Menstruation: నెలసరి సమయంలో ఈ పనులు చేస్తున్నారా..? అయితే ఇది మీకోసమే..!
మహిళలు నెలసరి సమయంలో అనుసరించాల్సిన కొన్ని ఆరోగ్యకరమైన అలవాట్లు తప్పితే అనేక అసౌకర్యాలు ఎదురవుతాయి. అనారోగ్యకరమైన ఆహారం, తగినంత నీరు తాగకపోవడం, కాఫీ, ఆల్కహాల్, ఒత్తిడి, నిద్ర లోపం వంటి కారణాల వల్ల నెలసరి నొప్పులు పెరిగిపోతాయి. ఈ అలవాట్లు హార్మోన్ల అసమతుల్యతను కలిగిస్తాయి.

ప్రతి మహిళా నెలసరి సమయంలో అనేక అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. కడుపు నొప్పి, అలసట, నీరసం, మూడ్ స్వింగ్స్ ఇలా అనేక రకాల సమస్యలతో బాధపడుతుంటారు. అయితే కొన్ని అలవాట్ల వల్ల ఈ సమస్యలు తీవ్రంగా మారుతాయి. ఇప్పుడు మనం ఆ అలవాట్లు, వాటి నుంచి ఎలా బయటపడాలి అనే విషయాల గురించి మాట్లాడుకుందాం.
వాటర్ తాగడం తప్పనిసరి
వాటర్ తగినంత తీసుకోకపోతే శరీరం డీహైడ్రేషన్‌కు గురవుతుంది. ఇది ఉబ్బరం, నొప్పుల పెరుగుదలకి కారణం అవుతుంది. అందుకే ప్రతి రోజూ సరిపడా వాటర్ తాగడం ఎంతో ముఖ్యం. ముఖ్యంగా పీరియడ్స్ సమయంలో అయితే చాలా ముఖ్యం.
హెల్తీ డైట్ ప్లాన్
మీ ఫుడ్ డైట్ లో విటమిన్లు, మెగ్నీషియం, ఒమేగా 3 వంటి పోషకాలు లేకపోతే నెలసరి సమయంలో పొత్తికడుపులో తీవ్రమైన నొప్పి, ఉబ్బరం పెరుగుతాయి. ప్రాసెస్ ఫుడ్ ఎక్కువగా తినే మహిళలు ఈ సమస్యను మరింత అనుభవిస్తారు. దీనిని నివారించడానికి పండ్లు, కూరగాయల వంటివి తీసుకోవడం మంచిది.
కేఫీన్, ఆల్కహాల్ తీసుకోవద్దు
ఋతుస్రావ సమయంలో కేఫీన్, ఆల్కహాల్ వాడకం శరీరానికి హానికరం. ఇది నొప్పులను మరింత పెంచుతుంది. అందువల్ల ఈ సమయంలో వాటిని దూరం పెట్టడం మంచిది.
ఓవర్ స్ట్రెస్ మంచిది కాదు
ఎక్కువ ఒత్తిడి నెగటివ్ హార్మోన్ల ఉత్పత్తిని పెంచుతుంది. ఇది మన రుతుచక్రంపై ప్రభావం చూపించి పీరియడ్స్ ఆలస్యం అవడమే కాకుండా నొప్పులు, మూడ్ స్వింగ్స్‌ను కూడా మరింత పెంచుతుంది. ఒత్తిడిని తగ్గించుకోవడానికి యోగా, ధ్యానం చేయడం అనేది చాలా ఉపయోగంగా ఉంటుంది.
సరైన నిద్ర చాలా ముఖ్యం
నిద్ర పూర్తిగా లేకపోవడం వల్ల హార్మోన్ల ఉత్పత్తి సమతుల్యం తప్పుతుంది. ఇది రుతుచక్రాన్ని ప్రభావితం చేస్తుంది. నిద్ర లేకపోవడం వల్ల వాపు, నొప్పి, మానసిక ఆందోళనలతో పాటు ఆరోగ్య సమస్యలు కూడా ఉత్పన్నమవుతాయి.
శరీర బరువులో మార్పులు
బరువు పెరగడం లేదా తగ్గడం కూడా హార్మోన్ల అసమతుల్యతకు దారితీస్తుంది. ఈ మార్పులు నెలసరి సమయంలో శరీరానికి భారం పెడతాయి. ఫిట్‌నెస్‌పై శ్రద్ధ పెడితే ఈ సమస్యలను తగ్గించుకోవచ్చు. వీటన్నింటిని గుర్తించి హెల్తీ ఫుడ్ డైట్ ఫాలో అవ్వండి. దీని ద్వారా మహిళలు నెలసరి సమయంలో ఉన్న అసౌకర్యాన్ని తగ్గించుకోవచ్చు. ఆరోగ్యంగా, ఆనందంగా ఉండొచ్చు.