప్రపంచానికి చేర్చిన మోదీ
భారత సాహిత్యాన్ని ప్రపంచానికి చేర్చిన మోదీ
చికెన్ కడిగితే విషమే.. క్లీనింగ్ పేరుతో మీరు చేస్తున్న అతిపెద్ద..
చికెన్ కడిగితే విషమే.. క్లీనింగ్ పేరుతో మీరు చేస్తున్న అతిపెద్ద..
మొబైల్‌ ఛార్జర్‌ నకిలీదా? నిజమైనదా?సింపుల్‌ ట్రిక్‌తో గుర్తించండి
మొబైల్‌ ఛార్జర్‌ నకిలీదా? నిజమైనదా?సింపుల్‌ ట్రిక్‌తో గుర్తించండి
ఏంటన్నా ఇలా మారిపోయావ్.. హీరోగా టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్!
ఏంటన్నా ఇలా మారిపోయావ్.. హీరోగా టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్!