Health: శారీరకంగా బలహీనంగా ఉన్నారా.? అయితే ఈ ఫుడ్ తీసుకోండి.. తేడా మీకే తెలుస్తుంది.
Health: కొందరు ఎంత తిన్నా ఎప్పుడూ నిస్సత్తువతో ఉంటారు. శారీరకంగా చాలా బలహీనంగా ఉంటారు. అయితే ఈ నిస్సత్తువ పెద్ద వారిలోనే కాకుండా ఇటీవల తక్కువ వయసున్న వారిలో కూడా కనిపిస్తోంది. దీనికి కారణం సరైన శారీరక శ్రమ లేకపోవడం ఒకటైతే, సరైన ఆహారం...
Health: కొందరు ఎంత తిన్నా ఎప్పుడూ నిస్సత్తువతో ఉంటారు. శారీరకంగా చాలా బలహీనంగా ఉంటారు. అయితే ఈ నిస్సత్తువ పెద్ద వారిలోనే కాకుండా ఇటీవల తక్కువ వయసున్న వారిలో కూడా కనిపిస్తోంది. దీనికి కారణం సరైన శారీరక శ్రమ లేకపోవడం ఒకటైతే, సరైన ఆహారం తీసుకోకపోవడం. దీంతో ఇది శారీరక ఆరోగ్యంపైనే కాకుండా మానసిక ఆరోగ్యంపై కూడా పడుతుంది. అయితే కొన్ని రకాల ఆహార పదార్థాలు రోజువారీ డైట్‌లో భాగం చేసుకుంటే శారీరకంగా బలంగా మారొచ్చని మీకు తెలుసా.? అలాంటి కొన్ని ఎనర్జిటిక్ ఫుడ్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
* గుడ్డులో ఎన్నో రకాల పోషకాలు ఉంటాయని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రోజుకో గుడ్డు తింటే అనారోగ్యం దరిచేరదని నిపుణులు చెబుతుంటారు. కాబట్టి క్రమం తప్పకుండా రోజూ గుడ్డు తీసుకుంటే అనారోగ్యాలు దరిచేరకుండా ఉండడమే కాకుండా శారీరకంగా కూడా ధృడంగా మారొచ్చు.
* ఇక శాఖహారులు సులభంగా శక్తిని పొందాలంటే పన్నీరు, తృణ ధాన్యాలు, బీన్స్ బెస్ట్ ఆప్షన్స్‌గా చెప్పొచ్చు. వీటిలో ఉండే మెగ్నిషియంతో పాటు ప్రోటీన్లు శరీరానికి తక్షణ శక్తిని అందిస్తాయి.
* శారీరకంగా బలహీనంగా ఫీలవుతున్న వారు ఓట్స్‌ను అలవాటు చేసుకోవాలి. ముఖ్యంగా పాలల్లో కలిపి తీసుకుంటే శరీరానికి సరిపడ శక్తి అందుతుంది. ఇందులో ఉండే ఫైబర్ జీర్ణ శక్తిని మెరుగుపరిచి శక్తి అందేలా చేస్తుంది.
* అరటి పండును ఆహారంలో భాగం చేసుకోవాలని వైద్యులు సూచిస్తూనే ఉంటారు. శారీరక నిస్సత్తువను అరటి పండుతో చెక్ పెట్టవచ్చు. ఇందులో ఉండే పొటాషియం, మినరల్స్ శరీరంలో శక్తి స్థాయిలను వెంటనే పెంచుతాయి.
* డ్రైఫ్రూట్స్ కూడా శారీరకంగా బలవంతులను చేస్తుంది. ముఖ్యంగా పిస్తా, బాదం, గుమ్మడికాయ విత్తనాలు తీసుకోవడం వల్ల శరీరానికి కావాల్సిన శక్తి అందుతుంది.
* శరీరానికి అవసరయ్యే నీరు అందకపోయినా శరీరం బలహీనంగా మారిన భావన కలుగుతుంది. కాబట్టి కచ్చితంగా సరిపడా నీటిని తీసుకోవాలి. కేవలం నీరే కాకుండా గ్రీన్‌టీలాంటివి కూడా అలవాటు చేసుకుంటే శరీరానికి మంచివి.
నోట్: పైన తెలిపిన ఈ సహజమైన టిప్స్ ద్వారా శరీరానికి కావాల్సిన శక్తిని సొంతం చేసుకోవచ్చు. అయితే ఎవరైనా ఎక్కువ కాలం నుంచి శారీరకంగా బలహీనంగా ఉంటే మాత్రం వెంటనే వైద్యుడిని సంప్రదించడం ఉత్తమమం. కొన్ని సందర్భాల్లో శారీరక బలహీనతకు అనారోగ్య సమస్యలు కూడా కారణమవుతుంటాయనే విషయాన్ని మర్చిపోకూడదు..
Also Read: Shruti Haasan: అమెజాన్ ప్రైమ్‌లో బెస్ట్ సెల్లర్ సిరీస్.. కీలకపాత్రలో శ్రుతి హాసన్..
Srikakulam Crime: శ్రీకాకుళం జిల్లాలో దారుణం.. మద్యం తాగొద్దన్నందుకు భార్య, సోదరి హత్య!