AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Paracetamol: ప్రతిదానికీ పారాసెటమాల్ వాడుతున్నారా? అయితే మీకు టికెట్ కన్ఫార్మ్ అయినట్టే.!

పారాసెటమాల్ టాబ్లెట్ వేసుకుంటున్నారా? నొప్పలకు, జ్వరానికి పారాసెటమాల్ వాడుతున్నారా? అయితే జాగ్రత్త.. పారాసెటమాల్ తరుచు తీసుకోవడం చాలా ప్రమాదకరమని ఓ అధ్యయనంలో వెల్లడైంది.

Paracetamol: ప్రతిదానికీ పారాసెటమాల్ వాడుతున్నారా? అయితే మీకు టికెట్ కన్ఫార్మ్ అయినట్టే.!
Paracetimol Side Effects
Velpula Bharath Rao
|

Updated on: Dec 16, 2024 | 8:30 AM

Share

ఈ రోజుల్లో పారాసెటమాల్ వాడకం సర్వసాధారణమైపోయింది. తలనొప్పి, జ్వరం లేదా తేలికపాటి నొప్పి కోసం అందరూ తరచుగా వైద్యుల సలహా లేకుండా దీనిని తీసుకుంటున్నారు. పారాసెటమాల్ వృద్ధుల మూత్రపిండాలు, గుండెపై ప్రతికూల ప్రభావాలను చూపుతుందని ఇటీవల ఒక అధ్యయనంలో తేలింది. దీంతో ఈ ఔషధం శరీర భాగాలపై ఎలా చెడు ప్రభావాన్ని చూపుతుందో తెలుసా? పారాసెటమాల్  ఎలా పనిచేస్తుందో తెలుసా? నివారణ పద్ధతులు ఏమిటో తెలుసుకుందాం..

పారాసెటమాల్  ఎలా పనిచేస్తుంది?

పారాసెటమాల్ శరీర నొప్పిలకు, జ్వరాన్ని తగ్గించే ఔషధం. పారాసెటమాల్ నొప్పి, జ్వరం కలిగించే మెదడులోని రసాయనాల ప్రభావాన్ని తగ్గిస్తుంది. ఇది సాధారణంగా తేలికపాటి నుండి మితమైన నొప్పి, జ్వరం, మైగ్రేన్, ఆర్థరైటిస్ వంటి వ్యాధులతో బాధపడుతున్న వారికి ఇది వైద్యులు సూచిస్తూ ఉంటారు. అది మితంగా తీసుకోవాలని వారు సూచిస్తూ ఉంటారు. ఈ ఔషధాన్ని ఎక్కువ మోతాదులో తీసుకోవడం లేదా చాలా కాలం పాటు తీసుకోవడం వల్ల శరీరంలోని అనేక ముఖ్యమైన అవయవాలు దెబ్బతింటాయి.

అధ్యయనంలో బయటపడిన సంచలన విషయాలు

బ్రిటన్‌లోని నాటింగ్‌హామ్ విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు తమ అధ్యయనంలో పారాసెటమాల్‌ను ఎక్కువ మోతాదులో తీసుకోవడం, చాలా కాలం పాటు తీసుకోవడం వల్ల జీర్ణవ్యవస్థ, మూత్రపిండాలపై ప్రతికూల ప్రభావం చూపుతుందని తేలింది. పారాసెటమాల్ తీసుకోవడం ముఖ్యంగా వృద్ధులకు ప్రమాదకరం. ఎక్కువ సేపు తీసుకుంటే పొట్టలో అల్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువ. ఇది కడుపు పొరను దెబ్బతీస్తుంది, ఇది జీర్ణ సమస్యలను కలిగిస్తుంది. అంతే కాకుండా, ఈ ఔషధం మూత్రపిండాలను కూడా ప్రభావితం చేస్తుంది. మూత్రపిండాలు శరీరం నుండి విష పదార్థాలను తొలగించడంలో సహాయపడతాయి. అయితే పారాసెటమాల్ ఎక్కువగా వాడితే మూత్రపిండాలపై ఒత్తిడిని పెరుగుతుంది. వృద్ధులలో కిడ్నీ పనితీరు ఇప్పటికే బలహీనంగా ఉంటుంది. కాబట్టి పారాసెటమాల్ తీసుకోవడం వల్ల మరింత క్షిణించే అవకాశం ఉంది.

పారాసెటమాల్ ప్రభావం కేవలం జీర్ణవ్యవస్థ, కిడ్నీలకే పరిమితం కాకుండా గుండెపై కూడా ప్రభావం చూపుతుందని అధ్యయనంలో తేలింది. వృద్ధులు పారాసెటమాల్‌ను నిరంతరం ఉపయోగించడం వల్ల గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఉంది. ఇది రక్తపోటును కూడా ప్రభావితం చేస్తుంది. ఇది గుండెపై మరింత ఒత్తిడిని కలిగిస్తుంది. ఇప్పటికే గుండె సమస్యలు ఉన్నవారికి ఈ ఔషధం మరింత ప్రమాదకరం అని వైద్య నిపుణులు చెబుతున్నారు.

పారాసెటమాల్ తీసుకుంటున్నారా?

వైద్యుని సలహా లేకుండా పారాసెటమాల్ తీసుకోవద్దు. పారాసెటమాల్ మందులను ఎక్కువ కాలం పాటు తీసుకోవడం మంచిది కాదు. నొప్పులు లేదా జ్వరం ఉంటే వైద్యుడిని సంప్రదించండి. ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, ఆరోగ్యకరమైన జీవనశైలిని ఏర్పాటు చేసుకోండి. దీని వల్ల మందుల అవసరం ఉండదు.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి