బీ అలర్ట్.. డాక్టర్ తో పనిలేకుండా బీపీ ట్యాబెట్లు వేసుకుంటున్నారా, అయితే క్యాన్సర్ బారినపడ్డట్టే
మారుతున్న జీవనశైలి, ఉరుకుల పరుగుల జీవితం కారణంగా ఈ తరంవాళ్లు అనేక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. అయితే చాలామంది డాక్టర్ సలహాలను పాటించకుండానే మందులు వేసుకుంటున్నారు. అయితే ఇది ఎంత మాత్రం మంచిది కాదట. ప్రాణాలకు ముప్పు ఏర్పడే ప్రమాదం ఉందని డాక్టర్లు తేల్చి చెబుతున్నారు. అయితే చాలామంది బీపీ సమస్యతో బాధపడుతున్నారు.

మారుతున్న జీవనశైలి, ఉరుకుల పరుగుల జీవితం కారణంగా ఈ తరంవాళ్లు అనేక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. అయితే చాలామంది డాక్టర్ సలహాలను పాటించకుండానే మందులు వేసుకుంటున్నారు. అయితే ఇది ఎంత మాత్రం మంచిది కాదట. ప్రాణాలకు ముప్పు ఏర్పడే ప్రమాదం ఉందని డాక్టర్లు తేల్చి చెబుతున్నారు. అయితే చాలామంది బీపీ సమస్యతో బాధపడుతున్నారు. ఇందుకోసం అదుపులో ఉంచుకోవడానికి మందులను తీసుకుంటున్నారు. షాకింగ్ విషయం ఏమిటంటే.. వైద్యుడిని సంప్రదించకుండా రక్తపోటు మందులు తీసుకుంటే క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది.
రక్తపోటు అనేది చాలా సాధారణమైన సమస్య. ప్రతి ఇంటిలో బాధితులు ఉంటారు. ఈ సమస్య పెరుగుతున్న వయస్సు, అనారోగ్య జీవనశైలి కారణంగా వస్తుంది. BP కంట్రోల్ చేయడానికి మందులు తీసుకోవాలి. కానీ డాక్టర్ సలహా లేకుండా బీపీ మందులు తీసుకుంటే అది పెరుగుతుందని ఓ పరిశోధన పేర్కొంది. అంతేకాదు.. చర్మ క్యాన్సర్ కు దారీతియవచ్చు.
బీపీ మందులను తీసుకోవడం చర్మ క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతుంది. హైడ్రోక్లోరోథియాజైడ్ చర్మాన్ని సూర్యకిరణాలకు మరింత సున్నితంగా మార్చడం వల్ల అనారోగ్య సమస్యల బారిన పడేట్లు చేస్తుందని పరిశోధకులు అంటున్నారు. రక్తపోటుకు సంబంధించిన మందులు వాడుతున్నట్లయితే వైద్యుల సలహా మేరకు మాత్రమే తీసుకోవాల్సి ఉంటుంది. డాక్టర్లను సంప్రదించకుండా సొంతంగా ఏ ఒక్క మందుబిల్లను తీసుకోవద్దు. ఇష్టం వచ్చినట్టు మందులు వాడితే గుండెపోటుతో పాటు బ్రెయిన్ స్ట్రోక్ ప్రమాదాన్ని పెంచుతుంది.
చర్మ క్యాన్సర్‌ను ఎలా నివారించాలంటే..
డాక్టర్ తో మాట్లాడి హైడ్రోక్లోరోథియాజైడ్ లేని బీసీ ట్యాబెట్లు వేసుకోవాలి. ఉదయం, సాయంత్రం వేళ సూర్యకాంతి నుండి చర్మాన్ని రక్షించుకోవచ్చు. ఎండలో బయటకు వెళ్లేటప్పుడు కనీస జాగ్రత్తలు తీసుకోవాలి. చర్మంలో ఏవైనా మార్పులను గమనించి వెంటనే చికిత్స తీసుకోవాలి కుటుంబంలో ఎవరైనా చర్మ క్యాన్సర్ ఉన్నట్లయితే మరింత జాగ్రత్తగా ఉండండి



