Health: ఈ లక్షణాలతో బాధపడుతున్నారా.? అయితే మీలో కొలెస్ట్రాల్ పెరిగినట్లే.. వెంటనే అలర్ట్ అవ్వండి..
మారుతోన్న జీవనశైలి, తీసుకునే ఆహారంలో మార్పులు కారణంగా కొలెస్ట్రాల్ పెరుగుతోన్న వారి సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతోంది. కాలక్రమేణ ఇది తీవ్ర అనారోగ్య సమస్యకు దారి తీసే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అధిక కొలెస్ట్రాల్ కారణంగా..

మారుతోన్న జీవనశైలి, తీసుకునే ఆహారంలో మార్పులు కారణంగా కొలెస్ట్రాల్ పెరుగుతోన్న వారి సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతోంది. కాలక్రమేణ ఇది తీవ్ర అనారోగ్య సమస్యకు దారి తీసే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అధిక కొలెస్ట్రాల్ కారణంగా ధమనుల్లో రక్తం సాఫీగా సాగకుండా అడ్డుకట్ట పడుతుంది. వెరసి హృదయ సంబంధిత రోగాలకు దారి తీస్తుంది. అయితే ఈ అధిక కొలెస్ట్రాల్‌ను ముందుగానే గుర్తించడం వల్ల ముందుగానే వ్యాధిని కంట్రోల్ చేసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఇంతకీ చెడు కొలెస్ట్రాల్‌తో బాధపడుతోన్న వారిలో కనిపించే ఆ లక్షణాలు ఏంటో ఓసారి తెలుసుకుందాం..
* గుండెకు రక్తాన్ని చేరవేసే సిరల్లో కొలెస్ట్రాల్ పేరుకుపోయినట్లయితే ఛాతీ నొప్పి సమస్య కావచ్చు. ఈ కారణంగా, కొన్నిసార్లు ఛాతిలో నొప్పి వస్తుంది. అలాగే ఛాతిపై ఏమైనా భారం పెట్టినా నొప్పిగా ఉంటుంది.
* అధిక కొలెస్ట్రాల్ కారణంగా కాళ్ల ధమనులలో రక్త ప్రసరణను అడ్డుకుంటుంది. ఫలితంగా కాళ్లకు రక్తం సరిగా చేరక నడవడంలో ఇబ్బంది, కాళ్ల నొప్పులు, కాళ్లపై చర్మం రంగు మారడం వంటి సమస్యలు తలెత్తుతాయి. కొన్ని సందర్భాల్లో పాదాలు చల్లగా కూడా మారుతుంటాయి.
* కొందరిలో ఛాతి నొప్పితో పాటు గుండెలో కూడా నొప్పి లక్షణం కనిపిస్తుంది. ఇది కూడా హై కొలెస్ట్రాల్‌కు సూచనగా భావించాలి. అధిక కొలెస్ట్రాల్ గుండెపోటు, స్ట్రోక్‌లకు దారి తీసే ప్రమాదం ఉంటుంది.
అసలు ఈ సమస్య ఎందుకు వస్తుంది.?
సాధారణంగా ఆహారంలో పోషకాల లోపం, జంక్ ఫుడ్ ఎక్కువగా తీసుకునే వారిలో కొలెస్ట్రాల్ సమస్యలు ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉంటాయి. అంతేకాకుండా ప్యాకేజ్డ్ ఫుడ్స్ ఎక్కువగా తీసుకోవడం వల్ల కూడా చెడు కొలెస్ట్రాల్ పేరుకుపోతుంది. వ్యాయామం లేకపోవడం, ఊబకాయం కూడా అధిక కొలెస్ట్రాల్‌కు కారణంగా చెప్పొచ్చు. ధూమపానం, మద్యం సేవించే వారికి అధిక కొలెస్ట్రాల్ సమస్య వచ్చే అవకాశం ఉంటుంది.
మరిన్ని హెల్త్ ఆర్టికల్స్ కోసం క్లిక్ చేయండి..